Monday, August 31, 2015

గిడుగు వారి వ్యావహారిక భాషావాదము – శ్రీనివాస శిరోమణి గారు

శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి మరణానంతరము ఆంధ్రపత్రిక (దినపత్రిక) 1940లో గిడుగు వారి వ్యావహారిక భాషావాదము గురించి శ్రీ శ్రీనివాస శిరోమణి గారి వ్యాసం ఒకటి, భాగాలుగా నాలుగు రోజులపాటు ప్రచురించారు. అసలు గిడుగువారిని ఈ వ్యవహారంలోకి లాగిందెవరు లాంటి అనేక ఆసక్తికర విషయాలు దీంట్లో వారు ప్రస్తావించారు. ఆ వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరిదే “గిడుగు రామమూర్తి పంతులు గారు నా అనుభవాలు” 1940 ఫిబ్రవరి భారతిలో వచ్చింది, ఈ వ్యాసం తిరిగి “ప్రజాసాహితి” ఆగష్టు 2013 సంచికలో వచ్చింది. ఆ “ప్రజాసాహితి” లింకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కింది వ్యాసంలో వచ్చే “యేట్స్” దొరగారి ఫోటో తాలూకు లింకు కూడా ఇవ్వటం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారి అరుదైన ఫోటో ఒకటి చూడండి.
















“యేట్స్” దొరగారి ఫోటో తాలూకు లింకు




ఆ పేపర్ కటింగ్ మీద రైట్ క్లిక్ చేసి Save Image As మీద నొక్కి మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకొని కొంచెం పెద్దదిగా చేసుకొని చదువుకోవచ్చు 






 “గిడుగు రామమూర్తి పంతులు గారు నా అనుభవాలు”
 “ప్రజాసాహితి” లింకు






Tags: Gidugu Ramamurthy, Setti Lakshmi Narasimham, P T Srinivasa Iyengar,     J A Yates,  Srinivasa Siromani, Gurajada Apparao, Kandukuri Veeresalingam,

Saturday, August 22, 2015

“పరుసవేది” – రజని గారి సంగీత రూపకానికి సాహిత్యము

శ్రీ పురందరదాసుల వారి జీవితకధ ఆధారంగా రజనీకాంతరావు గారు రూపొందించిన సంగీత రూపకానికి సంబంధించిన సాహిత్యం ఇది. దీనిని “నాట్యకళ” అనే సంచిక నుండి గ్రహించటం జరిగింది. చివరగా బాలమురళీకృష్ణ గారి గళంలో ఒక కీర్తన విందాము. ఇది ‘నవకోటినారాయణ” కన్నడ సినిమాలో రాజకుమార్ గారి కోసం పాడినది. ఈ పాట గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది, అయితే Divshare Audio Links పనిచెయ్యకపోవటంతో గతంలో పోస్ట్ చేసిన దాదాపు 745 ఆడియోలు ప్లే అవటంలేదు. ఇవన్నీ వీలునుబట్టి పునరుద్ధరించాలి. 































---
Tags: Parusavedi, B. Rajanikantha Rao, Purandaradasu, Pramdaradasu, Rajani

Thursday, August 20, 2015

“య్యో ర్హిషిఖెయ్” – విశ్వనాధవారి కధానిక

ఈ కధ కాంగో లోని ‘అరువిమి’ నది పరీవాహక ప్రాంతానికి చెందినది. ఈ నది మొదట “ఇటురీ” నదిగా ప్రారంభం అవుతుందిట. ఈ నది కాంగో నదికి ఉపనది. “కివు” సరస్సు కూడా ఇక్కడదే. ఇలాంటివి ఉన్నాయనే విషయమే గూగుల్ సెర్చ్ చేస్తేగాని మనలో చాలామందికి తెలియదు. అలాంటిది విశ్వనాధ వారు ఈ ఇతివృత్తంలో ఆ రోజుల్లో కధరాయటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శ్రీపాద వారి ‘ప్రబుద్ధాంధ్ర’ 1935 నాటి సంచికలో దీన్ని ప్రచురించారు. మాములుగా కధల పుస్తకాల్లో కధ ఎప్పుడు రచించారో తెలియదు. ఇలాంటి పాత సంచికలవల్ల కధ ఏ సంవత్సరంలో రచించి వుంటారో కొంతవరకు తెలుస్తుంది. 


















Tags:    Viswanatha satyanarayana, Viswanadha short stories, 
Yyo-Rhi Shee Khai