Friday, April 26, 2013

శతపత్రసుందరి - రజని – సూర్యకుమారి

టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన పాటలలోకెల్ల అతి మధురమైన పాట ఏదంటే “శతపత్రసుందరి” అని చెప్పాలి. బాలాంత్రపు రజనికాంతరావు గారు రచించి, సంగీతం సమకూర్చిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. 
















ఈ పాటను సూర్యకుమారి గారే స్వయంగా పాడుతుండగా చూడాలనుకున్నట్లయితే ఈ కింది లింకు ద్వారా చూడండి. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా రికార్డు చేసిన ఈ పాటను శ్రీ నాగభైరు అప్పారావు గారు యూట్యూబులోకి అప్లోడ్ చేశారు. ముందుగా వారికి అభినందనలు చెప్పాలి.


Sunday, April 21, 2013

సి. ఎస్. ఆర్. ఆంజనేయులు గారు పాడిన పాట, పద్యాలు

విభిన్న వాచకం గల నటుడు సి. ఎస్. ఆర్. గారు. వారు పాడిన పాటల్లో లభించేవి చాలా తక్కువ. మనకు అప్పుడప్పుడు టివిలో కనబడే పాట ఎల్. వి. ప్రసాద్ గారి గృహప్రవేశం సినిమాలోని “జానకి నాదేనోయ్”. ఒకసారి రేడియోలో ఆయన పాడిన పాట “ఆగవే మరదలా” వినిపించారు. ఈ పాట భరణీవారి రత్నమాల సినిమాలోది. ఈ పాటతో పాటుగా ప్రసారమైన రెండు పద్యాలు కూడా పోస్ట్ చేస్తున్నాను .



Monday, April 15, 2013

దేశమును ప్రేమించుమన్నా - గురజాడ - సూర్యకుమారి

గురజాడ అప్పారావు గారి “దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా” గేయం టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో. ఇది చాలా పెద్ద గేయం. సూర్యకుమారి గారు పాడిన చరణాల వరకే గేయ సాహిత్యం తీసుకోవటం జరిగింది. 












Sunday, April 14, 2013

పడవ నడపవోయి పూల పడవ నడపవోయి - పి. బి. శ్రీనివాస్

ప్రతివాది భయంకర శ్రీనివాస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కాని పి. బి. శ్రీనివాస్ అన్నా పిబిఎస్ అన్నా ఎరుగని వారు వుండరు. 1999లో వచ్చిన ఆంధ్రప్రభ వారి విశేష ప్రచురణ “మోహిని” లో ప్రచురితమైన పి. బి. శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ అలాగే 1981 లో వచ్చిన ఈనాడు వారి “సితార అవార్డుల ప్రత్యేక సంచిక” లో ప్రచురితమైన పి. బి. శ్రీనివాస్ గారి వ్యాసం యొక్క స్కానింగ్ కింద చూడండి. ఒకవేళ చిన్న అక్షరాలుగా అనిపిస్తే ఈ ఇమేజెస్ ను డౌన్లోడ్ చేసుకొని పెద్దవి చేసుకొని చూడండి.















అలాగే తెలుగు భాషను ప్రస్తుతిస్తూ పి. బి. శ్రీనివాస్ గారు రచించిన తెలుగు గరిమ పద్యాలు ప్రపంచ తెలుగు మహాసభల సంచికలో ప్రచురితమైనవి (ప్రెస్ అకాడమీ) కింద చూడండి. 
 

రోజు నుంచి ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు, పద్యాలు, గేయాలు, స్తోత్రాలు మనలకు వీనుల విందు చేస్తూనే ఉంటాయి.  

పడవ నడపవోయి పూల పడవ నడపవోయి అంటూ ఆయన పాడిన ఒక గేయం చాలా కాలం కిందట రేడియోలో ప్రసారమైనది.  ఆ గేయం ఒకసారి  విందాము. 



...

Saturday, April 13, 2013

లేపనైనా లేపలేదే మోము – బసవరాజు – సూర్యకుమారి

టంగుటూరి సూర్యకుమారి గారు గానం చేసిన “లేపనైనా లేపలేదే మోము” అనే గీతం – రచన బసవరాజు అప్పారావు గారు.










