Friday, May 24, 2013

“గాజుపాలెం గాంధి” – మొక్కపాటి వారి అరుదైన కధానిక

మొక్కపాటి అనగానే మనకు పార్వతీశం గుర్తుకు వస్తాడు. మొక్కపాటి వారి ఇతర రచనల గురించి మనకు అంతగా సమాచారం లభించదు. అవి ప్రస్తుతం ప్రచురణలో లేవు. 1970లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో పార్వతీశం మొదటిభాగం ప్రచురితమవుతున్నపుడు మొక్కపాటి వారి ఇతర రచనలు కొన్ని పేర్కొనటం జరిగింది. 

 
మొక్కపాటి వారి రచనలలోని  గాజుపాలెం గాంధికధానిక స్కానింగ్ కింద చూడండి. ఈ కధ 1951లో ప్రచురితమైన మొక్కపాటి వారి కన్నవి : విన్నవికధల పుస్తకం  మొదటిభాగం లోనిది.



Wednesday, May 22, 2013

గుత్తొంకాయ్ కూరోయ్ బావా - బందా కనకలింగేశ్వర రావు గారు

బసవరాజు అప్పారావు గారి రచన – బందా కనకలింగేశ్వర రావు గారి గానం – ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి 














Thursday, May 16, 2013

చలిగాలి వీచింది తెలవార బోతోంది - ఆరుద్ర - రావు బాలసరస్వతీదేవి

ఆకాశవాణి వారి ప్రసారం – లలిత గీతం - “చలిగాలి వీచింది తెలవార బోతోంది” – రచన ఆరుద్ర – గానం రావు బాలసరస్వతీదేవి గారు 













Monday, May 13, 2013

1940 (౧౯౪౦) లో విడుదలైన చిత్రాల పోస్టర్స్

ఈ సంవత్సరంలో ౧౨ (పన్నెండు) చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ చిత్రాల తాలూకు లభ్యమైన కొన్ని పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది. 






































































భూకైలాస్  పేరు వినగానే  మనకు రామారావు గారి సినిమానే గుర్తుకు వస్తుంది. కానీ అంతకు ముందే 1940 లో ఒక భూకైలాస్ వచ్చింది. ఈ సినిమాని దూరదర్శన్ సప్తగిరిలో తెలిసినంత వరకు రెండు సార్లు వేశారు. పైన మీరు గమనిస్తే ఒక పోస్టర్ 1936లో భూకైలాస్ నాటక ప్రదర్శనకు సంబంధించినది. అదే నాటకం అదే నటులతో 1940లో సినిమాగా తీశారు.  ఆ సినిమాలో లక్ష్మీబాయి గారు పాడిన ఒక పా విందాము.  రచన బలిజేపల్లి వారు. 




ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.