Showing posts with label ఇతరములు. Show all posts
Showing posts with label ఇతరములు. Show all posts

Wednesday, January 10, 2018

స్వామి వివేకానంద ఇంటర్వ్యూ – వ్యాసము

వివేకానంద స్వామి గారు (12.01.1863 – 04.07.1902) ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి 1898నాటి “ప్రబుద్ధ భారత” ఆంగ్ల మాస పత్రికలో ప్రచురించారు. దాని ఆంధ్రానువాదము “జాగృతి” 1962నాటి సంచికలో వచ్చింది. స్వామి వివేకానంద జయంతి (12.01.2018) సందర్భంగా ఆ రెండిటినీ పోస్ట్ చెయ్యటం జరిగింది. 














Tags: Swami Vivekananda, Prabuddha Bharata

Friday, December 29, 2017

సారస్వతనికేతనం – వేటపాలెము

ఈనాడు మనకు “ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ” వారివల్ల లభిస్తున్న అలనాటి పాతసంచికలు చాలావరకు ఈ “సారస్వతనికేతనం” పుణ్యఫలమే. ఈ గ్రంధాలయం 15 అక్టోబర్ 1918లో స్థాపించబడింది. వచ్చే ఏడాదికి వంద వసంతాలు పూర్తవుతాయి. ప్రకాశం జిల్లాలోని చీరాలకు సమీపంలో ఉన్నది  వేటపాలెం. దీని వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ ఊటుకూరి వేంకట సుబ్రాయ శ్రేష్ఠి గారు. మొదట ఇది “హిందూ యువజన సంఘం” కింద ఏర్పాటు అయింది. వీరు ఈ గ్రంధాలయం ఏర్పాటుకు 1924లో పెంకుటింటిని కూడా సమకూర్చారు. దీనిని అప్పట్లో శ్రీ జమన్లాల్ బజాజ్ గారు ప్రారంభించారు. 1929లో నూతన భవనానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు పునాదిరాయి వేస్తే, ప్రకాశం పంతులు గారి చేతులమీదుగా నూతన భవనం ప్రారంభం అయింది. 1935లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ గ్రంధాలయాన్ని దర్శించి దీనిని ఒక దేవాలయమునకు ప్రతీకగా, గ్రంధాలయం ఆవరణలో ద్వజస్తంభం ప్రతిష్టించారు. 1936లో గాంధీ గారు మరొకమారు ఈ గ్రంధాలయాన్ని దర్శించారు, గుర్తుగా వారి చేతికర్రను ఇక్కడ భద్రపరిచారు. ఎన్నో సభలకు, సమావేశాలకు ఆలవాలము ఈ గ్రంధాలయము. ఎంతో మంది కవులు, రచయితలు, విశిష్ఠ వ్యక్తులు ఈ గ్రంధాలయాన్ని సందర్శించారు. వంద సంవత్సరాల కిందటి వార్తాపత్రికలు, కొన్ని వేల పుస్తకాలు, సంచికలు, అరుదైన తాళపత్ర గ్రంధాలు ఇక్కడ భద్రపరచబడ్డాయి. నాడు ఎంతో దూరదృష్టితో సుబ్రాయ శ్రేష్ఠి గారు చేసిన చిన్న ప్రయత్నం ఈనాడు సరస్వతీనిలయంగా విరాజిల్లుతోంది. 









జమన్లాల్ బజాజ్











Tags: Saraswathanikethanam, Vetapalem

Saturday, December 9, 2017

నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు

ప్రపంచ తెలుగు మహాసభల తరుణంలో నాటి “నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” అన్న వ్యాసం చూద్దాము. ఇది “విభూతి” అన్న 1939 నాటి సంచికలో వచ్చింది. ఇలాంటి వ్యాసాలవల్ల ఆనాటి తెలుగు పత్రికల తీరు తెన్నులు తెలిసే అవకాశం వుంటుంది. 


























1926 నాటి “ఆంధ్రపత్రిక”లో వచ్చిన “గోలకొండ పత్రిక”  ప్రకటన 






1925 నాటి “శారద” వారపత్రికలో వచ్చిన “నీలగిరి పత్రిక” ప్రకటన



 “ఆంధ్ర పత్రిక” 1914 నాటి సంచికలో మాడపాటి హనుమంతరావు గారి “నిజాము రాష్ట్రములోని ఆంధ్రులు” అన్న వ్యాసం ఒకటి ప్రచురించారు.



 అలాగే శ్రీపాద వారి “ప్రబుద్ధాంధ్ర” నవంబర్ 1934 సంచికలో లో సురవరము వారి “నిజాము రాజ్యములోని తెలుగు వారి స్థితి” అన్న వ్యాసం వచ్చింది. 



గడియారం రామకృష్ణ శర్మ గారి “సుజాత” సంచికలో మల్లంపల్లి వారి “తెలంగానా చరిత్ర” అన్న 21 పుటల వ్యాసం ప్రచురించారు. 




“ఆంధ్ర పత్రిక” వారు “హైదరాబాద్ విమోచన దినోత్సవ సంచిక” అన్న ప్రత్యేక సంచిక ప్రచురించారు. 


వీటివల్ల ఆనాటి చరిత్ర, స్థితిగతులు తెలుసుకొనే అవకాశం వుంటుంది. నీలగిరి పత్రిక ఆనవాళ్ళు కూడా లభించటం లేదు. ఒకేసారి రెండు జిల్లాలనుండి రెండు నీలగిరి పత్రికలు వెలువడినట్లు తెలుస్తోంది. అయితే నీలగిరి పత్రికాధిపతి  చిత్రం లభించింది. బహుశా వీరు “షబ్నవీసు వేంకటరామ నరసింహారావు” గారు అయివుండాలి. నల్లగొండ జిల్లాను “నీలగిరి” జిల్లా కింద మార్చాలని ప్రతిపాదన కూడా వచ్చింది. 



మొత్తం మీద లభిస్తున్న వ్యాసాల వల్ల తెలంగాణాలో ఈ కింది పత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. 

హితబోధిని 1913, ఆంధ్ర మాత 1917, నీలగిరి 1922, తెలుగు వార పత్రిక 1922, ఆంధ్రాభ్యుదయము 1925, గోలకొండ పత్రిక 1925, నేడు పత్రిక 1925, దేశబంధు 1926, శైవమత ప్రచారిణి పత్రిక 1926, సుజాత 1927, భాగ్యనగర్ పత్రిక 1931, దక్కన్ కేసరి 1934, ఆంధ్ర కేసరి (లిఖిత పత్రిక) 1937, దివ్యవాణి 1937, తెలుగుతల్లి 1941, తెలంగాణా పత్రిక 1941, తరణి 1942, శోభ (దేవులపల్లి రామానుజ రావు గారిది) 1947, కాకతీయ పత్రిక 1944, ఆంధ్రశ్రీ 1944, భాగ్యనగర్ 1949, వెలుగు, స్వతంత్ర, సాహిత్య ఆంధ్రకేసరి, బాలసరస్వతి, పూలతోట, ప్రత్యూష. 

1947లో వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో బి. ఇంద్రసేన రెడ్డి అనే ఆయన “గ్రామజ్యోతి” అనే గోడపత్రికను నడిపారుట. ఏరోజుకారోజు గోడలమీద ఆనాటి వార్తలు రాసేవారుట. 

లభిస్తున్న కొన్ని పత్రికల ముఖచిత్రాలు 









Tags:  Telugu old Periodicals