Monday, June 30, 2014

1864 నాటి బందరు ఉప్పెన కధ

26 డిసెంబర్ 2006 నాటి సునామీ మనందరికీ తెలిసినదే. 19 నవంబర్ 1977 నాటి దివిసీమ ఉప్పెన కూడా మన మదిలో మెదులుతూనే ఉంటుంది, అదే 150 సంవత్సరాల కిందటి నాటి అంటే మన తాతలకాలంనాటి బందరు ఉప్పెన గురించి చెప్పేవారుంటే ఎవరికైనా తెలుసుకోవలనే ఉంటుంది. 1936 నాటి ఆంధ్రభూమిలో ఈ ఉప్పెన గురించిన ఒక కధ ప్రచురించారు. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో ఆ వివరాల్లోకి తొంగి చూద్దాము. ముందుగా అలనాటి బందరు పెయింటింగ్ ఒకటి చూడండి 
  

 
బ్రిటిష్ లైబ్రరి వారి సేకరణ నుండి గ్రహింపబడింది. అభ్యంతరముంటే తొలగించబడుతుంది
Tags: Uppena, 1864, Machilipatnam, MasulipatnamSaturday, June 28, 2014

చిలకమర్తి వారి ప్రహసనము - దివాలదేవి వ్రతకల్పము

చిలకమర్తి వారి గణపతిని పక్కన పెడితే వారి ఇతర రచనలలో హాస్యరస ప్రధానమైనవి “ప్రహసనములు”, “వినోదములు”, “నవ్వులగని”. డా. వెలుదండ నిత్యానందరావు గారు వారి రచన “తెలుగు సాహిత్యంలో పేరడీ” లో ప్రహసనాల గురించి ప్రస్తావిస్తూ చిలకమర్తి లక్ష్మినరసింహం పంతులు గారి చేతిలో పేరడీ వీరవిహారం చేసిందన్నారు. చిలకమర్తి వారు మూఢనమ్మకాలను, అర్ధం లేని ఆచారాలను వారి ప్రహసనాలలో వినోదాత్మకంగా విమర్శిస్తూ వచ్చారు. వారివి 84 ప్రహసనాల దాకా ఉన్నాయి. ప్రస్తుతం మనకు పుస్తక రూపంలో 9 ప్రహసనాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇవాళ అందులో లేని “దివాలదేవి వ్రతకల్పము” అన్న ప్రహసనము చదువుదాము. 
Tags: Chilakamarthi, Prahasanamulu,

Wednesday, June 25, 2014

గేయాలు – కీర్తనలు

ఇవాళ “కస్తూరి రంగ రంగ” – “ఇదే మన తల్లి భారతా కల్పవల్లి” – “ఏహి మురారే కుంజ విహారే” – “హరి నీవే సర్వాత్మకుడవు” మరియు “అంతర్యామి అలసితీ సొలసితీ” అనే గేయాలు మరియు కీర్తనలు విందాము.

కస్తూరి రంగ రంగ దేవులపల్లి  ఆకాశవాణి

ఇదే మన తల్లి భారతా కల్పవల్లి దేశభక్తి గేయం ఆకాశవాణి
ఏహి మురారే కుంజ విహారే అసంపూర్తిగా ఉంది ఆకాశవాణి
హరి నీవే సర్వాత్మకుడవు అన్నమయ్య ఆకాశవాణి


అంతర్యామి అలసితీ సొలసితీ అన్నమయ్య

Tags: kasturi ranga ranga, Devulapalli, Ide mana talli bharata kalpavalli, Ehi murare kunja vihare, hari neeve sarvaatmakudavu, antharyaami alasithi solasithi, Annamayya, Annamacharya

Tuesday, June 24, 2014

ఘంటసాల పద్య విశేషాలు – ఆకాశవాణి

గత ఫిబ్రవరి 2014లో ఘంటసాల గారి వర్ధంతి సంధర్భంగా ఆకాశవాణి వారు డా. కె. ఐ. వరప్రసాద రెడ్డి గారి ఆధ్వర్యంలో “ఘంటసాల పద్య విశేషాలు” పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. అది ఇప్పుడు విందాము. ఘంటసాల గారి పద్యాలు అడపా తడపా వింటూ ఉన్నా ఒకచోటగా ఒకసారిగా విభిన్న పద్యాలు వినే అవకాశం రాదు. ఇది దాదాపు 70 నిమషాల పాటు సాగే కార్యక్రమం. రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను. మొదటి భాగము  రెండవ భాగము 
నెలలో పోస్ట్ చేసిన  8 బ్లాగు పోస్టులు సాంకేతిక కారణాల వల్ల కూడలిలో కనిపించలేదు. వాటి వివరాలు ఇవి. ఆసక్తి ఉన్నవారు పక్కన కనిపిస్తున్న లింకులు ద్వారా చూడండి. 

