Thursday, February 27, 2014

శివ కీర్తనలు – భక్తిరంజని

మహాశివరాత్రి సంధర్భంగా శ్రీ కందుకూరి వీరబసవరాజు విరచిత శివ కీర్తనలు – భక్తిరంజని ప్రసారం రత్నై కల్పితమహా దేవ శంభో    

     

శంభో హరా పాహిమాం

 Tags: kandukuri veera basava raju, bhakthi ranjani, siva keerthanalu,
 

Wednesday, February 26, 2014

ఆకులో ఆకునై – దేవులపల్లి - వేదవతి ప్రభాకర్ – స్థానం – సుశీల

ఈ పాట అనగానే మనకు మేఘసందేశం సినిమాలోని సుశీల గారి పాట గుర్తుకు వస్తుంది. ఈ పాట “భారతి” ఫిబ్రవరి 1924 సంచికలో ప్రచురించారు.  అయితే “పగడాల చిగురాకు” అన్న చరణం ఈ కింది సాహిత్యంలో కనబడదు.


ముందుగా వేదవతి ప్రభాకర్ గారి గళంలో సంగీతం పాలగుమ్మి వారు

ఈసారి ఈ కింది లింకు ద్వారా (ఈమాట.కాం) స్థానం నరసింహారావు గారి గళంలో విని చూడండి. 
చివరగా సుశీల గారి గాత్రంలో సంగీతం రమేష్ నాయుడు గారు

Tags: aakulo aakunai, vedavathi prabhakar, sthanam narasimharao, suseela, palagummi, ramesh naidu, devulapalli

Tuesday, February 25, 2014

సరస్వతి గాన సభ – కాకినాడ – 1954 - దేవులపల్లి వారి ప్రసంగం

అరవై ఏళ్ల కిందట కాకినాడలో సరస్వతి గాన సభ స్వర్ణోత్సవాల సంధర్భంగా దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు ప్రసంగించారు. ఆ రికార్డు ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. అప్పటికి దేవులపల్లి వారికి 57 ఏళ్ళు ఉండి ఉంటాయి. ఈ గాన సభ 1903లో ఏర్పాటు అయినట్లుగా, 1929లో ఆంధ్రపత్రికలో వచ్చిన గాన సభ కార్యక్రమాల వివరాల ద్వారా అనిపిస్తోంది. మూగబోక ముందు శాస్త్రి గారి స్వరం ఎంత మధురంగా ఉందో ఆస్వాదించండి. 

ఎలాగో కాకినాడ దాకా వచ్చాము గాబట్టి కాకినాడ పుర పూర్వ చరిత్రను గూడా తెలుసుకుందాము (ప్రెస్ అకాడమీ సౌజన్యంతో) 

కొస మెరుపు కాకినాడ వంతెన వర్ణ చిత్రము 
Tags: Saraswathi gana sabha, kakinada, Devulapalli Krishna sastry, kakinada history, kakinada bridge,

Monday, February 24, 2014

లలిత గేయాలు – శ్రీరంగం – ఓలేటి - బాలమురళి

ఓలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన “దుబుకుగా కోపించనేల”, మంగళంపల్లి వారు శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన “మన ప్రేమ మన ప్రేమ” అనే రెండు లలిత గేయాలు దుబుకుగా కోపించనేల


 మన ప్రేమ మన ప్రేమ

Tags: mana prema, dubukugaa kopinchanela, oleti venkateswarlu, srirangam gopalarathnam, balamurali Krishna, Lalitha geyalu

Sunday, February 23, 2014

రాజరాజేశ్వరీ మాతృకా మంత్ర స్తవః – భక్తిరంజని

ఎవరు గానం చేశారోగాని అధ్బుతంగా సాగే ఈ రాజరాజేశ్వరీ మాతృకా మంత్ర స్తవః ఆలకించండి. ఆకాశవాణి భక్తిరంజని ప్రసారం. సాహిత్యం కూడా పొందుపరచటం జరిగింది. ఆ గానంలోని ఒక విధమైన ఆకర్షణ మనస్సును కట్టిపడేస్తుంది. 


