Showing posts with label పాత క్యాసెట్లు. Show all posts
Showing posts with label పాత క్యాసెట్లు. Show all posts

Tuesday, January 10, 2017

అలనాటి అందాలు - వి.ఎ.కె. రంగారావు గారి ఎల్.పి. రికార్డు

ఎల్.పి. రికార్డుగా అలనాటి అందాలు శీర్షికన శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు చేసిన మొదటి సంకలనం ఇది. దీంట్లో నలభైలలో వచ్చిన సినిమా పాటలను పొందుపరచటం జరిగింది. విశేషం ఏమిటంటే గాయనీగాయకులు నటీనటులు కావటం. ఈ ఎల్.పి. నావద్ద లేదుగాని, ఈ పాటలను ఓ పాతికేళ్లకిందట క్యాసెట్ మీద రికార్డు చేయించుకోవటం జరిగింది. ఆ పాటల వివరాలు ఏమిటోచూసి యధాప్రకారం ఓ నాలుగు పాటలు విందాము. ఈ పాటలు మళ్ళీ క్యాసెట్ / సి.డి. రూపంలో వచ్చాయా అన్నది గుర్తులేదు. ఈ పాటల వివరాలు లభించిన ఆధారాల మేరకు రాయటం జరిగింది, ఒకటిరెండు తప్పులు దొర్లినా దొర్లియుండవచ్చు. 


రంగారావుగారి మరో ఆలాపన నుండి. అభ్యంతరం ఉంటే తొలగించబడుతుంది





1. పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా – 1940 – బారిష్టర్ పార్వతీశం – జి. వరలక్ష్మి - రచన, సంగీతం కొప్పరపు సుబ్బారావు 

2. సుమడోలి కేళి హాళి – 1940 – భూకైలాస్ – లక్ష్మీబాయి – బలిజేపల్లి లక్ష్మీకాంతం – ఆర్. సుదర్శనం 

3. వస్తాడే మాబావ రేపోమాపో వస్తాడే - 1940 – సుమంగళి – మాలతి – సముద్రాల – నాగయ్య 

4. అనురాగములేక ఆనందము ప్రాప్తించునా – 1941 – ధర్మపత్ని – భానుమతి – పాటలు దైతా గోపాలం – సంగీతం అన్నాసాహెబ్ మెయిన్.కర్ 

5. రాదే చెలి నమ్మరాదే చెలీ మగవారి – 1941 – దేవత – బెజవాడ రాజరత్నం – సముద్రాల – నాగయ్య 

6. వెలిగింపుమా నాలో జ్యోతి – 1942 – జీవన్ముక్తి – పి. సూరిబాబు - బలిజేపల్లి లక్ష్మీకాంతం – ఎస్. రాజేశ్వరరావు 

7. నిజమాదుదానా నీదాన నినునమ్మి మనేదాన – 1943 – చెంచులక్ష్మి – ఋష్యేంద్రమణి గారి పాడారని అనుకుంటాను – సముద్రాల – సంగీతం ఆర్. చిన్నయ్య (హిందూ లో వచ్చిన ఎమ్.ఎల్. నరసింహం గారి వ్యాసం ప్రకారం సి.ఆర్. సుబ్బరామన్ గారు సంగీతం సమకూర్చారు) 

8. జేజేలయ్యా జోహారు కృష్ణ – 1943 – కృష్ణప్రేమ – టి. సూర్యకుమారి – బలిజేపల్లి - గాలిపెంచల నరసింహారావు 

9. మోహనాంగ రారా నవ మోహనాంగరారా – 1945 – మాయలోకం – శాంతకుమారి - దైతా గోపాలం - గాలిపెంచల నరసింహారావు 

10. అందమైనచిన్నదిరా అందగాడవన్నదిరా - 1946 – ముగ్గురు మరాఠీలు – కస్తూరి శివరావు – తాపీ ధర్మారావు గారు లేదా ప్రయాగ నరసింహ శాస్త్రి గారు – ఓగిరాల రామచంద్రరావు 

11. వదలజాలరా మనసారా మరులుతీర – 1947 – యోగివేమన – నాగయ్య – సముద్రాల – నాగయ్య & ఓగిరాల 

12. ఓహో చారుశీల – 1947 – పల్నాటి యుద్ధం – అక్కినేని నాగేశ్వరరావు & ఎస్. వరలక్ష్మి – సముద్రాల – గాలిపెంచల 

13. చందమామ అందమైనా – 1947 – గొల్లభామ – కృష్ణవేణి & రఘురామయ్య – తాపీ ధర్మారావు - ఎస్.బి. దినకర్ రావు. 

