Showing posts with label నాటకాలు - రూపకాలు. Show all posts
Showing posts with label నాటకాలు - రూపకాలు. Show all posts

Friday, May 11, 2018

“కొండనుండి కడలిదాకా” రజని గారి సంగీత రూపకం

“కొండనుండి కడలిదాకా” శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం. ఇందులో ‘గోదావరి నది’ గా మాట్లాడినది శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు. 




..



Tags: Konda nundi kadali daka, Balanthrapu Rajanikantha Rao, Sangeetha Roopakam, Sarada Srinivasan,Rajani,

Friday, March 9, 2018

రజని గారి సంగీత రూపకం - సంగీత గంగోత్రి

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి”. పాల్గొన్న గాయనీ గాయకులు తిరుపతి త్యాగరాజు, మోదుమూడి సుధాకర్, కరైకుడి ఎస్. కన్నన్, డి. వి. మోహన కృష్ణ, మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వి. వి. సత్య ప్రసాద్, ద్వారం ఎన్ విజయలక్ష్మి,ఆర్. ఛాయాదేవి, ఎన్. సి. శ్రీదేవి, శిష్ట్లా శారద, బి. సుశీల, బి. సుబ్బలక్ష్మి, వి. భవాని గార్లు. మిమిక్రీ తోట సిల్వేస్టర్. రచన, నిర్వహణ శ్రీ రజని గారు. పాలుపంచుకున్న కళాకారులందరి పేర్లు మొదట మరియు చివర వినిపిస్తాయి. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి.






..

Tags: Sangeetha Gangothri, Sangita gangotri, Balanthrapu Rajanikantharao, Rajani, Sangeeta roopakam, Aakashavani, AIR, Modumudi Sudhakar, D. V. Mohana Krishna, Malladi Sriram Prasad, R. Chayadevi, Dwaram N Vijayalakshmi, N. C. Sridevi, Sishtla Sarada, B. Suseela, B. Subbalakshmi, V. Bhavani, V. V. Sathya Prasad, Tirupathi Tyagaraju, Karaikudi S Kannan, Mimikri by Thota Sylvester

Sunday, March 26, 2017

కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యకదంబం - “డాక్టర్”

ప్రముఖ కవి, రచయిత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యరచన “డాక్టర్”. ఇది వారి రచన “మువ్వగోపాల” నుండి గ్రహించటం జరిగింది. ఇది 1961 లో వచ్చిన ప్రచురణ. కాటూరి వారు ఆకాశవాణి వారి కోసం రాసిన శ్రవ్యనాటికలు “మువ్వగోపాల” పుస్తకంగా ప్రచురించారు. ఆద్యంతం చతురోక్తులతో సాగుతుంది ఈ నాటిక. 

చిలకమర్తి వారి రేడియో నాటకం “గణపతి”లో సింగమ్మగా – పి. సీతారత్నం, గణపతిగా – నండూరి సుబ్బారావు గార్ల వాచకం గుర్తుండే వుంటుంది. ఈ డాక్టర్ నాటకం చదివేటప్పుడు “రోగి” పాత్రలో నండూరివారిని, “తల్లి” పాత్రలో సీతారత్నంగారిని ఊహించుకొని చదివిచూడండి. మరి ఈ నాటకం ఆకాశవాణి వారి వద్ద లభిస్తోందా అన్నది తెలియదు.

కాటూరి వారి రచనతో పాటు వారి చేవ్రాలు, ఫోటో, వివరాలు, స్వరం కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. చూడటానికి పెద్దగా అనిపించినా, మొదలుపెడితే ఇట్టే చదివేయగలరు.  









ముద్దుకృష్ణ గారి వైతాళికులు నుండి




కాటూరి, పింగళి లక్ష్మీకాంతం గార్లు







..







































Tags: Katuri Venkateswararao, Kaaturi, Kaatoori, Katoori, Muvvagopala, Pingali Lakshmikantam, Chellapilla Venkata Sastry,