సదానందం: హల్లో బావగారు కులాసానా
చిదానందం: ఆ.... ఆ...... రండి రండి కూర్చోండి, బహుకాలదర్శనం
సదానందం: ఏవిటో పాతపుస్తకాలు తిరగేస్తున్నట్లున్నారు
సదానందం: ఏమిటి బుక్ ఫెయిర్ లో పాతపుస్తకాలా?
సదానందం: మరి నాకు చెప్పారుకాదూ
సదానందం: మరి పాత పుస్తకాలు లభించే మార్గం లేదంటారా
సదానందం: ఏదీ ఆ DLI నుండా, ఆ డౌన్లోడ్ కాదుకాని నా ప్రాణం పోతోంది
సదానందం: మరి ఆ లింకేదో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ
సదానందం: ఇప్పుడేంచేయాలి
సదానందం: చేశాక
సదానందం: సంతోషం, ఇంకా ఎవన్నా వెబ్సైట్లు ఉన్నాయా బావగారూ
http://musicresearchlibrary.net/omeka/items/browse?collection=10&sort_field=Dublin+Core%2CTitle
చిదానందం: అంతేకాదా మరి
చిదానందం: బాగా గ్రహించారు
సదానందం: ఏది ఏకంగా త్రేతాయుగం నాటివే?
http://www.rarebooksocietyofindia.org/
సదానందం: మరి ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చా
సదానందం: ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరకవా
సదానందం: ఇక్కడ ఫోటోలు కూడా దొరుకుతాయా
సదానందం: మరి అవి మనం సేవ్ చేసుకోవచ్చా
చిదానందం: ఉండండి ఇంకో రెండు వెబ్సైట్లు చూద్దాము
సదానందం: అలాగే కానీండి
సదానందం: ఇక్కడేదో అన్ని మతాల వారివి ఉన్నట్లున్నాయే
సదానందం: చివరగా ఇంకో వెబ్సైట్ ఉందన్నారు
http://eap.bl.uk/database/results.a4d?projID=EAP038
చిదానందం: ఉండండి కాస్త కాఫీ తాగి వెళుదురుగాని
సదానందం: మళ్ళీ వస్తా ఇప్పటికే చాలా సమయాభావం అయింది.
చిదానందం: సంతోషం
చిదానందం: ఆ.... ఆ...... రండి రండి కూర్చోండి, బహుకాలదర్శనం
సదానందం: ఏవిటో పాతపుస్తకాలు తిరగేస్తున్నట్లున్నారు
చిదానందం: ఈ మధ్య మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఒక షాపతను అమ్ముతుంటే కొన్నాలెండి
సదానందం: ఏమిటి బుక్ ఫెయిర్ లో పాతపుస్తకాలా?
చిదానందం: అవును మరి అతను అమ్మినవి ప్రస్తుతం ముద్రణలోలేని అరుదైన తెలుగు పుస్తకాలు.
సదానందం: మరి నాకు చెప్పారుకాదూ
చిదానందం: ఏదండీ చెప్పేలోపలే పుస్తకాలన్నీ హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతేను
సదానందం: మరి పాత పుస్తకాలు లభించే మార్గం లేదంటారా
చిదానందం: లేకేమండీ అలా కంప్యూటర్ ముందు కూచుందాం రండి, హార్డ్ కాపీ కాకపోతే సాఫ్ట్ కాపీ చూద్దాము
సదానందం: ఏదీ ఆ DLI నుండా, ఆ డౌన్లోడ్ కాదుకాని నా ప్రాణం పోతోంది
చిదానందం: ఇంకో మార్గం చెబుతానుకదా, మన ఉస్మానియా యూనివర్సిటీ వారిది ఒక వెబ్సైట్ వుంది, అక్కడ నుండైతే మూడే క్లిక్కుల్లో పుస్తకం మొత్తం ఠపీమని డౌన్లోడ్ అయికూచుంటుంది
సదానందం: మరి ఆ లింకేదో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ
చిదానందం: ఇదిగో ఆ లింకు, తెలుగు సెలక్ట్ చేస్తే 697 తెలుగు పుస్తకాలు ఉన్నాయిట
సదానందం: ఇప్పుడేంచేయాలి
చిదానందం: కావలసిన పుస్తకం మీద రైట్ క్లిక్ చేసి “open link in new tab” మీద నొక్కండి
సదానందం: చేశాక
చిదానందం: ఆ కనబడే లింకుల మీద ఎక్కడన్నా మళ్ళీ రైట్ క్లిక్ చేసి “save link as” మీద నొక్కితే ఆ పుస్తకం PDF లో డౌన్లోడ్ అవుతుంది.