Friday, April 12, 2013

ఎస్. పి. లక్ష్మణ స్వామి గారు పాడిన పద్యాలు – తెనాలి రామకృష్ణ – 1941

1941లో విడుదలైన తెనాలి రామకృష్ణ సినిమాలో ఎస్. పి. లక్ష్మణ స్వామి గారు పాడిన పద్యాలు – ఆకాశవాణి వారు చాలా ఏళ్ల కిందట ప్రసారం చేసిన “సజీవ స్వరాలు” కార్యక్రమం నుండి, ఇంతకుముందు కొన్ని పద్యాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ పద్యాలలో “ఆంజనేయ మతిపాటలాలనం” పద్యం మినహా మిగతా పద్యాలు అంతర్జాలంలో లభించటం లేదు. 



     





Tuesday, April 9, 2013

పద్యాలతో - పద్మ, పుష్పమాల, రధ బంధనములు - సేకరణ

పూర్వకవులు పద్యాలను ఒక ఆకృతిలో ఇమిడేటట్లుగా కూర్చేవారు. పద్మ బంధము, పుష్పమాలా బంధము, రధ బంధము అలాంటి కోవకు చెందినవే. ముందుగా విభిన్న ఆకృతులు గీసుకొని సంధర్భానుసారంగా దాంట్లో ఇమిడేటట్లుగా, ఒక అర్ధం ఇనుమడించేలా వాక్యాన్నో, ఆశీస్సులనో, కవి పేరునో చొప్పించి దాన్ని చూట్టూ పద్యాన్ని అల్లుతారు. మళ్ళీ ఆ పద్యం యొక్క లక్షణానికి (సీస పద్యము, ఆటవెలది) తగ్గట్లుగా పద్యం సమకూర్చాలి. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియలా అనిపిస్తుంది. బహుశ అష్టావధానం చేసేవాళ్ళకు ఇది వెన్నతో పెట్టిన విద్య లాంటిది. పద్యం నడత గూడా విభిన్నంగా పైనుంచి కిందకు తిరిగి కిందనుంచి పైకి, కుడినుంచి ఎడమకు తిరిగి ఎడమనుంచి కుడికి సాగుతుంది. అలాంటి పద్య బంధాలను కింద చూడండి. ముందుగా పద్యాన్ని చదివి ఆ పద్యం ఆ బంధం లో ఎలా సాగుతోందో గమనించండి. చివరగా ఆ బంధంలో ఏర్పడ్డ వాక్యాన్ని వీక్షించండి . 

 ఇంతకీ ఈ పద్య బంధములు ఎక్కడివన్న విషయానికి వస్తే, 1928లో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారి (ఆంధ్ర పత్రిక) కుమార్తె కామాక్షి గారికి శివలెంక శంభు ప్రసాద్ గారికి జరిగిన వివాహమహోత్సవ సమయమున వధూవరులకు దాదాపు ఒక 80 మంది కవి పండితులు సమర్పించిన అభినందన ఆశీస్సులను “కామాక్షి కళ్యాణము” అను పేరిట ప్రచురించిన పుస్తకంలోనివి. 









































అలాగే గృలక్ష్మి సంచికలో ప్రచురితమైన పుష్పమాలికా బంధం గూడా ఒకటి చూడండి. 





Friday, April 5, 2013

శిశువు – పద్యాలు - గుఱ్ఱం జాషువా - ఘంటసాల

గుఱ్ఱం జాషువా గారి ఖండకావ్యము లోని కవితా ఖండిక “శిశువు” పద్యాలు అత్యంత రమణీయమైనవి. ఆయన సృష్టించిన చిన్ని శిశువు ఘంటసాల గారి గళంలో ప్రాణం పోసుకున్నది. పాపాయి పద్యాలుగా పేరెన్నికగన్న ఆ పద్యాల సాహిత్యాన్ని కంటూ ఘంటసాల గారి గళంలో మరొకసారి వీనుల విందు చేసుకుందాము. 







భారతి 1929


ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి