Wednesday, December 30, 2015

అధ్బుత స్వప్నము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

ముందుగా పానుగంటి వారి గురించి మారేమండ రామారావు గారు రాసిన నాలుగు మాటలు చదువుదాము, అయితే ఈ వ్యాసం అసంపూర్తిగా దొరికింది. చివరగా “అధ్బుత స్వప్నము” అనే అంశం మీద రేడియో అనుసరణ విందాము. 


... Tags: Panuganti Lakshmi Narasimharao, Sakshi vyasalu, Maremanda Ramarao

Saturday, December 26, 2015

తెలుగు సినిమా సంగీతం – శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు

ఆంధ్రజ్యోతి వారి రజతోత్సవ ప్రత్యేక సంచికలో వచ్చిన వి. ఎ. కె. రంగారావు గారి వ్యాసం “తెలుగు సినిమా సంగీతం” చదువుదాము. చివరగా కన్యాశుల్కం సినిమా నుండి ఘంటసాల గారి సంగీతంలో సుశీల గారు పాడిన శ్రీశ్రీ గారి పాట “ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే” విందాము. 
S Varalakshmi

...
Tags: V A K Rangarao, Srisri, Anamdam Arnavamaithe, Kanyasulkam

Thursday, December 24, 2015

భమిడిపాటి, నందివాడ చిదంబరం గార్ల నవ్వుల “బాతాఖానీ పత్రిక”

భారతి 1929 నాటి సంచికలో వచ్చిన శ్రీయుతులు భమిడిపాటి కామేశ్వరరావు, నందివాడ చిదంబరం గార్ల సంయుక్త సంపాదకీయంలోని నవ్వుల పత్రిక “బాతాఖానీ పత్రిక” చదవండి. 
ఇలాంటిదే మరో రెండు పత్రికలు వున్నాయి. వాటిని మరో మారు పరికిద్దాము. 


Tags: Bhamidipati Kameswararao, Nandivada Chidambaram

Tuesday, December 22, 2015

మన చిత్రకారులు – శ్రీ రాజా రవివర్మ గారు

ఎంతైనా సమకాలీకులు రచించిన వ్యాసాలు తత్సంబంధిత విషయాలతో ఆసక్తికరంగా వుంటాయి. రవివర్మ గారు అక్టోబర్ రెండు 1906 న కీర్తిశేషులయ్యారు. కింద పోస్ట్ చేసిన వ్యాసం 1906 అక్టోబర్ “సువర్ణలేఖ” సంచికలోనిది. రవివర్మ గారి మీద వ్యాసం ప్రచురించబోయే తరుణంలో వారు స్వర్గస్తులయ్యారుట. పానుగంటి వారి సాక్షి వ్యాసాలూ కూడా మొదట ఈ “సువర్ణలేఖ” లోనే ప్రచురించారు అన్న విషయం మనం ఎరిగినదే. రవివర్మ గారి చిత్రాలు ఇంటర్నెట్ లో కోకొల్లలుగా చూసేవుంటారు, అయినా మచ్చుకి ఓ ఆరు చిత్రాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. మన ఇళ్ళల్లో వంద సంవత్సరాల కిందటి దేవతామూర్తుల ఫోటోలు ఇప్పటికి కనబడుతూవుంటాయి. ఇవి ఆ రోజుల్లో జర్మనీలో ప్రింట్ చేసేవారుట. చివర్లో పాతకాలం నాటి ఫోటోలు లభ్యమయ్యే కొన్ని వెబ్సైట్ల లింకులు ఇవ్వబడ్డాయి. చూసి ఆనందించండి.  

Tags: Raja Ravivarma
 

Sunday, December 20, 2015

అరుదైన నాణేలు - సేకరణ

చిన్నక్క: ఏం ఏకాంబరం చిల్లర ముందేసుకొని పరీక్షగా చూస్తున్నావు

ఏకాంబరం: రారా చిన్నక్కా,ఈ‌ పాత నాణెం ఏ సంవత్సరందాయని 

చిన్నక్క: అసలు ఇన్ని కాయిన్స్ ఎక్కడివి ఏకాంబరం 

ఏకాంబరం: సేకరించాను చిన్నక్కా, ఒకసారి ఇంట్లో వాడుకలోలేని కొన్ని కాయిన్స్ కనిపించాయి. వాటిని చూడగానే కాయిన్స్ సేకరిస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన నా బుర్రలో తళుక్కుమంది. 

