Sunday, September 14, 2014

పల్లె పదాలు – సినీ పదాలు

మన తెలుగు సినిమా పాటల మీద జానపద గేయాల ప్రభావం ఎంతైనా ఉన్నది. కొన్ని జానపద గేయాలు యధాతధంగా సినిమాలలో ప్రవేశిస్తే, కొన్ని జానపద గేయాలు మటుకు సంధర్భ, సన్నివేశానుసారం రూపాంతరం చెందినా తమ ఉనికిని మాత్రం పోగొట్టుకోకుండా కనిపిస్తాయి. కొన్ని పాటలు సినీకవులు ఇంత అద్భుతంగా ఎలారాసారా అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే కొన్ని పాటల మాతృకలు, జాడలు జానపద గేయాలలో ప్రస్ఫుటంగా అగుపిస్తాయి. పాటకు పల్లవి ప్రాణం అన్నారు. సినీ పాటలకు ప్రాణం పోసిన ఆ జానపద గేయ మాతృకలు చూస్తూ కొన్ని సినీ గీతాలు విందాము. ఈ జానపద గేయ సాహిత్యాన్నంతా తత్సంభందిత పుస్తకాలనుండి స్వీకరించటం జరిగింది, ముఖ్యంగా కృష్ణశ్రీ గారి సంకలితము “పల్లె పదాలు” నుండి. ముందుగా “అప్పుచేసి పప్పుకూడు” సినిమాలోని “కాశీకి పోయాను రామాహరే” అనే పాట మాతృక చూసి ఆ పాట విందాము.

ఇప్పుడు ఆలుమగల సంవాదంలో రాయబారం నడిపిన “తడిక” పాట “అత్తా ఒకింటి కోడలే” సినిమా నుండి. ఆ తడిక రాయబారమేమిటో చూద్దాము. 
“ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” సినిమాలో వినిపించే హుషారైన “వచ్చే వచ్చే వాన జల్లు” పాట మూలమేమిటో ఒక ముక్క చూడండి. 
ఏరువాక ఈ మాట వినగానే గుర్తుకు వచ్చే సినిమా “రోజులుమారాయి”. రైతులు పాడుకొనే “ఒలియ ఒలియో” అనేపాటకు చాలా మాతృకలున్నాయి. ఎన్ని వున్నా ఈ పాట ఇప్పటికీ తన నవకాన్ని పోగొట్టుకోక నిలిచివుంది. 


చిన్నప్పుడు తిరనాళ్ళకు బయస్కోప్ అని వచ్చేది. దాంట్లో “కాశీ పట్నం చూడర బాబు” అంటూ పాడుతూ భారత దర్శనం కలిగించేవారు. “ఖైదీ బాబాయ్” సినిమా నుండి ఆ వివరాలేమిటో బయస్కోప్ చూస్తూ విందాము. 


       హిందూ సౌజన్యంతో 


“ఎయిర సిన్నోడెయిరా ఎయిరా నీ సోకుమాడ” అనే ఈ పాట “పూలరంగడు” సినిమాలో కానవస్తుంది. అది ఇప్పుడు వినవస్తోంది. 
వాహినీ వారి “పెద్దమనుషులు” సినిమాలోని “నందామయా గురుడ నందామయా” పాట పూర్వాపరాలేమిటో కనుగొందాము. 
అలాగే “మనదేశం” సినిమాలో “నిను నేను మరువలేనుర ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి” అనే పాట వివరాల్లోకి తొంగి చూద్దాము. 
ఇదే సినిమాలో “అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ” అన్న పాటా కూడా ఉన్నది. దాని సంగతేమిటో పరికిద్దాము. 
మొగుడు పెళ్ళాల మధ్య పరాచకాలు కృతయుగం నుండి ఉన్నవే. వేరే పాట వినేముందు “సత్యహరిశ్చంద్ర” సినిమాలో “ఏమంటావ్ మొగుడా” విషయమేమిటో కనుక్కుందాము. 
ఇప్పుడు “మానవుడు దానవుడు” సినిమా నుండి ఇదే ఇతివృత్తం మీద పాట విందాము 

మరి ఈ సారి “జగదేకవీరుని కధ” సినిమాలో ఇదే సంవాదాన్నిఆస్వాదిద్దాము.  


“ఒకరికి చేతులిచ్చాన్ ఒకరికి కాళ్లనిచ్చాన్” అంటూ సరసోక్తులతో భర్తలో అనుమాన బీజాలు నాటుతూనే ఓస్ ఇంతేనా అన్నట్టుగా సాగే “బాలరాజు” సినిమాలోని ఆ సరస సంభాషణేమిటో  విందాము. 


ఇలాంటిదే “మా బంగారక్క” సినిమాలో కూడా కనిపిస్తుంది. అది గూడా విందాము మరి. 


“వల్లరి బాబోయ్” అనగానే మనకు మనాప్రగడ నరసింహమూర్తి గారు గుర్తుకు వస్తారు. “విధివిలాసం” సినిమాలో ఈ పాటను ఉపయోగించారు. వారు పాడలేదనుకోండి. అయినా ఓసారి ఆ పాటను గమనిద్దాము. 
ఇప్పటికే ఈ పాటలతో చాలా సమయాభావం అయింది. ఎప్పటి లాగే చివరగా 

Tags: Janapada geyalu, Janapada sahithyam, janapada geethalu, palle paatalu, palle padalu,

No comments:

Post a Comment