Sunday, April 14, 2013

పడవ నడపవోయి పూల పడవ నడపవోయి - పి. బి. శ్రీనివాస్

ప్రతివాది భయంకర శ్రీనివాస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కాని పి. బి. శ్రీనివాస్ అన్నా పిబిఎస్ అన్నా ఎరుగని వారు వుండరు. 1999లో వచ్చిన ఆంధ్రప్రభ వారి విశేష ప్రచురణ “మోహిని” లో ప్రచురితమైన పి. బి. శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ అలాగే 1981 లో వచ్చిన ఈనాడు వారి “సితార అవార్డుల ప్రత్యేక సంచిక” లో ప్రచురితమైన పి. బి. శ్రీనివాస్ గారి వ్యాసం యొక్క స్కానింగ్ కింద చూడండి. ఒకవేళ చిన్న అక్షరాలుగా అనిపిస్తే ఈ ఇమేజెస్ ను డౌన్లోడ్ చేసుకొని పెద్దవి చేసుకొని చూడండి.















అలాగే తెలుగు భాషను ప్రస్తుతిస్తూ పి. బి. శ్రీనివాస్ గారు రచించిన తెలుగు గరిమ పద్యాలు ప్రపంచ తెలుగు మహాసభల సంచికలో ప్రచురితమైనవి (ప్రెస్ అకాడమీ) కింద చూడండి. 
 

రోజు నుంచి ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు, పద్యాలు, గేయాలు, స్తోత్రాలు మనలకు వీనుల విందు చేస్తూనే ఉంటాయి.  

పడవ నడపవోయి పూల పడవ నడపవోయి అంటూ ఆయన పాడిన ఒక గేయం చాలా కాలం కిందట రేడియోలో ప్రసారమైనది.  ఆ గేయం ఒకసారి  విందాము. 



...

2 comments:



  1. ఈ రోజు పీ.బీ.శ్రీనివాస్ గారి గురించి చాలా మంది రాసారు.అంతకన్న రాయవలసిందేమీ లేదనుకొండి.40,50,60 ల్లో అలరించిన దిగ్దంతులు చాలామంది రాలిపోయారు.ఇప్పుడు శ్రీనివాస్ గారు రాలిపోయారు.'జాతస్య మరణం ధ్రువం' కదా!ఐనా బాధగానేఉంటుంది.బహుముఖప్రజ్ఞావంతుడైన ఆయనని తెలుగు కన్నా కన్నడచిత్రసీమ బాగా ఆదరించింది.తెలుగులో ఆయన పాడిన - పాటల్లోనాకు బాగా ఇష్టమైనవి.-' ఏమి రామ కథా శబరీ ' 'ఓహో , గులాబిబాలా ' ' వెన్నెల రేయీ ఎంతో చలీ ' .

    ReplyDelete
  2. Manasuloni korika is my favoutite song from Bhishma.

    ReplyDelete