Showing posts with label సినిమా పోస్టర్స్ - రివ్యూలు. Show all posts
Showing posts with label సినిమా పోస్టర్స్ - రివ్యూలు. Show all posts

Friday, December 29, 2017

నాగయ్య - త్యాగయ్య

శ్రీ చిత్తూరు నాగయ్య గారి గురించి వచ్చిన రెండు వ్యాసాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఒక వ్యాసం శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు రాసినది. ఈ రెండు వ్యాసాలు ఆంధ్రప్రభ వారి “మోహిని” సంచికలో వచ్చినవి. 1950 నాటి ఆంధ్రపత్రికలో వచ్చిన నాగయ్య గారితో ఇంటర్వ్యూ కూడా జతచేయటం జరిగింది. చివరగా ఒక రెండు పాటలు కూడా విందాము. 



















కల్లు మానండోయ్ బాబు – గృహలక్ష్మి
..

చిన్నారి పాప బంగరుకొండ - బీదలపాట్లు

..
..




Tags: Nagaiah, Nagayya
 

Wednesday, November 15, 2017

బెస్ట్ సినిమా తీయలేదన్న బి. ఎన్. రెడ్డి

బి. ఎన్. రెడ్డిగారు తీసినవే పదకొండు సినిమాలు, దాంట్లో తొమ్మిది వాహినీవారి బ్యానర్ మీద, రెండు వేరేవారి బ్యానర్లకోసం దర్శకత్వం వహించినవి. వాటిల్లో అందరికీ బాగా నచ్చినది ‘మల్లీశ్వరి’, అయినా బెస్ట్ సినిమా తీయలేకపోయానన్నారు. పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారు 1973లో బి.ఎన్. గారితో చేసిన ఇంటర్వ్యూ తాలూకు వ్యాసం చూద్దాము. 












గొల్లపూడి మారుతీరావు గారు బి.ఎన్. గారిమీద ఒక పుస్తకం రాశారు. దీంట్లో ‘మల్లీశ్వరి’ సినిమాకు మూలకధ 1944 భారతిలో ప్రచురించిన బుచ్చిబాబు గారి నాటిక ‘రాయల కరుణకృత్యం’ అన్న ప్రస్తావన వచ్చింది. ఇది రేడియో నాటికగా వచ్చిందిట, దీనికి బి. ఎన్. గారు ఉపోద్ఘాతం చెప్పారుట, ఈ రేడియో నాటికలో టి. జి. కమలాదేవి గారు పాల్గొన్నారుట. దీని గురించి బుచ్చిబాబు గారి సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి గారు చెప్పిన వివరాలు ఇక్కడ వినవచ్చు. (ఆకాశవాణి వారి ప్రసారం).


..














ఎక్కడో చదివినట్లు గుర్తు, మల్లీశ్వరి సినిమాని సర్వేపల్లి రాధాకృష్ణ గారికి చూపించటం జరిగిందిట. “పిలచిన బిగువటరా” పాట సన్నివేశానికి ముందు పెద్దవాన పడినట్లుగా చూపించారు, పాట అయినాక రాజుగారి పరివారం గుఱ్ఱాలమీద తిరిగివెళుతున్నప్పుడు, గుఱ్ఱాల కాళ్లగిట్టలవల్ల ధూళిలేస్తూ కనిపిస్తుంది, ‘అంతకు ముందే వర్షంపడితే ధూళి ఎలా లేస్తుందని’, సర్వేపల్లి వారు బి.ఎన్. గారిని ప్రశ్నించారుట. 

















Tags: B N Reddy, Malliswari 1951  

Saturday, August 19, 2017

నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్ – ఈలపాట రఘురామయ్య

ప్రముఖ నాటక, సినీ కళాకారులు శ్రీ కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య గారి గురించిన వివరాలు స్వాతి మాసపత్రికలో వచ్చినవి పోస్ట్ చెయ్యటం జరిగింది, దానితో పాటు మరిన్ని వివరాలు, వారు పాడిన మూడు పాటలు కూడానూ. 














మిక్కిలినేనివారి నటరత్నాలు నుండి










చందమామ – గొల్లభామ నుండి




..









ముక్తిమార్గమును – శ్రీకృష్ణమాయ నుండి 

మాతెలుగు తల్లికి మల్లెపూదండ నుండి

 

..



పూరయమమకామం – దేవాంతకుడు నుండి 


 
..


గతంలో పోస్ట్ చేసిన కృష్ణరాయబారం పద్యాలు రఘురామయ్య గారు పాడినవి (కృష్ణ పాత్రధారి) ఈ  లింకు ద్వారా వినవచ్చు. 




Tags: Kalyanam Raghuramaiah, Eelapata Raghuramayya, Gollabhama