చిన్నక్క: అది వుంటేగదా ఏకాంబరం తళుక్కుమంటానికి 

ఏకాంబరం: అలా అంటావేం చిన్నక్కా 

చిన్నక్క: లేకపోతే వీటివల్ల ఉపయోగమేమిటి చెప్పు 

ఏకాంబరం: అలా అడిగావు బావుంది, ఏ పని చేసినా దూరాలోచనతో చెయ్యాలి. ఈ కాయిన్స్ తిరిగి అమ్మితే అధిక ధర వస్తుంది తెలుసా. ఈ కాయిన్స్ తిరిగి కొనేవాళ్లుంటారు. 

చిన్నక్క: అవును ఈ ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు కాయిన్స్ ఎలా సేకరించావు, ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. 


ఏకాంబరం: మన చార్మినార్ వెనకాతల ఒకతను రోడ్డుపక్కన ఈ కాయిన్స్ పోగుపోసుకొని అమ్ముతుంటాడు. మరి కొంచెం ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. 

చిన్నక్క: మరి ఇన్ని రూపాయి, రెండు, అయిదు రూపాయల కాయిన్స్ ఎందుకు సేకరించావు. 

50 NP coins

1 Rupee Coins

2 rupee coins

5 rupee coins

10 rupee coins


ఏకాంబరం: ఇక్కడే వుంది కిటుకు, వీటిని గమనించు వీటి మీద ప్రసిద్ధ వ్యక్తుల బొమ్మలు, ఇతరత్రా బొమ్మలు కనబడుతున్నాయా. వీటినే కమ్మెమొరేటివ్ కాయిన్స్ అంటారు. ఉదాహరణకు ఎవరన్నా ప్రసిద్ధ వ్యక్తి, ఏదన్నా సంస్థ 100 వసంతాల జ్ఞాపకార్థం ప్రభుత్వం ఒక కాయిన్ కాని, స్టాంప్ కాని విడుదల చేయటం వినేవుంటావు. 

చిన్నక్క: అంటే జ్ఞాపకం వచ్చింది, ఈ మధ్య ఇంటర్నేషనల్ యోగాడే సంధర్భంగా ఒక కాయిన్ విడుదల చేసినట్లు చదివాను. 

ఏకాంబరం: అద్గదీ,ఆ కాయిన్స్ వాడుకలోకి వచ్చినపుడు కొన్ని తీసి పక్కన పెడుతూ రావాలి, కొంతకాలానికి అవి వాడుకలో కనిపించవు. అప్పుడు వీటికి విలువ పెరుగుతుంది. వీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికప్పుడు వీటిని దాచేస్తూ వుంటారు. అందుకనే మనకు బొమ్మలు వున్న కాయిన్స్ తొందరగా దొరకవు. అంతదాకా ఎందుకు పేపర్లో వచ్చిన ఈ వార్త చూడు.
Source: Times of Inida

5 rupee coinsచిన్నక్క:నిజమే ఏకాంబరం, ఇంతకాలం కళ్ల ఎదురుగా కనిపించిన వీటి విలువ గ్రహించలేక పోయాను. 

ఏకాంబరం: అలా అనుకోకు, ఇప్పటి నుండి రాబోయే ఒక ఇరవై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని సేకరణ మొదలు పెట్టు. 

చిన్నక్క: అదే ఎలా అంటున్నాను. 

