Showing posts with label టంగుటూరి సూర్యకుమారి. Show all posts
Showing posts with label టంగుటూరి సూర్యకుమారి. Show all posts

Thursday, January 5, 2017

హెచ్.ఎమ్.వి. వారి అరుదైన పాటల క్యాసెట్లు

2000లో “Millennium” the finest collection అంటూ హెచ్.ఎమ్.వి. వారు పదిక్యాసెట్ల ఆల్బమ్ తీసుకువచ్చారు. దాంట్లో మొదటి మూడు క్యాసెట్లలో 1936 నుండి 1950 మధ్యకాలంలో విడుదలైన కొన్నిచిత్రాలలోని కొన్నిపాటలను పొందుపరిచారు. రూపకల్పన వి.ఎ.కె. రంగారావు గారు. ఆ వివరాలేమిటోచూసి చివరగా ఈ కింది సినిమాలలోనివి ఓ రెండు పాటలు విందాము. 









వేమూరి గగ్గయ్య గారు పాడిన పద్యాలు – శిశుపాలుడిపాత్ర – 1936 – ద్రౌపది వస్త్రాపహరణము

మిక్కిలినేని వారి నటరత్నాలు




 
..

Source: Sakhiyaa.com





టి. సూర్యకుమారి గారు పాడిన – ముదముగా – 1941 – చంద్రహాస 
Source: The Hindu





..

Source: Sakhiyaa.com








Tags: T. Suryakumari, Vemuri Gaggayya, Gaggaiah, V.A.K. Rangarao

Friday, November 20, 2015

టంగుటూరి సూర్యకుమారి గారి ఫోటోలు – ఓ పాట

పాత సంచికలలో ముఖచిత్రాలుగా వచ్చిన టంగుటూరి సూర్యకుమారి గారి ఫోటోలు కొన్ని చూద్దాము. చివరగా దీనబంధు 1942 సినిమా నుండి “రార బిరాన రారా నామార” అనే శంకరంబాడి సుందరాచారి గారి పాట సూర్య కుమారి గారి గళంలో విందాము. 



















...
Tags: Tanguturi Suryakumari, T Suryakumari, Tangutoori, Surya Kumari, Sankarambadi Sundarachari, Samkarambadi, Deenabandhu, Rara birana rara namara

Monday, September 15, 2014

జానపద గేయాలు – అనసూయాదేవి గారు

అనసూయా దేవిగారు పాడిన “బందారు చిన్నదాన బాజాబందూలదాన” అనే పాట అలాగే “నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా” అనే పాట విందాము. అయితే ఈ సందర్భంగా సూర్యకుమారి గారిని గూడా మననం చేసుకోవాలి. ఆవిడ కూడా ఈ పాట పాడారు. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా రికార్డు చేసిన వీడియోను యూట్యూబ్ లో ఉంచిన శ్రీ ఎన్. అప్పారావు గారికి కృతజ్నతలతో ఆ పాట కూడా చూద్దాము. అయితే ఆవిడ ఈ పాటతో పాటు “సిరిసిరిమువ్వ” పాటను కూడా జతగలిపినట్లున్నారు. 



















చివరగా “కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మ” ఇదివరలో పోస్ట్ చేసిన ఈ పాటకు ఈ మధ్య సాహిత్యం లభించింది.  జానపద గేయాల సేకరణ కర్త శ్రీ నేదునూరి గంగాధరం గారి సేకరణ నుండి. మరొక్కసారి ఆస్వాదిద్దాము. ఇది ఆకాశవాణి వారి లలిత గీతాల నుండి.








Tags: Vinjamuri Anasuyadevi, Anasooyaadevi, SuryaKumari, Tanguturi, Tangutoori, Avasarala Anasuyadevi, Bandaru Chinnadana, Nandagiri Bangaru Mama Chandragiri cheeralampeva,

Friday, June 6, 2014

సూర్యకుమారి గారు పాడిన బసవరాజు అప్పారావు గారి గీతాలు

బసవరాజు అప్పారావు గారు రచించిన “ఒంటిగా ఉయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా” మరియు “మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి” అనే గేయాలు టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో విందాము 





 ఒంటిగా ఉయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా



Source: http://www.harekrsna.de/eng-home.htm



 మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి








Tags: Basavaraju Apparao, T. Suryakumari, ontigaa vuyyaala, maamidichettunu allukonnadee maadhaveelatha, Lalitha geyalu

Tuesday, June 3, 2014

తెలుగువారి జానపద కళారూపాలు – గంగిరెద్దులు

పండగలప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వస్తే భిక్షమెత్తుకోటానికి వచ్చారనుకుంటాము కానీ, అది ఒక జానపద కళారూపమని దాని వెనకాల చాలా చరిత్ర ఉందని మనం భావించం. పల్లెలతో అనుబంధం ఉన్న వారికి గంగిరెద్దుల ఆటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పట్టణాల్లో ఒక్కోసారి గంగిరెద్దు కనబడకపోయినా వారి సన్నాయి మటుకు వీనుల విందు చేస్తూనే వుంటుంది. తెలుగువారి జానపద కళారూపాలు అనగానే గుర్తుకువచ్చే విశిష్టవ్యక్తి శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు. వివిధ కళారూపాలనన్నిటిని పుస్తక రూపంలో తెచ్చిన ఘనత వారికే చెందుతుంది.

ఆకాశవాణి వారు ఈ గంగిరెద్దుల మీద తాతా రమేష్ బాబు గారి రమ్యమైన ప్రసంగాన్ని ప్రసారం చేశారు. ముందుగా ఆ ప్రసంగాన్ని విని ఆ తరువాత ఈ కళారూపం మీద మిక్కిలినేని వారి సేకరణను సాహిత్యరూపంలో చూద్దాము. సందర్భం వచ్చింది గాబట్టి అడవి బాపిరాజు గారి రచన “డూ డూ డూ డూ బసవన్న” అన్న గేయం టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో మరొక్కసారి ఆస్వాదిద్దాము. ఆడియో సహకారం surasa.net.






హిందూ సౌజన్యంతో













ముద్దుకృష్ణ గారి వైతాళికులు నుండి


గంగిరెద్దుల వాళ్ళ దీవెనలను సాహిత్యరూపంలో చూసి , భవిష్యత్తులో వాళ్ళు మన ఇంటికి రావటం తటస్థిస్తే వాళ్ళ దీవెనలు అందుకొని వారిని సంతోషరచటానికి ప్రయత్నిద్దాము.



చివరగా సూత్రధారులు సినిమానుండి ఒకపాటతో ముగిద్దాము.




Tags: Gangireddulu, Janapada Kalaroopaalu, Mikkilineni, T Suryakumari, Adavi Bapiraju, Akashavani, Tanguturi, Doo doo   basavanna

Saturday, November 9, 2013

మన సంగీత తారలు - సూర్యకుమారి

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన సంగీత తారలు” శీర్షికన  టంగుటూరి సూర్యకుమారి గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. 















అలాగే గృలక్ష్మి 1940 సంచికలో ప్రచురించిన మరొక వ్యాసం 












ప్రస్తుతం లభిస్తున్నటువంటి ఆవిడ పాడిన పాటల వివరాలు 














చివరగా కృష్ణప్రేమ సినిమాలో నీ మహిమ లెన్న తరమా కృష్ణా అనే పాట