14. బ్రోవవమ్మ దేవి కళ్యాణి – 1947 – బ్రహ్మరధం – జయమ్మ - బలిజేపల్లి – మోతీబాబు 

15. యదుకుమార గిరిధర – 1948 – సువర్ణమాల – ఆర్. బాలసరస్వతీదేవి – దర్భా వెంకటకృష్ణ మూర్తి - అద్దేపల్లి రామారావు. 

16. కలకల ఆ కోకిలేమో – 1949 – గుణసుందరి కధ – శాంతకుమారి & మాలతి – పింగళి నాగేంద్రరావు – ఓగిరాల 

వీటిల్లో మనకు బారిష్టర్ పార్వతీశం, ధర్మపత్ని, జీవన్ముక్తి, చెంచులక్ష్మి, మాయలోకం, బ్రహ్మరధం, సువర్ణమాల మినహా మిగతా తొమ్మిది సినిమాలు చూడటానికి లభిస్తున్నాయి.  

వీటిల్లో కొన్ని పాటలు గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది.






..




సోర్స్: ది హిందు




..

..






..



Tags: Old Telugu Film Songs, Alanati Andalu, V A K Rangarao, Barrister parvateesam 1940, Jeevanmukthi 1942, Chenchu lakshmi 1943, Suvarnamala 1948, P Suribabu, R Balasaraswathi Devi, G. Varalakshmi  

Thursday, January 5, 2017

హెచ్.ఎమ్.వి. వారి అరుదైన పాటల క్యాసెట్లు

2000లో “Millennium” the finest collection అంటూ హెచ్.ఎమ్.వి. వారు పదిక్యాసెట్ల ఆల్బమ్ తీసుకువచ్చారు. దాంట్లో మొదటి మూడు క్యాసెట్లలో 1936 నుండి 1950 మధ్యకాలంలో విడుదలైన కొన్నిచిత్రాలలోని కొన్నిపాటలను పొందుపరిచారు. రూపకల్పన వి.ఎ.కె. రంగారావు గారు. ఆ వివరాలేమిటోచూసి చివరగా ఈ కింది సినిమాలలోనివి ఓ రెండు పాటలు విందాము. 









వేమూరి గగ్గయ్య గారు పాడిన పద్యాలు – శిశుపాలుడిపాత్ర – 1936 – ద్రౌపది వస్త్రాపహరణము

మిక్కిలినేని వారి నటరత్నాలు




 
..

Source: Sakhiyaa.com





టి. సూర్యకుమారి గారు పాడిన – ముదముగా – 1941 – చంద్రహాస 
Source: The Hindu





..

Source: Sakhiyaa.com








Tags: T. Suryakumari, Vemuri Gaggayya, Gaggaiah, V.A.K. Rangarao

Monday, November 14, 2016

ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు

1999 లో జె. మధుసూధన శర్మ గారి సంకలనంలో ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు గల ఒక క్యాసెట్ విడుదల అయింది. ఆ క్యాసెట్ కవర్లో రాజేశ్వరరావు గారి గురించి కొన్ని వివరాలు కూడ పొందుపరిచారు. ఆ వివరాలు చూసి రాజేశ్వరరావు గారు పాడిన నాలుగు పాటలు విందాము. 





Source: Sakhiyaa.com














“ఎవ్వాని మహిమ” అన్న పాట మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది. 


...

ఔర లోక హితకారి – శ్రీకృష్ణ లీలలు – 1935

..

Source: Sakhiyaa.com

నను వీడగ గలవే బాల – మాయాబజార్ – 1936
 
..

Source: Sakhiyaa.com

 ఓహో యాత్రికుడా  -  ఆకాశవాణి

..

మధుసూధన శర్మ గారి గురించిన మరింత సమాచారం కొరకు ఈ కింది లింకుల ద్వారా చూడవచ్చు.

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/a-record-collection/article5222796.ece 

http://www.thehindu.com/thehindu/mp/2003/12/09/stories/2003120900140200.htm 


Tags: S. Rajeswararao