సదానందం: సంతోషం, ఇంకా ఎవన్నా వెబ్సైట్లు ఉన్నాయా బావగారూ
చిదానందం: ఇదిగో ఈ లింకు చూసారా ఇది మ్యూజిక్ రీసెర్చ్ లైబ్రరి వారిది, దీంట్లో భక్తిసాహిత్యం పుష్కలంగా ఉంది. 124 పుస్తకాలు ఉన్నట్లున్నాయి
http://musicresearchlibrary.net/omeka/items/browse?collection=10&sort_field=Dublin+Core%2CTitle
సదానందం: మరి కావలసిన పుస్తకం మీద రైట్ క్లిక్ చేసి “open link in new tab” మీద నొక్కమంటారా
చిదానందం: అంతేకాదా మరి
సదానందం: ఆ కనబడే డౌన్లోడ్ మీద రైట్ క్లిక్ చేసి “save link as” మీద నొక్కితే ఆ పుస్తకం డౌన్లోడ్ అవుతుందనుకుంటాను
చిదానందం: బాగా గ్రహించారు
సదానందం: సరే ఇది కూడా బాగానే ఉంది. ఎంతసేపూ తెలుగు పుస్తకాలేనా కాస్త ఆంగ్ల పుస్తకాలేమన్నా దొరుకుతాయా
చిదానందం: దొరక్కేమండీ, “Rare Book Society of India” వారిది ఒక వెబ్సైట్ వుంది. ఇక్కడైతే ఇక్ష్వాకుల కాలంనాటి పుస్తకాలు, ఫోటోలు లభిస్తాయి.
సదానందం: ఏది ఏకంగా త్రేతాయుగం నాటివే?
చిదానందం: భలేవారు బావగారూ ఇక్ష్వాకుల కాలంనాటివి అంటే బహు పాతవని అర్ధం. ఇదిగో ఇది దాని లింకు. పైన కనబడే బుక్స్ మీద క్లిక్ చేయండి
http://www.rarebooksocietyofindia.org/
సదానందం: మరి ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చా
చిదానందం: అక్కడ కింద కనబడే “view details” మీద నొక్కి చూడండి. లింకు వుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సదానందం: ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరకవా
చిదానందం: తెలిసినంతవరకు “బ్రౌన్ నిఘంటువు”, “శంకరనారాయణ గారి నిఘంటువు” మాత్రమే లభిస్తున్నాయి. ఇక్కడ బ్రిటిష్ ఇండియా కాలం నాటివి ఎక్కువ దొరుకుతాయి.
సదానందం: ఇక్కడ ఫోటోలు కూడా దొరుకుతాయా
చిదానందం: మామూలువి కాదు కళ్ళు చెదిరిపోయే డ్రాయింగ్స్ కనబడతాయి
సదానందం: మరి అవి మనం సేవ్ చేసుకోవచ్చా
చిదానందం: సంతోషంగా కానీ ఎక్కడా వాటిని మనం వాడకూడదు అవన్నీ కాపీరైట్ ఉన్నవి
సదానందం: చాలా ముదావహం బావగారూ ఇప్పుడే వెళ్ళి వీటి మీద పరిశోధన చేస్తాను
చిదానందం: ఉండండి ఇంకో రెండు వెబ్సైట్లు చూద్దాము
సదానందం: అలాగే కానీండి
చిదానందం: ఈ వెబ్సైట్ పేరు “Internet Sacred Text Archive”. ఇక్కడ మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణాదులు ఒక్కమాటలో చెప్పాలంటే మన వేద వాఙ్మయమంతా ఆంగ్లంలో లభిస్తుంది
సదానందం: ఇక్కడేదో అన్ని మతాల వారివి ఉన్నట్లున్నాయే
చిదానందం: హిందూయిజం లో పైన చెప్పినవన్నీ కనిపిస్తాయి. చివర్లో సంస్కృతాంగ్ల నిఘంటువు కూడా వుంది
సదానందం: చివరగా ఇంకో వెబ్సైట్ ఉందన్నారు
చిదానందం: ఇది British Library వారిది, దాని లింకు ఇది, ఇవి పూర్తిగా తెలుగు పుస్తకాలు, చదువుకోవటానికి మాత్రమే, కావలసిన పుస్తకం మీద క్లిక్ చేస్తే కనబడుతుంది
సదానందం: ఏదో ఒకటి ఆ పుస్తకాలను ఈ మాత్రం కళ్లజూడ గలుగుతున్నాం, అదే పదివేలు, మొత్తానికి చాలా మంచి విషయాలు చెప్పారు బావగారూ వస్తా మరి
చిదానందం: ఉండండి కాస్త కాఫీ తాగి వెళుదురుగాని
సదానందం: మళ్ళీ వస్తా ఇప్పటికే చాలా సమయాభావం అయింది.