Tags: rajarajeswari mathrukaa manthra sthavaha, bhakthiranjani,Saturday, February 22, 2014

వింజమూరి అనసూయాదేవి గారు పాడిన గేయాలు

అనసూయాదేవి గారు పాడిన “అఖిల లోకేశ్వరా”, “దరిద్ర నారాయణ లోకేశ దయాపరాయణ ప్రాణేశ”, “నీ చరణ కరుణ” అనే గేయాలు 

  
అఖిల లోకేశ్వరా


 దరిద్ర నారాయణ లోకేశ దయాపరాయణ ప్రాణేశ

 నీ చరణ కరుణ


Tags: vinjamuri anasuyadevi

Friday, February 21, 2014

మన మధుర గాయకులు – వక్కలంక సరళ

అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో  ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను. 
ముందుగా బాలరాజు సినిమా నుండి సరళ గారు పాడిన తీయని వెన్నెల రేయి  పాట ఒక సారి జ్నప్తికి తెచ్చుకుందాము.
కీలుగుఱ్ఱం సినిమాలో  సరళ గారు పాడిన  కాదు సుమా కల కాదు సుమా పాటను గతంలో పోస్ట్ చేయటం జరిగింది. ఈ సారి అదే సినిమాలోని ఇంకో పాట విందాము. 
సరళ గారి అమ్మాయి స్వప్నసుందరి గారు  గొప్ప కూచిపూడి కళాకారిణి అని పద్మభూషణ్ గ్రహీత అని తెలిసింది.   హిందూలో వచ్చిన ఆ వివరాలు ఈ కింది లింకు ద్వారా చూడండి.
సరళ గారి ఇంకో అమ్మాయి పద్మ గారు గోరింటాకు సినిమాలో నటించారుట. ఆవిడతో టి‌వి9 లో వచ్చిన ఇంటర్వ్యూ ఈ యూట్యూబ్ లింకు ద్వారా చూడండి. 
Tags: Vakkalanka Sarala, V Sarala Rao, Balaraju, Keelugurram, Theeyani Vennela Reyi, Enta anandambayenaha
Thursday, February 20, 2014

సరస్వతీ సుప్రభాతం – సరస్వతీ స్తుతి - భక్తిరంజని

భక్తిరంజనిలో ప్రసారమైన శ్రీ సరస్వతీ సుప్రభాతం మరియు శ్రీ సరస్వతీ స్తుతి విందురుగాని. 
శ్రీ సరస్వతీ సుప్రభాతం


తెలుగుభక్తి.కామ్ సౌజన్యంతో

 శ్రీ సరస్వతీ స్తుతి శ్రీ సరస్వతీ స్తుతి

Tags: saraswathi suprabhatam,  saraswathi stuti,  bhakthiranjani

Tuesday, February 18, 2014

సజీవ స్వరాలు – శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు

శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. అలనాటి విషయాలు కొన్ని తెలుసుకుందాము. 


Tags: Bezawada Gopalareddy

Monday, February 17, 2014

పుట్టపర్తి నారాయణాచార్యులు గారి కీర్తనలు – భక్తిరంజని

భక్తిరంజనిలో ప్రసారమైన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన కీర్తనలు – ఏమమ్మా రాధా నీ కెన్నడు దయగలుగునమ్మ – భక్తిగా రాజ్యమొసగి పాలించర నా రంగ – నను బ్రోచుటకు – యమునా తటిలో – ఉల్లాసముతో పూబోడులు 


 ఏమమ్మా రాధా నీ కెన్నడు దయగలుగునమ్మ భక్తిగా రాజ్యమొసగి పాలించర నా రంగ నను బ్రోచుటకు

 యమునా తటిలో

 ఉల్లాసముతో పూబోడులుTags: puttaparthi narayanacharyulu

Saturday, February 15, 2014

శివ స్తుతి - శివ కీర్తనలు – భక్తిరంజని

ఓ నాలుగు శివ కీర్తనలు విందాము. మొదటగా “పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా” – దాదాపు పావు గంట సేపు సాగే ఈ కీర్తన రచన ఎవరన్నది తెలియదు. ఒరవడి చూస్తుంటే పుట్టపర్తి వారా అనిపిస్తుంది. బోయి భీమన్న గారా అన్నదీ తెలియదు. తరువాత “శంకరుని పూజ చేయవలదా”, “శంభో మహాదేవ” చివరగా “సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబహరా” విందాము. 

 పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా
శంకరుని పూజ చేయవలదా

 శంభో మహాదేవసాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబహరా