శ్రీ తలిశెట్టి రామారావు గారు (1896 – 1947)(త.రా.) తొలితరం తెలుగు చిత్రకారులు. వీరి చిత్రాలలో “వ్యంగ్యం” ప్రధానాంశం. చూడగానే చురుక్కుమనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ఎంతో ముందుచూపుతో ఆలోచించి వేశారు. వీరు 1918 లోనే చిత్రాలు ఎలాగీయాలి అంటూ “చిత్రలేఖనము” అన్న పుస్తకం రాశారు. వీరు కార్టూన్లతో పాటు ఇతర చిత్రాలు గూడా చిత్రించారు. చిత్రకళ మీద వీరి వ్యాసాలు భారతిలో ప్రచురింపబడ్డాయి. వీరి చిత్రాలు ప్రముఖంగా భారతి మాసపత్రిక , ఆంధ్రపత్రిక వార్షికసంచికలలో ప్రచురింపబడ్డాయి. వీరి చిత్రాలు ఈమధ్యకాలంలో రెండు సంపుటాలుగా ప్రచురించారు. కింద దాదాపు ఓ ఎనభై చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవన్నీ ప్రెస్అకాడమీ వారి సైట్ నుండి ఎప్పటినుండో సేకరిస్తూరావటం జరిగింది.
Tags:
Thalisetti Ramarao, Talisetti, Telugu Cartoons,
No comments:
Post a Comment