బి. ఎన్. రెడ్డిగారు తీసినవే పదకొండు సినిమాలు, దాంట్లో తొమ్మిది వాహినీవారి బ్యానర్ మీద, రెండు వేరేవారి బ్యానర్లకోసం దర్శకత్వం వహించినవి. వాటిల్లో అందరికీ బాగా నచ్చినది ‘మల్లీశ్వరి’, అయినా బెస్ట్ సినిమా తీయలేకపోయానన్నారు. పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారు 1973లో బి.ఎన్. గారితో చేసిన ఇంటర్వ్యూ తాలూకు వ్యాసం చూద్దాము.
గొల్లపూడి మారుతీరావు గారు బి.ఎన్. గారిమీద ఒక పుస్తకం రాశారు. దీంట్లో ‘మల్లీశ్వరి’ సినిమాకు మూలకధ 1944 భారతిలో ప్రచురించిన బుచ్చిబాబు గారి నాటిక ‘రాయల కరుణకృత్యం’ అన్న ప్రస్తావన వచ్చింది. ఇది రేడియో నాటికగా వచ్చిందిట, దీనికి బి. ఎన్. గారు ఉపోద్ఘాతం చెప్పారుట, ఈ రేడియో నాటికలో టి. జి. కమలాదేవి గారు పాల్గొన్నారుట. దీని గురించి బుచ్చిబాబు గారి సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి గారు చెప్పిన వివరాలు ఇక్కడ వినవచ్చు. (ఆకాశవాణి వారి ప్రసారం).
ఎక్కడో చదివినట్లు గుర్తు, మల్లీశ్వరి సినిమాని సర్వేపల్లి రాధాకృష్ణ గారికి చూపించటం జరిగిందిట. “పిలచిన బిగువటరా” పాట సన్నివేశానికి ముందు పెద్దవాన పడినట్లుగా చూపించారు, పాట అయినాక రాజుగారి పరివారం గుఱ్ఱాలమీద తిరిగివెళుతున్నప్పుడు, గుఱ్ఱాల కాళ్లగిట్టలవల్ల ధూళిలేస్తూ కనిపిస్తుంది, ‘అంతకు ముందే వర్షంపడితే ధూళి ఎలా లేస్తుందని’, సర్వేపల్లి వారు బి.ఎన్. గారిని ప్రశ్నించారుట.
Tags: B N Reddy, Malliswari 1951
No comments:
Post a Comment