Tuesday, September 30, 2014

త్రిపురసుందరీ స్తోత్రం – అంబా పంచరత్నం – భక్తిరంజని

దసరాల్లో “దేవీం శరణం గచ్ఛామి” అంటూ రేడియోలో ప్రసారమవుతుంది. అందులోనుండి గ్రహించిన “శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం” విందాము. మరి అలాగే భక్తిరంజనిలో ప్రసారమైన “అంబా పంచరత్నం” కూడా విందాము.  త్రిపురసుందరీ స్తోత్రం అంబా పంచరత్నం
Tags: Tripura sundari stotram, Amba Pancharathnam, Bhakthiranjani, Devi Stuti

Monday, September 29, 2014

వలపు లేలనే సఖీ – భావ గీతాలు

“వలపు లేలనే వింత తలపు లేలనే సఖీ” అనే ఈ గీత రచన మంగళంపల్లి వారని “ఈమాట.కాం” లో చదివాను. బహుశా పాడింది గూడా వారే అయి ఉంటారు. ఈ గీతం విని చూద్దాము. అలాగే “భూధరమో సాగరమో భూతలమో ఆకసమో” అనే గీతం (పరుచూరి శ్రీనివాస్ గారి సేకరణ) మంగళంపల్లి వారు పాడినది “ఈమాట.కాం” లో దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు వినబోయే పాట వేరే వారు పాడినట్లున్నారు. ఈ రెంటితో పాటు “పంచవన్నెల రామచిలుకా పారిపోకమ్మా” అనే గీతం కూడా విని ఆనందిద్దాము. ఆకాశవాణి వారి ప్రసారాలనుండి. 


 వలపు లేలనే వింత తలపు లేలనే సఖీ
 భూధరమో సాగరమో భూతలమో


 పంచవన్నెల రామచిలుకా పారిపోకమ్మా


పరుచూరి శ్రీనివాస్ గారు “ఈమాట.కాం” లో అరుదైన ఒక ఆరు జాతీయ గీతాలను పంచుకున్నారు. వాటిలో ఓ మూడింటికి ఇక్కడ సాహిత్యాన్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ కింది లంకె ద్వారా అక్కడ వింటూ ఇక్కడ చూస్తూ ఆస్వాదించండి. 

Tags: Valapu lelane vimtha talapu lelane, Bhoodharamo saagaramo bhootalamo aakasamo, Panchavannela raama chilukaa paaripokammaa, lalitha gethalu, Bhaga geethalu, Lalitha geyalu, Light music, Aakashavani,

Monday, September 22, 2014

నా జ్నాపకాలు – బోయి భీమన్న గారు – ఆకాశవాణి

ప్రముఖ సాహితీవేత్త బోయి భీమన్న గారి అనుభవాలు జ్నాపకాలు వారి గళంలోనే విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 

  .. Tags: Boyi Bheemanna, Boyi Bhimanna,
 

Saturday, September 20, 2014

పల్లెపాటలు – ప్రసంగ పాఠం – ఆకాశవాణి

జానపద వాఙ్మయంలో ప్రధాన భూమిక వహించేవి పల్లెపాటలు. ఆ పల్లెపాటల మీద శ్రీ ఎం. పురుషోత్తమాచార్య గారి లఘు ప్రసంగం విందాము. ఆకాశవాణి వారి ప్రసారం 

చివరగా ఒక కామిక్ పాట. ఇది “డిమిలి పొడుగు మనిషి” గారు పాడారు. వీరి వాయిస్ ప్రత్యేకంగా వుంటుంది. చిన్నప్పుడు ఊళ్ళో పెళ్ళిళ్ళప్పుడు “మందులోడా ఓరి మాయలోడా” అంటూ రకరకాల కామిక్ పాటలు వేస్తూ వుండేవారు. ఇప్పుడు “పేపర్ న్యూస్” అనే పాట విందాము. 


ఎటువంటి అభ్యంతరాలున్నా పా తొలగించబడుతుంది


Tags: palle paatalu,  palle patalu 

Friday, September 19, 2014

జయదేవుని అష్టపదులు – భక్తిరంజని

“ధీర సమీరే యమునాతీరే” మరియు “అనిలతరళ కువలయ నయనేన” అనే రెండు అష్టపదులు విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. ఆ చెవి తోనే శ్రీ రఘునాధ పాణిగ్రాహి గారు మధురంగా ఆలపించిన “ధీర సమీరే యమునాతీరే” కూడా విందాము.

