Tuesday, January 10, 2017

అలనాటి అందాలు - వి.ఎ.కె. రంగారావు గారి ఎల్.పి. రికార్డు

ఎల్.పి. రికార్డుగా అలనాటి అందాలు శీర్షికన శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు చేసిన మొదటి సంకలనం ఇది. దీంట్లో నలభైలలో వచ్చిన సినిమా పాటలను పొందుపరచటం జరిగింది. విశేషం ఏమిటంటే గాయనీగాయకులు నటీనటులు కావటం. ఈ ఎల్.పి. నావద్ద లేదుగాని, ఈ పాటలను ఓ పాతికేళ్లకిందట క్యాసెట్ మీద రికార్డు చేయించుకోవటం జరిగింది. ఆ పాటల వివరాలు ఏమిటోచూసి యధాప్రకారం ఓ నాలుగు పాటలు విందాము. ఈ పాటలు మళ్ళీ క్యాసెట్ / సి.డి. రూపంలో వచ్చాయా అన్నది గుర్తులేదు. ఈ పాటల వివరాలు లభించిన ఆధారాల మేరకు రాయటం జరిగింది, ఒకటిరెండు తప్పులు దొర్లినా దొర్లియుండవచ్చు. 


రంగారావుగారి మరో ఆలాపన నుండి. అభ్యంతరం ఉంటే తొలగించబడుతుంది





1. పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా – 1940 – బారిష్టర్ పార్వతీశం – జి. వరలక్ష్మి - రచన, సంగీతం కొప్పరపు సుబ్బారావు 

2. సుమడోలి కేళి హాళి – 1940 – భూకైలాస్ – లక్ష్మీబాయి – బలిజేపల్లి లక్ష్మీకాంతం – ఆర్. సుదర్శనం 

3. వస్తాడే మాబావ రేపోమాపో వస్తాడే - 1940 – సుమంగళి – మాలతి – సముద్రాల – నాగయ్య 

4. అనురాగములేక ఆనందము ప్రాప్తించునా – 1941 – ధర్మపత్ని – భానుమతి – పాటలు దైతా గోపాలం – సంగీతం అన్నాసాహెబ్ మెయిన్.కర్ 

5. రాదే చెలి నమ్మరాదే చెలీ మగవారి – 1941 – దేవత – బెజవాడ రాజరత్నం – సముద్రాల – నాగయ్య 

6. వెలిగింపుమా నాలో జ్యోతి – 1942 – జీవన్ముక్తి – పి. సూరిబాబు - బలిజేపల్లి లక్ష్మీకాంతం – ఎస్. రాజేశ్వరరావు 

7. నిజమాదుదానా నీదాన నినునమ్మి మనేదాన – 1943 – చెంచులక్ష్మి – ఋష్యేంద్రమణి గారి పాడారని అనుకుంటాను – సముద్రాల – సంగీతం ఆర్. చిన్నయ్య (హిందూ లో వచ్చిన ఎమ్.ఎల్. నరసింహం గారి వ్యాసం ప్రకారం సి.ఆర్. సుబ్బరామన్ గారు సంగీతం సమకూర్చారు) 

8. జేజేలయ్యా జోహారు కృష్ణ – 1943 – కృష్ణప్రేమ – టి. సూర్యకుమారి – బలిజేపల్లి - గాలిపెంచల నరసింహారావు 

9. మోహనాంగ రారా నవ మోహనాంగరారా – 1945 – మాయలోకం – శాంతకుమారి - దైతా గోపాలం - గాలిపెంచల నరసింహారావు 

10. అందమైనచిన్నదిరా అందగాడవన్నదిరా - 1946 – ముగ్గురు మరాఠీలు – కస్తూరి శివరావు – తాపీ ధర్మారావు గారు లేదా ప్రయాగ నరసింహ శాస్త్రి గారు – ఓగిరాల రామచంద్రరావు 

11. వదలజాలరా మనసారా మరులుతీర – 1947 – యోగివేమన – నాగయ్య – సముద్రాల – నాగయ్య & ఓగిరాల 

12. ఓహో చారుశీల – 1947 – పల్నాటి యుద్ధం – అక్కినేని నాగేశ్వరరావు & ఎస్. వరలక్ష్మి – సముద్రాల – గాలిపెంచల 

13. చందమామ అందమైనా – 1947 – గొల్లభామ – కృష్ణవేణి & రఘురామయ్య – తాపీ ధర్మారావు - ఎస్.బి. దినకర్ రావు. 

14. బ్రోవవమ్మ దేవి కళ్యాణి – 1947 – బ్రహ్మరధం – జయమ్మ - బలిజేపల్లి – మోతీబాబు 

15. యదుకుమార గిరిధర – 1948 – సువర్ణమాల – ఆర్. బాలసరస్వతీదేవి – దర్భా వెంకటకృష్ణ మూర్తి - అద్దేపల్లి రామారావు. 

16. కలకల ఆ కోకిలేమో – 1949 – గుణసుందరి కధ – శాంతకుమారి & మాలతి – పింగళి నాగేంద్రరావు – ఓగిరాల 

వీటిల్లో మనకు బారిష్టర్ పార్వతీశం, ధర్మపత్ని, జీవన్ముక్తి, చెంచులక్ష్మి, మాయలోకం, బ్రహ్మరధం, సువర్ణమాల మినహా మిగతా తొమ్మిది సినిమాలు చూడటానికి లభిస్తున్నాయి.  

వీటిల్లో కొన్ని పాటలు గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది.






..




సోర్స్: ది హిందు




..

..






..



Tags: Old Telugu Film Songs, Alanati Andalu, V A K Rangarao, Barrister parvateesam 1940, Jeevanmukthi 1942, Chenchu lakshmi 1943, Suvarnamala 1948, P Suribabu, R Balasaraswathi Devi, G. Varalakshmi  

1 comment:

  1. మీరిచ్చిన మ్యూజిక్ లింక్ 4 shared సరిగా లేదు ఇది ఎన్నో సైట్లను ఓపెన్ చేస్తుంది, మంచి లింక్ ద్వారా పాటలు ఇవ్వండి.

    ReplyDelete