Thursday, December 29, 2016

వడ్డేపల్లి కృష్ణ గారి గేయం బాలకృష్ణప్రసాద్ గారి గళంలో

వడ్డేపల్లి కృష్ణ గారి గేయం “గతం గంధాలద్దుకుంటూ, వర్తమానం దిద్దుకుంటూ, బతుకు రమ్యం చేసుకోవోయ్, భావిగమ్యం చేరుకోవోయ్” అనే ప్రభోదాత్మక గేయం గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో విందాము. సంగీతం ఓగేటి వెంకటరమణమూర్తి గారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ఈమాసపు పాట. 







..



Tags: Vaddepalli Krishna, G Balakrishna Prasad, Ogeti Venkata Ramana Murthy, Eemasapu Pata, Lalitha Geyam, Akashavani,

Monday, December 26, 2016

చిలకమర్తి వారి గణపతి – రేడియో నాటిక

పాతికేళ్ళ కిందట రేడియోలో ప్రసారం అయినప్పుడు రికార్డు చేసిన నాటకం ఇది. మొదటగా ఇది 1967లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు శ్రీ బందా వారి పర్యవేక్షణలో రూపొందించారుట.










పుచ్చా పూర్ణానందం



ప్రయాగ నరసింహ శాస్త్రి



..

బహుళ ప్రాచుర్యం పొందిన ఈ రేడియో నాటకంలో నటించిన వారు

పంతులు – పుచ్చా పూర్ణానందం 
నాగేసు – చిరంజీవి భీమరాజు మోహన్ 
చలపతి – చిరంజీవి కె. కుటుంబరావు 
సింగమ్మ – పి. సీతారత్నం 
గణపతి – నండూరి సుబ్బారావు 
నాగన్న – ఉప్పలూరి రాజారావు 
మాచమ్మ – ఎ. పూర్ణిమ 
అమ్మమ్మ – పేరు ప్రకటించలేదు, సీతారత్నం గారే గొంతు మార్చారా? 
రంగన్న – సండూరి వెంకటేశ్వర్లు 
మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి 
భజంత్రీ – బందా 
ఓవర్సీ – సి. రామ్మోహనరావు 
గరుడాచలం – సంపూర్ణ రాజరత్నం 
సూత్రధారుడు – ప్రయాగ నరసింహ శాస్త్రి 
భద్రాచలం – చిరంజీవి కె. కూర్మనాధం 


Tags: Ganapathi Radio natakam, Radio drama, Radio play, Ganapati, Nanduri Subbarao, Nandoori Subbarao, Banda Kanakalingeswararao, P. Sitharathnamma, Pucha Poornanandam, C. Rammohanarao, Prayaga Narasimha Sastry, Chilakamarthi Lakshminarasimham,
 

Saturday, December 24, 2016

డిశంబరు ఇరువది ఐదు – వారణాసి వెంకట్రావు గారి లలితగేయం

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వారణాసి వెంకట్రావు గారు రచించి, స్వరపరచిన లలితగేయం “డిశంబరు ఇరువది ఐదు” విందాము. గానం సి.హెచ్. సుధారాణి, డి. మురళీకృష్ణ, వేదాంతం అనంతకృష్ణ శర్మ గార్లు. 














..






Tags: Varanasi Venkatrao, Krismas, Christmas, C. H. Sudharani, D. Muralikrishna, Vedamtham Ananthakrishna Sarma,

Monday, December 19, 2016

పూర్తిగా 206 పద్యాలతో కూడిన కవిచౌడప్ప శతకము

...................... కుందవరపు కవిచౌడప్పా; అను మకుటంతో 16వ శతాబ్దంనాటి కవిచౌడప్ప రచించిన కవిచౌడప్ప శతకములో  విశ్లేషకులు ఇబ్బందికర పద్యాలను పక్కన పెడుతుండటంతో, అసలు ఈయన ఎన్ని పద్యాలు రచించారు అన్నదానికి సరైన సమాధానం దొరకదు. ప్రస్తుతం మనకు ప్రచురణలో లభిస్తున్న పుస్తకాలలో 168 పద్యాలవరకే లభిస్తున్నాయి.  అయితే నీతి, శృంగారం,  అన్నీకలిపి ఈయన రచించిన పద్యాలు రెండువందల పైచిలుకే యని చదివినట్లు గుర్తు. ఈ తరుణంలో నా సేకరణలో ఉన్న వీరివి రెండు శతకాలలో ఒక శతకమును ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఒక శతకములో వంద పద్యాల వరకే వున్నాయి, అయితే 1934 నాటి మరొక శతకములో పూర్తిగా 206 పద్యాలు వున్నాయి.




వంద పద్యాల శతకము























Tags: Kavi Chowdappa, Kundavarapu kavi chowdappa, kavi chowdappa satakamu, Sathakamu