 అనిలతరళ కువలయ నయనేన


 ధీర సమీరే యమునాతీరే

ఎటువంటి అభ్యంతరాలున్నా పా తొలగించబడుతుందిTags: Ashtapadulu, Dheerasameere yamunaateere, anilatarala kuvalaya nayanena, yaaramithaa vanamaalinaa, Jayadeva, Bhaktha Jayadeva

Monday, September 15, 2014

జానపద గేయాలు – అనసూయాదేవి గారు

అనసూయా దేవిగారు పాడిన “బందారు చిన్నదాన బాజాబందూలదాన” అనే పాట అలాగే “నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా” అనే పాట విందాము. అయితే ఈ సందర్భంగా సూర్యకుమారి గారిని గూడా మననం చేసుకోవాలి. ఆవిడ కూడా ఈ పాట పాడారు. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా రికార్డు చేసిన వీడియోను యూట్యూబ్ లో ఉంచిన శ్రీ ఎన్. అప్పారావు గారికి కృతజ్నతలతో ఆ పాట కూడా చూద్దాము. అయితే ఆవిడ ఈ పాటతో పాటు “సిరిసిరిమువ్వ” పాటను కూడా జతగలిపినట్లున్నారు. చివరగా “కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మ” ఇదివరలో పోస్ట్ చేసిన ఈ పాటకు ఈ మధ్య సాహిత్యం లభించింది.  జానపద గేయాల సేకరణ కర్త శ్రీ నేదునూరి గంగాధరం గారి సేకరణ నుండి. మరొక్కసారి ఆస్వాదిద్దాము. ఇది ఆకాశవాణి వారి లలిత గీతాల నుండి.
Tags: Vinjamuri Anasuyadevi, Anasooyaadevi, SuryaKumari, Tanguturi, Tangutoori, Avasarala Anasuyadevi, Bandaru Chinnadana, Nandagiri Bangaru Mama Chandragiri cheeralampeva,

Sunday, September 14, 2014

పల్లె పదాలు – సినీ పదాలు

మన తెలుగు సినిమా పాటల మీద జానపద గేయాల ప్రభావం ఎంతైనా ఉన్నది. కొన్ని జానపద గేయాలు యధాతధంగా సినిమాలలో ప్రవేశిస్తే, కొన్ని జానపద గేయాలు మటుకు సంధర్భ, సన్నివేశానుసారం రూపాంతరం చెందినా తమ ఉనికిని మాత్రం పోగొట్టుకోకుండా కనిపిస్తాయి. కొన్ని పాటలు సినీకవులు ఇంత అద్భుతంగా ఎలారాసారా అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే కొన్ని పాటల మాతృకలు, జాడలు జానపద గేయాలలో ప్రస్ఫుటంగా అగుపిస్తాయి. పాటకు పల్లవి ప్రాణం అన్నారు. సినీ పాటలకు ప్రాణం పోసిన ఆ జానపద గేయ మాతృకలు చూస్తూ కొన్ని సినీ గీతాలు విందాము. ఈ జానపద గేయ సాహిత్యాన్నంతా తత్సంభందిత పుస్తకాలనుండి స్వీకరించటం జరిగింది, ముఖ్యంగా కృష్ణశ్రీ గారి సంకలితము “పల్లె పదాలు” నుండి. ముందుగా “అప్పుచేసి పప్పుకూడు” సినిమాలోని “కాశీకి పోయాను రామాహరే” అనే పాట మాతృక చూసి ఆ పాట విందాము.

ఇప్పుడు ఆలుమగల సంవాదంలో రాయబారం నడిపిన “తడిక” పాట “అత్తా ఒకింటి కోడలే” సినిమా నుండి. ఆ తడిక రాయబారమేమిటో చూద్దాము. 
“ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” సినిమాలో వినిపించే హుషారైన “వచ్చే వచ్చే వాన జల్లు” పాట మూలమేమిటో ఒక ముక్క చూడండి. 
ఏరువాక ఈ మాట వినగానే గుర్తుకు వచ్చే సినిమా “రోజులుమారాయి”. రైతులు పాడుకొనే “ఒలియ ఒలియో” అనేపాటకు చాలా మాతృకలున్నాయి. ఎన్ని వున్నా ఈ పాట ఇప్పటికీ తన నవకాన్ని పోగొట్టుకోక నిలిచివుంది. 


