Tuesday, June 28, 2016

లలిత గేయాలు – శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు

“ఎంత అందమైనవమ్మ జీవితదీపాలు” రచన శ్రీ ఆచార్య తిరుమల, “గోదారి జోతలో, పాదాల జోతలో” రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి గళంలో లలితగేయాలు ఆకాశవాణి వారి ప్రసారం నుండి విందాము. రెండవ గేయం సమయాభావం వాల్ల పూర్తిగా ప్రసారం చేయలేదు.

శ్రీ ఆచార్య తిరుమల


 ఎంత అందమైనవమ్మ జీవితదీపాలు

... గోదారి జోతలో, పాదాల జోతలో

...
చివరగా భక్తిరంజని నుండి అన్నమాచార్యులవారి కీర్తన “ఆదిపురుష అఖిలాంతరంగ” విందాము. ఇది వేదవతి ప్రభాకర్ గారు పాడినది కాదు. 


...Tags: Vedavathi Prabhakar, Acharya Thirumala, Devulapalli Krishna Sastry, Annamacharya, Entha Andamainavamma Jeevitha Deepaalu, Godari jothalo padala jothalo, Aadipurusha akhilaamtharanga, Lalitha geyalu, Lalita geethalu, Keerthanalu,

Sunday, June 26, 2016

మనచిత్రకారులు – శ్రీ ప్రమోద కుమార చటర్జీ

ఈ శీర్షిక కింద ఇవాళ అడవి బాపిరాజు గారి గురువుగారైనటువంటి శ్రీ ప్రమోద కుమార చటర్జీ (ప్రమోద కుమార చటోపాధ్యాయ)(1885-1979) గారు చిత్రించిన కొన్ని చిత్ర్రాలు చూద్దాము. వీరు బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో శిల్పాచార్యులుగా పనిచేసారు.


వీరి గురించిన మరింత సమాచారం కొరకు ఈ  కింది లింకులు చూడవచ్చు

Tags: pramod kumar chatterjee, pramod kumar chattopadhyay, Chattopadhyay, Pramodkumar
Friday, June 24, 2016

పాత పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటానికి సులభమార్గం

ఏకాంబరం: చిన్నక్కా, చిన్నక్కా 

చిన్నక్క: ఏం ఏకాంబరం, అంత కోపంగా వచ్చావు 

ఏకాంబరం: కాక, ఇంతకు ముందు నువ్వు “పాత తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా” అని చెప్పావు గుర్తుందా 

చిన్నక్క: అవును చెప్పాను 

ఏకాంబరం: ఏం లాభం, ఒక్క పుస్తకం కూడా డౌన్లోడ్ అవటంలేదు డి. ఎల్. ఐ. నుండి ఆ సాఫ్ట్ వేర్ ద్వారా 

చిన్నక్క: ఓ అదా, నీకు చెప్పటం మరిచాను ఏకాంబరం, ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవటానికి అవకాశం కల్పించారు, ఇప్పడు చాలా తేలిక 

ఏకాంబరం: మరి ఎలా చేసుకోవాలి 

చిన్నక్క: ఇదిగో దాని  లింకు, కుడి చేతివైపు “స్కానింగ్ సెంటర్” మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇలా సెంటర్ వారీగా కనబడతాయి. కావాల్సిన సెంటర్ మీద క్లిక్ చేస్తే పుస్తకాల లిస్టు కనబడుతుంది. లేదా అలా కుడిచేతివైపు కనబడే ఇతర మార్గాల ద్వారా చూడవచ్చు. లేదా సెర్చ్ ద్వారా కూడా చూడవచ్చు. ఉదాహరణకు సెర్చ్ లో బాపు అని ఈ విధంగా టైపు చేస్తే బాపు గారి కార్టూన్ల పుస్తకం కనబడుతోంది, ఇలా టైపు చేస్తే “బాపురమణీయం” పుస్తకం కనబడుతోంది. ఆ పుస్తకం మీద రైట్ క్లిక్ చేసి Save Link As మీద క్లిక్ చేస్తే ఆ పుస్తకం మొత్తం PDF లో డౌన్లోడ్ అవుతుంది. చూశావా ఎంత తేలికో. రచయిత పేరుమీద, పుస్తకం పేరుమీద, ప్రచురణ సంస్థ పేరుమీద సెర్చ్ చేయవచ్చు.  ఏకాంబరం: మరి ఇంత సులభమార్గం పెట్టుకొని, ఇంతకు ముందు పెద్ద లెక్చర్ ఇచ్చావు 

