Thursday, August 20, 2015

“య్యో ర్హిషిఖెయ్” – విశ్వనాధవారి కధానిక

ఈ కధ కాంగో లోని ‘అరువిమి’ నది పరీవాహక ప్రాంతానికి చెందినది. ఈ నది మొదట “ఇటురీ” నదిగా ప్రారంభం అవుతుందిట. ఈ నది కాంగో నదికి ఉపనది. “కివు” సరస్సు కూడా ఇక్కడదే. ఇలాంటివి ఉన్నాయనే విషయమే గూగుల్ సెర్చ్ చేస్తేగాని మనలో చాలామందికి తెలియదు. అలాంటిది విశ్వనాధ వారు ఈ ఇతివృత్తంలో ఆ రోజుల్లో కధరాయటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శ్రీపాద వారి ‘ప్రబుద్ధాంధ్ర’ 1935 నాటి సంచికలో దీన్ని ప్రచురించారు. మాములుగా కధల పుస్తకాల్లో కధ ఎప్పుడు రచించారో తెలియదు. ఇలాంటి పాత సంచికలవల్ల కధ ఏ సంవత్సరంలో రచించి వుంటారో కొంతవరకు తెలుస్తుంది. 


















Tags:    Viswanatha satyanarayana, Viswanadha short stories, 
Yyo-Rhi Shee Khai                                       



No comments:

Post a Comment