చిదానందం: సంతోషం
Tags: Old books, Old telugu books, Rare
books,
చాలా సంతోషం. ఉండండి కొన్ని పుస్తకాలు చూసివస్తాను!
ReplyDeleteమాస్టారూ నాకు మొదటి లింగ్ ఓపెన్ కావడం లేదు
Deleteపుస్తకాభిమానులకు సంతోషం కలిగించే సమాచారాన్ని శ్రద్ధగా- సచిత్రంగా - వివరంగా అందించారు. థ్యాంక్యూ.
ReplyDeleteపుస్తక ప్రియులకి అమూల్యమైన నూతనసంవత్సర కానుక ఇది. ధన్యవాదాలు వెంకటరమణ గారు.
ReplyDeletevery useful information
ReplyDeleteమీ మీ అభిప్రాయాలూ తెలిపినందుకు ధన్యవాదాలు, సంతోషం
Deleteవెంకటరమణ గారు: ఆ బ్రిటిష్ లైబరీలోని పుస్తకాలను మీరు archive.org నుండి లేక తిన్నగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారి సైటు నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే archive.org లో మీకు చాలా తెలుగు పుస్తకాలు దొరుకుతాయి. మీకు ఉస్మానియా యూనివర్సిటీ వారి వెబ్సైట్ నుండి మూడే క్లిక్కుల్లో పుస్తకం మొత్తం డౌన్లోడ్ అయితే ఇక్కడ ఒక్క క్లిక్కులోనే అయిపోతుంది.
Deleteశ్రీ శ్రీనివాస్ గారు Archive.org చాలామందికి తెలిసేవుంటుందని పేర్కొనలేదు. అన్నీ తిరిగి Archive.org కే చేరతాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారిది నేను గమనించలేదు. బ్రిటిష్ లైబ్రరీ బుక్స్ Archive.org లో ఉన్నాయని తెలుసు. అయితే అందరికి ఉపయోగపడతాయని తెలియపరచాను. ధన్యవాదాలు
Deleteఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
ReplyDeleteమహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
అలాగే సాయి రామ్ వారు ఉడతా భక్తి గా 4200+ ఆధ్యాత్మిక గ్రంధాలను సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. దయచేసి ఈ అవకాశం వినియోగించుకోగలరు.
సాయి రామ్ వెబ్ సైట్(ఉచిత గ్రంధాలు) - http://www.sairealattitudemanagement.org
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
You are an encyclopedia. Every post is a great teaching
ReplyDeleteI am searching for one old religious book on Sri Hanuman by Sri Kuntamukkala Rama Rao but not getting any clue;thanks if any guidance is posted to mymail id
ReplyDeletesir naku thalisetti ramarao gari chitralekanam book kavali chepandi 9701793815 or tpsarathi2009@gmail.com
ReplyDeleteనేను ఆంధ్ర పత్రిక, సంవత్సరాది సంచిక, హేమలంబ 1957 కోసము వెదుకుతున్నను. ఎవరి వద్దనైనా ఈ సంచిక ఉంటె దయచేసి తెలుప గలరు
ReplyDelete