చిన్నక్క: ఏంచేసేది ఏకాంబరం, అప్పటికి అది మార్గం, ఇప్పటికి ఇది, ఇప్పుడన్నా కోపం తగ్గిందా 

ఏకాంబరం: మా చిన్నక్కతో వచ్చిన తంటానే ఇది 


Tags: How to download books from DLI

Thursday, June 23, 2016

దీక్షిత దుహిత – తల్లావజ్ఝల – సంగీత నాటకం

పరుచూరి శ్రీనివాస్ గారు ఈమాట.కాం లో శ్రీ తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారి రచన “దీక్షిత దుహిత”, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి సంగీత నాటకం పోస్ట్ చేశారు. సంగీత పరంగా అధ్బుతమైన నాటకం. దీంట్లో గొప్పగొప్ప కళాకారులు పాల్గొన్నారు. మొత్తం పద్యాలతోనే సాగుతుంది. ఈ నాటకానికి సాహిత్యం సమకూరిస్తే చక్కగా వింటూ సాహిత్యం కూడా చూడవచ్చుగాదా అనిపించింది. 1938 నాటి “ప్రతిభ” సంచికలో ప్రధమ రంగం వరకే దొరికింది. అది మొత్తంగా కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. వినబడే పద్యాలవరకు గుర్తించటంజరిగింది. రెండు, మూడు రంగాలలోవి మటుకు వినబడే పద్యాలవరకే పోస్ట్ చెయ్యటం జరిగింది. 

అప్పయ్య దీక్షితుల వారి వితంతువగు కుమార్తె, దీక్షితుల వారి శిష్యుడు వివాహం చేసుకోవాలను కుంటారు. నాటి సామాజిక పరిస్థితుల కారణంగా దీక్షితుల వారు దానికి అంగీకరింపరు, స్థూలంగా ఇది సారాంశం. నాటకం యొక్క ఇతివృత్తం తెలుసుకోటానికి 1946 లో ప్రచురించిన ఈ నాటకం యొక్క పీఠిక నుండి కొంతభాగాన్ని కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. 

T. Sivasankara Sastry


T. Sivasankara Sastry

T. Sivasankara Sastry


n c v jagannadhacharyulu  - v  b kanakadurga  - source -  airddfamily.blogspot.in

Srirangam Gopalarathnam

A Kamala Chandra Babu (T G Kamala Devi)


Indraganti Janakibala

Oleti Venkateswarlu


Dwaram Bhavanarayana Raoఈ లింకు ద్వారా ఈ నాటకాన్ని వినవచ్చు. నాటకం చివర్లో వచ్చే వృద్ధ బ్రాహ్మణ స్వరమేళ, యువ బ్రాహ్మణ స్వరమేళ, వితంతువుల స్వరమేళ వినసొంపుగా వుంటాయి 


శ్రీ అప్పయ్య దీక్షితుల వారి గురించి మరింత సమాచారం కొరకు ఈ లింకు చూడండి.
Tags: T. Sivasankara Sastry, Tallavajhula Sivasanka Swamy, Deekshita duhita, Mallik, Srirangam Gopalarathnam, N C V Jagannadhacharyulu,   A Kamala Chandra Babu (T G Kamala Devi),  V. Balatripura Sundari,   Oleti Venkateswarlu, Malladi Suribabu, Indraganti Janakibala, Dwaram Bhavanarayana Rao