Showing posts with label శ్రీరంగం గోపాలరత్నం. Show all posts
Showing posts with label శ్రీరంగం గోపాలరత్నం. Show all posts

Friday, September 2, 2016

హరహర మహాదేవ – రేడియో నాటిక – సత్యం శంకరమంచి

“అమరావతి కధలు” రచయిత శ్రీ శంకరమంచి సత్యం గారి రచన, పర్యవేక్షణలో వచ్చిన రేడియో నాటిక “హరహర మహాదేవ” వినండి. ఇందులో సి. రామ్మోహనరావు, ఎస్. పూర్ణానంద శాస్త్రి, ఎ. బి. ఆనంద్, వి. బి. కనకదుర్గ, ఎం. వెంకటేశ్వరరావు, పి. శ్రీహరనాద్, ఎ. ఎస్. రామచంద్రరావు, శంకరమంచి సత్యం, సత్యనారాయణ, గన్నేశ్వరరావు, నండూరి సుబ్బారావు, ఎం. నాగరత్నమ్మ గార్లు పాల్గొన్నారు. గానం – మల్లిక్, శ్రీరంగం, కనకదుర్గ గార్లు. పేర్లు చివర్లో వినబడతాయి. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. 















...




Tags: Harahara Mahadeva, Sathyam Sankaramanchi,         C Rammohanarao, Nanduri Subbarao, A B Anand, V B Kanaka Durga, M Nagarathnamma, Mallik, Srirangam Gopalarathnam, Radio natika, Radio Play,
 

Saturday, August 20, 2016

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన సప్తపది – సాహిత్యం, అధ్బుత చిత్రాలు

ధనుర్మాసంలో వినవచ్చే “తిరుప్పావై – సప్తపది” రేడియో ప్రసారంలో శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన తెలుగు పద్యాలను రచించినది ఎవరు అన్నది తెలియరాలేదు. తిరుప్పావై పుస్తకాలు చాలా చూసినా ఆ పద్యాలు మటుకు దొరకలేదు. చివరకు టి. టి. డి. వారి సప్తగిరి 1987 నాటి మాసపత్రికలలో రాసిన వారి వివరాలు, ఆ పద్యాల సాహిత్యం, వాటి తాలూకు చక్కటి చిత్రాలు లభించాయి. ఈ పద్యాలలో మొదటి పది పద్యాలు శ్రీనివాస గురుడు అనే ఆయన , చివరి ఇరవై పద్యాలు  శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తెనిగించినట్లు తెలుస్తోంది. అయితే 5,6,25,26,27,28,29,30 పాశురములకు సాహిత్యం, 29,30 పాశురములకు చిత్రాలు లభించలేదు. శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన 1,2,3,4  పాశురములకు సంబంధించిన పద్యాలు వింటూ ఆ వివరాలేమిటో చూద్దాము.  






















...























...




































ఈ తిరుప్పావై – సప్తపది ఆడియో  సి.డి.లు  ఆకాశవాణి వారి వద్ద లభిస్తాయి. 





Tags: Thiruppavai, Sapthapadi, Srirangam Gopalarathnam,