Saturday, December 9, 2017

నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు

ప్రపంచ తెలుగు మహాసభల తరుణంలో నాటి “నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” అన్న వ్యాసం చూద్దాము. ఇది “విభూతి” అన్న 1939 నాటి సంచికలో వచ్చింది. ఇలాంటి వ్యాసాలవల్ల ఆనాటి తెలుగు పత్రికల తీరు తెన్నులు తెలిసే అవకాశం వుంటుంది. 


























1926 నాటి “ఆంధ్రపత్రిక”లో వచ్చిన “గోలకొండ పత్రిక”  ప్రకటన 






1925 నాటి “శారద” వారపత్రికలో వచ్చిన “నీలగిరి పత్రిక” ప్రకటన



 “ఆంధ్ర పత్రిక” 1914 నాటి సంచికలో మాడపాటి హనుమంతరావు గారి “నిజాము రాష్ట్రములోని ఆంధ్రులు” అన్న వ్యాసం ఒకటి ప్రచురించారు.



 అలాగే శ్రీపాద వారి “ప్రబుద్ధాంధ్ర” నవంబర్ 1934 సంచికలో లో సురవరము వారి “నిజాము రాజ్యములోని తెలుగు వారి స్థితి” అన్న వ్యాసం వచ్చింది. 



గడియారం రామకృష్ణ శర్మ గారి “సుజాత” సంచికలో మల్లంపల్లి వారి “తెలంగానా చరిత్ర” అన్న 21 పుటల వ్యాసం ప్రచురించారు. 




“ఆంధ్ర పత్రిక” వారు “హైదరాబాద్ విమోచన దినోత్సవ సంచిక” అన్న ప్రత్యేక సంచిక ప్రచురించారు. 


వీటివల్ల ఆనాటి చరిత్ర, స్థితిగతులు తెలుసుకొనే అవకాశం వుంటుంది. నీలగిరి పత్రిక ఆనవాళ్ళు కూడా లభించటం లేదు. ఒకేసారి రెండు జిల్లాలనుండి రెండు నీలగిరి పత్రికలు వెలువడినట్లు తెలుస్తోంది. అయితే నీలగిరి పత్రికాధిపతి  చిత్రం లభించింది. బహుశా వీరు “షబ్నవీసు వేంకటరామ నరసింహారావు” గారు అయివుండాలి. నల్లగొండ జిల్లాను “నీలగిరి” జిల్లా కింద మార్చాలని ప్రతిపాదన కూడా వచ్చింది. 



మొత్తం మీద లభిస్తున్న వ్యాసాల వల్ల తెలంగాణాలో ఈ కింది పత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. 

హితబోధిని 1913, ఆంధ్ర మాత 1917, నీలగిరి 1922, తెలుగు వార పత్రిక 1922, ఆంధ్రాభ్యుదయము 1925, గోలకొండ పత్రిక 1925, నేడు పత్రిక 1925, దేశబంధు 1926, శైవమత ప్రచారిణి పత్రిక 1926, సుజాత 1927, భాగ్యనగర్ పత్రిక 1931, దక్కన్ కేసరి 1934, ఆంధ్ర కేసరి (లిఖిత పత్రిక) 1937, దివ్యవాణి 1937, తెలుగుతల్లి 1941, తెలంగాణా పత్రిక 1941, తరణి 1942, శోభ (దేవులపల్లి రామానుజ రావు గారిది) 1947, కాకతీయ పత్రిక 1944, ఆంధ్రశ్రీ 1944, భాగ్యనగర్ 1949, వెలుగు, స్వతంత్ర, సాహిత్య ఆంధ్రకేసరి, బాలసరస్వతి, పూలతోట, ప్రత్యూష. 

1947లో వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో బి. ఇంద్రసేన రెడ్డి అనే ఆయన “గ్రామజ్యోతి” అనే గోడపత్రికను నడిపారుట. ఏరోజుకారోజు గోడలమీద ఆనాటి వార్తలు రాసేవారుట. 

లభిస్తున్న కొన్ని పత్రికల ముఖచిత్రాలు 









Tags:  Telugu old Periodicals

No comments:

Post a Comment