Showing posts with label వి. ఎ. కె. రంగారావు. Show all posts
Showing posts with label వి. ఎ. కె. రంగారావు. Show all posts

Friday, March 10, 2017

ప్రత్యేక జనరంజని – వి. ఎ. కె. రంగారావు గారు

ఇది 15.11.1992 నాటి ప్రసారం. ఇది బ్లాగు ప్రారంభించిన కొత్తల్లో, ఆడియోలు ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియక, ఆరు భాగాలకింద యుట్యూబ్ లోకి అప్లోడ్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు అన్ని భాగాలుకలిపి ఒక రికార్డుగాచేసి ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లోకి అప్లోడ్ చెయ్యటం జరిగింది. ఇంతకు ముందు విననివారు ఆస్వాదించవచ్చు. ఇది దాదాపు పాతికేళ్ళకిందట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసారు. మొదట్లో కొద్దిగా రికార్డు కాలేదు. రంగారావు గారి మాటకాని, వ్రాతకాని కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. 

Source: The Hindu




...

ఈ మధ్య ఆంధ్రజ్యోతి ఛానెల్లో “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” లో వి. ఎ. కె. రంగారావు గారితో ఇంటర్వ్యూ వచ్చింది. మరి చూడనివారు ఈ    లింకు ద్వారా చూడవచ్చు. 


Tags: VAK, V A K Rangarao, V A K, Janaranjani, Akashavani,


Tuesday, January 10, 2017

అలనాటి అందాలు - వి.ఎ.కె. రంగారావు గారి ఎల్.పి. రికార్డు

ఎల్.పి. రికార్డుగా అలనాటి అందాలు శీర్షికన శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు చేసిన మొదటి సంకలనం ఇది. దీంట్లో నలభైలలో వచ్చిన సినిమా పాటలను పొందుపరచటం జరిగింది. విశేషం ఏమిటంటే గాయనీగాయకులు నటీనటులు కావటం. ఈ ఎల్.పి. నావద్ద లేదుగాని, ఈ పాటలను ఓ పాతికేళ్లకిందట క్యాసెట్ మీద రికార్డు చేయించుకోవటం జరిగింది. ఆ పాటల వివరాలు ఏమిటోచూసి యధాప్రకారం ఓ నాలుగు పాటలు విందాము. ఈ పాటలు మళ్ళీ క్యాసెట్ / సి.డి. రూపంలో వచ్చాయా అన్నది గుర్తులేదు. ఈ పాటల వివరాలు లభించిన ఆధారాల మేరకు రాయటం జరిగింది, ఒకటిరెండు తప్పులు దొర్లినా దొర్లియుండవచ్చు. 


రంగారావుగారి మరో ఆలాపన నుండి. అభ్యంతరం ఉంటే తొలగించబడుతుంది





1. పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా – 1940 – బారిష్టర్ పార్వతీశం – జి. వరలక్ష్మి - రచన, సంగీతం కొప్పరపు సుబ్బారావు 

2. సుమడోలి కేళి హాళి – 1940 – భూకైలాస్ – లక్ష్మీబాయి – బలిజేపల్లి లక్ష్మీకాంతం – ఆర్. సుదర్శనం 

3. వస్తాడే మాబావ రేపోమాపో వస్తాడే - 1940 – సుమంగళి – మాలతి – సముద్రాల – నాగయ్య 

4. అనురాగములేక ఆనందము ప్రాప్తించునా – 1941 – ధర్మపత్ని – భానుమతి – పాటలు దైతా గోపాలం – సంగీతం అన్నాసాహెబ్ మెయిన్.కర్ 

5. రాదే చెలి నమ్మరాదే చెలీ మగవారి – 1941 – దేవత – బెజవాడ రాజరత్నం – సముద్రాల – నాగయ్య 

6. వెలిగింపుమా నాలో జ్యోతి – 1942 – జీవన్ముక్తి – పి. సూరిబాబు - బలిజేపల్లి లక్ష్మీకాంతం – ఎస్. రాజేశ్వరరావు 

