మనకు పత్రిక అనగానే ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తాయి. కానీ అంతకుముందు ఉన్న పత్రికల వివరాలు తెలియాలంటే ఎవరన్నా తెలిసినవారు రాసిన వ్యాసాల మీద ఆధారపడాలి. అదిగూడా ఆ వ్యాసాలు పాతకాలం నాటివి అయివుంటే, వారు వారి కాలంలో లభిస్తున్న ఆధారాల మూలంగా రాస్తారు కాబట్టి వాటికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి వ్యాసాలనే ఇప్పుడు చూద్దాము. ఆంధ్రపత్రిక 1920 వార్షిక సంచికలో “పురాతనాంధ్ర వార్తా పత్రికలు” – భారతి మే 1929 సంచికలో నిడదవోలు వెంకటరావు గారి “ప్రాచీనాంధ్ర వార్తాపత్రికలు” - విభూతి 1939 సంచికలో “నిజాంరాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” వ్యాసాలు ప్రచురిత మయ్యాయి. లభిస్తున్న కొన్ని పత్రికల ముఖచిత్రాలను కూడా చూద్దాము (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో).
Tags: Old
Telugu Papers, pracheena telugu patrikalu, praacheena andhra vaarthaa
patrikalu, puraatana patrikalu, old telugu periodicals, old telugu magazines,
old telugu books,
సతీహితబోధిని లాంటి... పేరు మాత్రమే వినివున్న ఒకప్పటి పత్రికలు కొన్ని ఎలా ఉన్నాయో చూడటం సంతోషం కలిగించింది. థాంక్యూ.
ReplyDeleteధన్యవాదాలు
ReplyDelete