Showing posts with label భావన. Show all posts
Showing posts with label భావన. Show all posts

Saturday, March 19, 2016

“పోనిద్దురూ – మనకెందుకూ” – మొక్కపాటి వారి బాతాఖానీ

మనలో చాలామంది ప్రతి విషయానికి మున్ముందే స్పందించటం ఆనవాయితీ. నిత్యం జరిగే అనేక సంఘటనలమీద అంతర్జాలంలోని తమ ‘భావజాలం’లోనో లేక ఆయా వార్తాంశాలకింద వ్యాఖ్యల ద్వారానో తమతమ మనోభావాలను ప్రకటించటం, చివరకు అది వివాదాలకు, అభిప్రాయబేధాలకు తావివ్వటం చూస్తూనేవుంటాము. ఏదన్నా విషయమై పదిమందిని కదిలిస్తే పది భిన్నాభిప్రాయాలు వెలువడే రోజులివి. సరే రాజకీయాలలో ఉండేవాళ్లకు ఈ సామెత వర్తించదు, అనడం, పడటం వాళ్లకు పరిపాటి. కాని మధ్యేమార్గంగా ఈ ఉదాసీన వైఖరి అవలంబిస్తే జీవితాలు సాఫీగా వెళ్ళిపోతాయి. మరి ఈ విషయంలో మొక్కపాటి వారి ధోరణి ఏమిటో చూద్దాము. 






ముందుగా “మౌనము” అనే అంశం మీద శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి భావజాలం విందాము. ఆకాశవాణి వారి ‘భావన’ నుండి.



















చివరిగా “వినరో భాగ్యము” అన్నమాచార్యుల వారి కీర్తన శ్రీ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో. భక్తిరంజని ప్రసారం, ఇది బహుశా ఆకాశవాణి వారి రికార్డు అయివుంటుంది, అంతర్జాలంలో వినిపించే వీరు పాడిన ఇదే కీర్తనకు దీనికి స్వల్ప వ్యత్యాసం కానవస్తుంది










...



Tags: Mokkapati Narasimha Sastry, Vinaro bhagyamu, Annamacharula keerthana, Balakrishna Prasad, Sripathi Panditharadhyula Parvateesam, Bhakthiranjani, Bhavana, Akashavani, Annamayya,
 

Tuesday, October 14, 2014

భావన - లఘు ప్రసంగాలు, అన్నమయ్య కీర్తన

“అమ్మ” – ఎస్. పి. పార్వతీశం , “బాల్యం” – వి. వి. సత్యప్రసాద్, “వృద్ధాప్యం” - వి. వి. సత్యప్రసాద్ గార్ల లఘు ప్రసంగాలు విందాము. ప్రొద్దున్నే రేడియోలో ఐదునిమషాలపాటు వినవచ్చే ఈ లఘు ప్రసంగాలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను ఉసిరికాయతో తినాలన్నట్లుగా ముందుగా మల్లాది హనుమంతరావు గారి “ఉసిరికాయ”తో మొదలుపెడదాము. 






 “ఉసిరికాయ” - మల్లాది హనుమంతరావు





 “అమ్మ” – ఎస్. పి. పార్వతీశం



 “బాల్యం” – వి. వి. సత్యప్రసాద్


 “వృద్ధాప్యం” - వి. వి. సత్యప్రసాద్





చివరగా “కడు అజ్ఞానపు కఱవు కాలమిది” – అన్నమాచార్యుల కీర్తన ఒకటి విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. 






Tags: Bhavana, Kadu ajnaanapu karavu kaalamidi, Annamaacharya keerthana, Annamaiah, Annamayya,  Amma, Balyam, Vruddhapyam,

Sunday, May 11, 2014

భావన – లఘు ప్రసంగాలు

పొద్దునపూట రేడియోలో “భావన” పేరిట ఒక కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో రోజుకొక అంశం మీద పేరొందిన రచయితల, రచయిత్రుల లఘు ప్రసంగాలు ఉంటాయి. పొద్దున్నే లేవంగాన్లే అటువంటి ప్రసంగాలు వినటంవల్ల వాటి ప్రభావం కొంత గాకపోయినా కొంతన్నా మనమీద వుంటుంది. మనల్ని ఆలోచింప చేస్తాయి. కొద్దిపాటి సాహిత్యాభిరుచి ఉంటే మనం కూడా చిన్న చిన్న అంశాలమీద తత్సంబంధిత విషయాలు క్రోడీకరించి నాలుగు మాటలు రాయటం మొదలు పెడితే కలిగే ఆనందం వేరు. మరి ఇవాళ కింద పోస్ట్ చేసిన వారి భావజాలమేమిటో విందాము. 







సుఖ శాంతులు కె. కె. రంనాధాచార్యులు గారు 

        



నేను నాది అరుణా వ్యాస్ గారు 

                



చీకటి వెలుగులు  - వి. ఎస్. ఆర్. మూర్తి గారు 




స్వాభిమానం దత్తాత్రేయ శర్మ గారు 





హృదయ భాష పులివర్తి కృష్ణ మూర్తి గారు 






Tags: Bhavana, K K Ranganadha Charyulu, Aruna Vyas, Dattatreya Sarma, V S R Murthy, Pulivarthi Krishna Murthy

Wednesday, January 15, 2014

పల్లెల్లో సంక్రాంతి - సంగీత రూపకం - ఆకాశవాణి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేడియోలో ప్రసారమైన చిన్న సంగీత రూపకం “పల్లెల్లో సంక్రాంతి” వినండి. ముందుగా సంక్రాంతి ప్రాశస్త్యాన్ని వివరించే లఘు ప్రసంగం ఒకటి భావన కార్యక్రమంలో ప్రసారమైనది విందురుగాని.


















పల్లెల్లో సంక్రాంతి -  సంగీత రూపకం  









చివరగా వినంగాన్లే హృదయాన్ని హత్తుకొనే ఈ మధురమైన వెట్టి వలపు చల్లకు విష్ణు మూరితి నాకు అనే అన్నమాచార్య కీర్తన వినండి. బహుశా ఇది ఆకాశవాణి  వారి రికార్డు అయిఉంటుంది.




Tags: sankranthi, vetti valapu challaku, akashavani, AIR, samgeetha roopakam,