సి. హెచ్. (చదలవాడ) నారాయణరావుగారు చిత్రసీమలో అడుగుపెట్టాక నాగయ్యగారు హీరోపాత్రలకు స్వస్తిపలకాల్సివచ్చిందని శ్రీ కె.ఎన్.టి. శాస్త్రి గారు "అలనాటి చలనచిత్రం" పుస్తకంలో పేర్కొన్నారు. ఎమ్. ఎస్. రామారావు గారు (తాసిల్దార్ 1944), ఘంటసాల గారు (స్వర్గసీమ 1945) ఇద్దరుకూడా వారి మొదటి సినిమా పాటను నారాయణరావు గారికోసం పాడటం విశేషం. నారాయణరావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి జ్యోతిచిత్ర ప్రత్యేకసంచికలో వచ్చింది. దానితో పాటు, పైన పేర్కొన్న పాటలను కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. నారాయణరావు గారు నటించినది (దాదాపుగా 22 చిత్రాలు) తక్కువ చిత్రాలే అయినా చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొన్నారు. వారు నటించిన ఇరవై చిత్రాల పోస్టర్స్ కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది.
మొదటి సినిమా |
ఎమ్.ఎస్. రామారావు గారు తాసిల్దార్ సినిమాలో నారాయణరావు గారికోసం పాడిన పాట విందాము. భానుమతిగారు పాడిన “మావారు తాసిల్దార్” అనే పాట ఈ సినిమాలోదే. కె. జమునారాణి గారు ఏడేళ్ళ వయసులో ఈ సినిమాలో “ఏమందువే చినవదిన” అనే పాటను పాడారు. ఈ పాటలు మరో సందర్భంలో విందాము.
Source: Sakhiyaa.com |
అన్నప్రాసననాడే ఆవకాయతో అన్నట్లుగా, ఘంటసాలగారు తన మొదటిపాటను నారాయణరావుగారికోసం స్వర్గసీమలో భానుమతిగారితో కలిసిపాడారు. ఆ పాట కూడా విందాము.
Source: Sakhiyaa.com |
తాసిల్దార్ సినిమాలో ఎమ్.ఎస్. రామారావు గారు పడవనడిపేవానిగా నటించి ఆ సన్నివేశంలో నండూరివారి ఎంకిపాట “ - ఈ రేయి నన్నొల్ల నెరవా రాజా - ” పాడారుట, ఆ పాట కూడా విందాము.
..
లక్ష్మమ్మ సినిమాలో ఎమ్.ఎస్. రామారావుగారు నారాయణరావుగారికోసం పాడిన హుషారైన చక్కటిపాట ఈ లింకు ద్వారా వినవచ్చు.
Tags: Ch.
Narayanarao, M S Ramarao, Enki pata, Ghantasala, Tasildar, Swargaseema, 1940,
1944, C H Narayanarao,
manchi gaa parichayam chesaaru
ReplyDeletedhanyavaadamulu