Showing posts with label వింజమూరి అనసూయాదేవి. Show all posts
Showing posts with label వింజమూరి అనసూయాదేవి. Show all posts

Saturday, October 17, 2015

బంగారు బతకమ్మ – కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగం

“బతకమ్మ” అంశం మీద శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి రేడియో ప్రసంగం విందాము. ఇది గత సంవత్సరంలో ప్రసారమైనది, ప్రసంగానంతరం ఒక పాట కూడా విందాము. చివరగా అనసూయాదేవిగారి సేకరణ నుండి “అమ్మ మాయమ్మా మాలచ్చ మమ్మా” అన్న గేయం. 











...







...








కొసమెరుపు

కావేరి నది జన్మస్థలం తలకావేరి1954  


 
ఎటువంటి అభ్యంతరాలున్నా పాట తొలగించబడుతుంది 


Tags: Bathakamma, Bathukamma, Kasireddy Venkat Reddy, Kasireddy venkatareddy, Thalakaveri, Anasuyadevi

Tuesday, May 19, 2015

కృష్ణశాస్త్రి గారి “అతిధిశాల” గేయాలు రజని గారి గళంలో

“అతిధిశాల” రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతము, ప్రధాన పాత్ర, నిర్వహణ బాలాంత్రపు రాజనీకాంతరావు గారు. రజనీ గారు “ఆత్మకధా విభావరి”లో, 1942లోనే ఇది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైనదని పేర్కొన్నారు. తిరిగి 1964లో రికార్డింగుచేసి ప్రసారంచేసిన “అతిధిశాల” నుండి రజని గారు పాడిన గేయాలు విందాము. వీటికి సాహిత్యం కూడా సేకరించి సమకూర్చటం జరిగింది. సాహిత్యం ముద్దుకృష్ణ గారి “నవీన కావ్యమంజరి” నుండి గ్రహించటం జరిగింది. “వైతాళికులు” పుస్తకం అనగానే ముద్దుకృష్ణ గారి పేరు గుర్తుకు వస్తుంది. వారి అరుదైన ఫోటో ఒకటి కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. “తళుకు జలతార్ బుటాలల్లిన” గేయం రజని గారి గళంలోను అలాగే అనసూయాదేవి గారి గళంలోనూ విందాము. ఈ రూపకంలో పాల్గొన్న వారి పేర్లు కూడా ఈగేయం చివర్లో వినబడతాయి. 










మధుపాత్ర 







తళుకు జలతార్ బుటాలల్లిన 



ముద్దుకృష్ణ గారు




Tags: Atidhisaala, Devulapalli Krishna Sastry, Balanthrapu Rajanikantharao, Rajani, Muddukrishna, Radio, Vinjamoori Anasooyadevi,

Friday, December 26, 2014

నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం

శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించినంత జానపద సాహిత్యం మరొకరు సేకరించి ఉండరు. వారి “మిన్నేరు”, “మున్నీరు” పుస్తకాలలో అసంఖ్యాకమైన జానపద గేయాలు దర్శనమిస్తాయి. వారి “పసిడి పలుకులు” ఒక మహత్తర గ్రంధం. దీంట్లో వేలకొద్ది సామెతలు, జాతీయాలు ఇంకా అనేకానేక విషయాలు లభిస్తాయి. ఇది మరో పెద్దబాలశిక్ష. వారి రచనల ముఖచిత్రాలు కొన్ని చూద్దాము. 







Source: visakhateeraana.blogspot.in




























వారి పసిడి పలుకులు నుండి ఒక అంశం చూద్దాము 








వారి ఇతర రచనల వివరాలు 






జానపద సాహిత్యానికి మూలముగా చెప్పుకొనే శ్రీ నందిరాజు చలపతిరావు గారి 1922 నాటి స్త్రీలపాటల పుస్తకం ముఖచిత్రం, విషయసూచిక గమనించండి. 1897లో దీని మొదటిభాగం ప్రచురించారుట. 









వీటిలో మున్నీరు”, పసిడి పలుకులు తప్ప మిగతావి శోధిస్తే DLI లో  దొరుకుతాయి. 



చివరగా అనసూయాదేవి గారు  మరియు బృందం పాడిన ఒక జానపద గేయం విందాము


 



Tags: Nedunuri Gamgadharam, Munneeru, Minneru, Pasidi Palukulu