ఏకాంబరం: ఏముంది కూరలు కొనటానికి వెళతావా, అక్కడ వాళ్ళు చిల్లర ముందు పోసుకొని వుంటారు, వాటిల్లో బొమ్మలు వున్న నాణాలు కనిపిస్తే వాళ్ళకు వేరే డబ్బులు ఇచ్చి అడిగి తీసుకోవటమే. ఆ విధంగా సేకరణ మొదలుపెట్టు 

చిన్నక్క:ఇవ్వేమిటి రాగివి లాగా వున్నాయే 
1835 East India Company Coin

ఏకాంబరం: ఇవి బ్రిటిష్ కాలంనాటివి, కొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నాణాలు, ఈ వెండివి చూశావా, వీటికి ఇప్పుడు చాలా విలువ వుంటుంది. 
Silver Coins

Silver Coins


చిన్నక్క: నిజంగా వెండివా, నేను వీటిని ఎప్పుడు చూడలేదు 

ఏకాంబరం: ఆ రోజుల్లో వీటిని చెలామణీ లోంచి తీసేసినప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియక, ముందుచూపు లేక చాలామంది వీటిని కరిగించి వెండి సామాను చేయించుకున్నారుట 

చిన్నక్క: ఒకరకంగా ఇవి ఆనాటి జ్ఞాపకచిహ్నాలు. ఇదేమిటి ఈ నాణెం మీద లక్ష్మీనారాయణుల బొమ్మ వుంది. 

year 1616


ఏకాంబరం: ఇవి నిజమయినవి కావు. కొంతమంది   అమ్ముతూ వుంటారు. వెనుకటికి ఒకడు ఎలాగో దొంగ నోటు ముద్రిస్తున్నాము గదా వెరైటీగా వుంటుందని ఏడు రూపాయల నోటు ముద్రించాడుట. 

చిన్నక్క: అవును ఏకాంబరం నీ దగ్గర రాముల వారి మాడలు లేవా 

ఏకాంబరం: ఎలా కనబడుతున్నా చిన్నక్కా నీకు, 

చిన్నక్క: సరదాకులే ఏకాంబరం, ఇదేమిటి వంద రూపాయల బిళ్ళగూడా వుంటుందా 
ఏకాంబరం: దానికే వస్తున్నాను, ఇందాక చెప్పానే కమ్మెమొరేటివ్ కాయిన్స్ అని, అవే ఇవి 

చిన్నక్క: ఇవి మనకు ఎలా దొరుకుతాయి 

ఏకాంబరం: అలా అడిగావు బావుంది, బాంబే మింటు, కలకత్తా మింటు అన్న ప్రభుత్వ ముద్రణా సంస్థలు వీటిని ముద్రిస్తాయి. వీటి అమ్మకాల విషయం పేపర్లో ప్రకటిస్తారు అలాగే వారి వారి వెబ్సైట్ లో తెలుపుతారు. 

చిన్నక్క: మరి ఆ వివరాలు చెప్పావు కాదు 

ఏకాంబరం: చెప్పనిస్తే గదా, ఇదిగో ఆ వెబ్సైట్ లింకులు. మనం ఐడి, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ కాపి పెట్టి,యూజర్ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకొని డెబిట్ / క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లిస్తే ఓ ఆరు నెలలలోపు రిజిస్టర్డ్ పోస్ట్ లో వస్తాయి. 


చిన్నక్క: అంతకాలమెందుకు 

ఏకాంబరం: ముద్రించాలిగదా మరి, ఇవి ఎప్పుడుబడితేఅప్పుడు దొరకవు, మనం ఆర్డరు ఇచ్చాక తయారు చేస్తారు. వాళ్ళు ప్రకటించినప్పుడే కొనుక్కోవాలి. మళ్ళీ మళ్ళీ ముద్రించరు. అందుకని ఇవి చాలా విలువయినవి. ఇంతకి అసలు విషయం చెప్పాను గాదు, ఇవి చాలా ఖరీదుతో కూడుకొనినవి, ఒక వంద రూపాయల కాయిన్ కావాలంటే మూడువేల నుంచి నాలుగు వేల దాకా అవుతుంది. ప్రస్తుతం ఇవి అమ్మకానికి వున్నాయి చిన్నక్క: అమ్మో అంత ధరే 

ఏకాంబరం: అవును మరి ఇవి వాడుకలో చెల్లవు, కాయిన్ కలెక్టర్స్ కోసం తయారు చేస్తారు. వీటిల్లో కొంత శాతం వెండి వుంటుంది. ఇవి మనం బయట కొనాలంటే చాలా ధర పెట్టాలి. 