చిన్నప్పుడు తిరనాళ్ళకు బయస్కోప్ అని వచ్చేది. దాంట్లో “కాశీ పట్నం చూడర బాబు” అంటూ పాడుతూ భారత దర్శనం కలిగించేవారు. “ఖైదీ బాబాయ్” సినిమా నుండి ఆ వివరాలేమిటో బయస్కోప్ చూస్తూ విందాము. 


       హిందూ సౌజన్యంతో 


“ఎయిర సిన్నోడెయిరా ఎయిరా నీ సోకుమాడ” అనే ఈ పాట “పూలరంగడు” సినిమాలో కానవస్తుంది. అది ఇప్పుడు వినవస్తోంది. 
వాహినీ వారి “పెద్దమనుషులు” సినిమాలోని “నందామయా గురుడ నందామయా” పాట పూర్వాపరాలేమిటో కనుగొందాము. 
అలాగే “మనదేశం” సినిమాలో “నిను నేను మరువలేనుర ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి” అనే పాట వివరాల్లోకి తొంగి చూద్దాము. 
ఇదే సినిమాలో “అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ” అన్న పాటా కూడా ఉన్నది. దాని సంగతేమిటో పరికిద్దాము. 
మొగుడు పెళ్ళాల మధ్య పరాచకాలు కృతయుగం నుండి ఉన్నవే. వేరే పాట వినేముందు “సత్యహరిశ్చంద్ర” సినిమాలో “ఏమంటావ్ మొగుడా” విషయమేమిటో కనుక్కుందాము. 
ఇప్పుడు “మానవుడు దానవుడు” సినిమా నుండి ఇదే ఇతివృత్తం మీద పాట విందాము 

మరి ఈ సారి “జగదేకవీరుని కధ” సినిమాలో ఇదే సంవాదాన్నిఆస్వాదిద్దాము.  


“ఒకరికి చేతులిచ్చాన్ ఒకరికి కాళ్లనిచ్చాన్” అంటూ సరసోక్తులతో భర్తలో అనుమాన బీజాలు నాటుతూనే ఓస్ ఇంతేనా అన్నట్టుగా సాగే “బాలరాజు” సినిమాలోని ఆ సరస సంభాషణేమిటో  విందాము. 


ఇలాంటిదే “మా బంగారక్క” సినిమాలో కూడా కనిపిస్తుంది. అది గూడా విందాము మరి. 


“వల్లరి బాబోయ్” అనగానే మనకు మనాప్రగడ నరసింహమూర్తి గారు గుర్తుకు వస్తారు. “విధివిలాసం” సినిమాలో ఈ పాటను ఉపయోగించారు. వారు పాడలేదనుకోండి. అయినా ఓసారి ఆ పాటను గమనిద్దాము. 
ఇప్పటికే ఈ పాటలతో చాలా సమయాభావం అయింది. ఎప్పటి లాగే చివరగా 

Tags: Janapada geyalu, Janapada sahithyam, janapada geethalu, palle paatalu, palle padalu,

Friday, September 12, 2014

ప్రాచీనాంధ్ర వార్తా పత్రికలు

మనకు పత్రిక అనగానే ఆంధ్రత్రిక, కృష్ణాపత్రిక, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తాయి. కానీ అంతకుముందు ఉన్న పత్రికల వివరాలు తెలియాలంటే ఎవరన్నా తెలిసినవారు రాసిన వ్యాసాల మీద ఆధారపడాలి. అదిగూడా ఆ వ్యాసాలు పాతకాలం నాటివి అయివుంటే, వారు వారి కాలంలో లభిస్తున్న ఆధారాల మూలంగా రాస్తారు కాబట్టి వాటికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి వ్యాసాలనే ఇప్పుడు చూద్దాము. ఆంధ్రపత్రిక 1920 వార్షిక సంచికలో “పురాతనాంధ్ర వార్తా పత్రికలు” – భారతి మే 1929 సంచికలో నిడదవోలు వెంకటరావు గారి “ప్రాచీనాంధ్ర వార్తాపత్రికలు” - విభూతి 1939 సంచికలో “నిజాంరాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” వ్యాసాలు ప్రచురిత మయ్యాయి. లభిస్తున్న కొన్ని పత్రికల ముఖచిత్రాలను కూడా చూద్దాము (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో).Tags: Old Telugu Papers, pracheena telugu patrikalu, praacheena andhra vaarthaa patrikalu, puraatana patrikalu, old telugu periodicals, old telugu magazines, old telugu books,