7. నిజమాదుదానా నీదాన నినునమ్మి మనేదాన – 1943 – చెంచులక్ష్మి – ఋష్యేంద్రమణి గారి పాడారని అనుకుంటాను – సముద్రాల – సంగీతం ఆర్. చిన్నయ్య (హిందూ లో వచ్చిన ఎమ్.ఎల్. నరసింహం గారి వ్యాసం ప్రకారం సి.ఆర్. సుబ్బరామన్ గారు సంగీతం సమకూర్చారు) 

8. జేజేలయ్యా జోహారు కృష్ణ – 1943 – కృష్ణప్రేమ – టి. సూర్యకుమారి – బలిజేపల్లి - గాలిపెంచల నరసింహారావు 

9. మోహనాంగ రారా నవ మోహనాంగరారా – 1945 – మాయలోకం – శాంతకుమారి - దైతా గోపాలం - గాలిపెంచల నరసింహారావు 

10. అందమైనచిన్నదిరా అందగాడవన్నదిరా - 1946 – ముగ్గురు మరాఠీలు – కస్తూరి శివరావు – తాపీ ధర్మారావు గారు లేదా ప్రయాగ నరసింహ శాస్త్రి గారు – ఓగిరాల రామచంద్రరావు 

11. వదలజాలరా మనసారా మరులుతీర – 1947 – యోగివేమన – నాగయ్య – సముద్రాల – నాగయ్య & ఓగిరాల 

12. ఓహో చారుశీల – 1947 – పల్నాటి యుద్ధం – అక్కినేని నాగేశ్వరరావు & ఎస్. వరలక్ష్మి – సముద్రాల – గాలిపెంచల 

13. చందమామ అందమైనా – 1947 – గొల్లభామ – కృష్ణవేణి & రఘురామయ్య – తాపీ ధర్మారావు - ఎస్.బి. దినకర్ రావు. 

14. బ్రోవవమ్మ దేవి కళ్యాణి – 1947 – బ్రహ్మరధం – జయమ్మ - బలిజేపల్లి – మోతీబాబు 

15. యదుకుమార గిరిధర – 1948 – సువర్ణమాల – ఆర్. బాలసరస్వతీదేవి – దర్భా వెంకటకృష్ణ మూర్తి - అద్దేపల్లి రామారావు. 

16. కలకల ఆ కోకిలేమో – 1949 – గుణసుందరి కధ – శాంతకుమారి & మాలతి – పింగళి నాగేంద్రరావు – ఓగిరాల 

వీటిల్లో మనకు బారిష్టర్ పార్వతీశం, ధర్మపత్ని, జీవన్ముక్తి, చెంచులక్ష్మి, మాయలోకం, బ్రహ్మరధం, సువర్ణమాల మినహా మిగతా తొమ్మిది సినిమాలు చూడటానికి లభిస్తున్నాయి.  

వీటిల్లో కొన్ని పాటలు గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది.






..




సోర్స్: ది హిందు




..

..






..



Tags: Old Telugu Film Songs, Alanati Andalu, V A K Rangarao, Barrister parvateesam 1940, Jeevanmukthi 1942, Chenchu lakshmi 1943, Suvarnamala 1948, P Suribabu, R Balasaraswathi Devi, G. Varalakshmi  

Sunday, July 31, 2016

రతిచేతి రాచిలుక – మనమే నందనవనం

శ్రీ వి. ఎ. కె. రంగారావు గారి సారధ్యంలో 1988లో వచ్చిన జంట క్యాసెట్ల టైటిల్స్ ఇవి. వీటిల్లో ఎక్కువ పాటలు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసినవే. చక్కటి సంగీత సాహిత్యాలతో కూడిన పాటలు ఇవి. ఆ పాటల వివరాలేమిటో చూసి ఒక నాలుగు పాటలు, ఘంటసాల గారి గళంలో శ్రీనాధుడి పద్యాలు విందాము. 

















మనమే నందనవనమౌకాదా 





..








ఆమనీ మధుయామినీ


...





చెంగూన అలమీద
 

...



చిన్నారి నీ మనసే


...



శ్రీనాధుడి పద్యాలు 


...














Tags: V A K Rangarao, old telugu cassettes, Rathicheti rachiluka, Maname nandanavanam, Ghantasala, M S Ramarao, Srinadha Padyalu, Mukkamala Sunanda, Malladi Ramakrishna Sastry, Maname nandanavanamoukaadaa, Aamani madhuyamini, Chinnari neemanase, Chenguna alameeda