చిన్నక్క: ఏమో అనుకున్నాను చాలా కాస్ట్లీ పిచ్చే 

ఏకాంబరం: మీ నగల కంటేనా, ఇక్కడ నువ్వు ఓ విషయం గమనించాలి, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇదిగో ఈ వెయ్యి రూపాయల నాణెం చూడు. 


చిన్నక్క: వెయ్యి రూపాయల నాణెమే 

ఏకాంబరం: ఇది మన బృహదీశ్వరాలయం వెయ్యి సంవత్సరాల జ్ఞాపకార్ధం ముద్రించారు. మరి 4,875 రూపాయలకు కొన్నాను. ఇప్పుడు దీని విలువ యెనిమిది వేల దాకా వుంది. ఫిక్సెడ్ డిపాజిట్ లో కూడా అంత రాదు కదా. 
Source: E-bay

చిన్నక్క:అవుననుకో, కానీ చూస్తూ చూస్తూ 

ఏకాంబరం: ఇదిగో నువ్వు మళ్ళీ వెనుకంజ వేస్తునావు, నువ్వు ముందు చిన్నగా మొదలు పెట్టు 

చిన్నక్క: మా బావ బ్యాంక్ లోనే చేస్తారు, ఆయనతో చెప్పి తెప్పించుకుంటాను. 

ఏకాంబరం: అయినా ఈ రోజుల్లో బ్యాంకుల్లో చిల్లిగవ్వ గూడా దొరకదు, అన్నీ కాగితాలే 

చిన్నక్క: మరి నువ్వు నోట్స్ సేకరించలేదా ఏకాంబరం 

ఏకాంబరం: అది నువ్వు చెప్పాలా, ఇదిగో ఈ పాత నోట్లు చూడు, 
చిన్నక్క: అమ్మో అమ్మో నీకు ఇంత దురాలోచన వుందనుకోలేదు ఏకాంబరం 

ఏకాంబరం: “దుర” కాదు చిన్నక్కా దూరాలోచన, ఈ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెడతారు గదా, అలా గవర్నర్ వైస్ గా కూడా సేకరిస్తారు,ఇక్కడ నీకో ఆసక్తికర విషయం చెబుతాను,నీ పుట్టిన రోజు 04-08-1942 అనుకుందాము. 040842 నెంబరు గల నోటు నీకు దొరికితే చాలా ఆనందిస్తావు గదా, ఆ నోటుకు ఫోటో గట్టి పెట్టుకుంటావు గదా. చాలా మంది కాయిన్స్ అమ్మే వారు ఈ పని గూడా చేస్తూవుంటారు. అందువల్ల కొన్ని నెంబర్ల సిరీస్ గల నోట్లకు చాలా డిమాండు. వాటిని చెలామణిలోకి రాకుండా దాచేస్తుంటారు. 


చిన్నక్క:వీటి వెనుక ఇన్ని విషయాలు వున్నాయా 

ఏకాంబరం: ఇంటర్నెట్ లో వీటి గురించి ముందు కొంత పరిశోధన చేయాలి, అప్పుడు కొంత అవగాహన ఏర్పడుతుంది. కొన్ని కాయిన్స్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. 

చిన్నక్క: ఇదేమిటి కిడ్డీ బ్యాంక్ బొమ్మ లాగుందే 
ఏకాంబరం: అదే మరి, పిల్లలకు పొదుపు నేర్పించాలిగదా అని ఓ కిడ్డీ బ్యాంకు అక్కౌంట్ ఓపెన్ చేశా, అవును ఈ పండగకు నగలు కొనటంలేదా చిన్నక్కా 

చిన్నక్క: ఇకనుంచి నేను కూడా ఆ నగలు మానేసి ఈ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను బాబూ 

ఏకాంబరం: మరి ఊరికే అన్నారా “చిల్లర శ్రీ మహాలక్ష్మి” అని 

చిన్నక్క: చాలా టైము అయింది, వుంటాను ఏకాంబరం 

ఏకాంబరం: సంతోషం చిన్నక్కా 
Tags: Old coins, british coins, silver coins, old rupee notes, East India Company coins, Commemorative coins,