1. సూర్యకుమారి గారు పాడిన  బసవరాజు అప్పారావు గారి గీతాలు  

2. వెలిగించవోయి ఉజ్వలమైన శోభతో నవ్యాంధ్రరాష్ట్ర రత్నాల జ్వాల

3. పుట్టపర్తివారి శివతాండవము మరో రికార్డింగ్

4. ఆ నాటి నా గొడవ – కాళోజీ నారాయణరావు గారు

5. జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన గేయాలు

6. శివ మానస పూజ   శివ కీర్తనలు

7. అన్నమాచార్యుల కీర్తనలు  - భక్తిరంజని

8. ఆదిపూడి సోమనాధరావు గారి కృతులు   


Tags: Ghantasala, Ghantasala padyalu

Sunday, June 22, 2014

ఆదిపూడి సోమనాధరావు గారి కృతులు

ఆదిపూడి సోమనాధరావు గారు రచించిన “నీ నామమే ఎంతో రుచిరా” – “ఏమని పిలుతును నిన్ను” – “కొనియాడ తరమే నిన్ను” – “ఇక నిను విడువను ఏమయిననుగాని” - “పొగడ తరమే నిన్ను మా ప్రభు” అనే కీర్తనలు విందాము. గతంలో వీరివి నాలుగు కీర్తనలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. సాహిత్యం ఆదిపూడి సోమనాధరావు గారి “భక్త మణి భూషణము” నుండి.
 నీ నామమే ఎంతో రుచిరా ఏమని పిలుతును నిన్ను కొనియాడ తరమే నిన్ను


 ఇక నిను విడువను ఏమయిననుగాని

 పొగడ తరమే నిన్ను మా ప్రభు

Tags: Adipudi Somantharao, Aadipoodi, Adipoodi, akashavani, AIR, Bhakthiranjani

Saturday, June 21, 2014

అన్నమాచార్యుల కీర్తనలు - భక్తిరంజని

“వేదం బెవ్వని వెదకెడిని” – “అంతరంగ మెల్లా శ్రీహరి కొప్పించ కుండితే” – “అదివో అల్లదివో హరివాసము” - అన్నమాచార్య కీర్తనలు ఆలకిద్దాము. చివరి రెండు కీర్తనలు ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. సాహిత్యం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి “ఆధ్యాత్మ సంకీర్తనలు” నుండి. 


 వేదం బెవ్వని వెదకెడిని అంతరంగ మెల్లా శ్రీహరి కొప్పించ కుండితే అదివో అల్లదివో హరివాసము


Tags: Annamacharya keerthanalu, Vedam Bevvani, Antharanga mella sreehari, Adivo Alladivo harivasamu, akashavani, AIR, Bhakthiranjani,
 

Friday, June 20, 2014

శివ మానస పూజ – శివ కీర్తనలు

“రత్నై కల్పిత మాసనం హిమజలైః”, “శంభో హరా పాహిమాం” మరియు “మహా దేవ శంభో” అనే శివ కీర్తనలు ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి ఆస్వాదిద్దాము.  రత్నై కల్పిత మాసనం హిమజలైః

 శంభో హరా పాహిమాం


 మహా దేవ శంభో
Tags: Siva manasa pooja, sambho haraa paahimaam, mahaa deva sambho, siva keerthanalu,

Thursday, June 19, 2014

జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన గేయాలు

జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన “జయతు జయతు భారతమాత” మరియు “సమరస భావన భారతసామ్రాజ్య” అనే రెండు గేయాలు విందాము. ఈ గేయాల రచన శ్రీ మయూరం విశ్వనాథ శాస్త్రి గారు. ఆకాశవాణి వారి లలిత గేయాలు నుండి. 
 జయతు జయతు భారతమాత సమరస భావన భారతసామ్రాజ్య
Tags: GNB, G N Balasubrahmanyam, Samarasa Bhavana, Jayathu Jatathu Bharata matha, Mayuram Viswanadha Sastry, Jayathi Jayathi Bharatha Maatha
Wednesday, June 18, 2014

ఆ నాటి నా గొడవ – కాళోజీ నారాయణరావు గారు

ఆకాశవాణి వారు గతంలో సజీవ స్వరాలు కార్యక్రమంలో ప్రసారం చేసిన కాళోజీ నారాయణరావు గారి రికార్డు. బహుశా ఇది 1992లో రికార్డు చేసి ఉంటారు.   “ఆ నాటి నా గొడవ” శీర్షికన ఆంధ్రప్రభ వారి స్వర్ణప్రభ సంచికలో ప్రచురించిన కాళోజీ నారాయణరావు గారి వ్యాసం.


Tags: Kaloji Narayana Rao, Prajakavi,

Saturday, June 14, 2014

పుట్టపర్తివారి శివతాండవము – మరో రికార్డింగ్

గతంలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు పాడిన శివతాండవము పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈసారి ఇంకో రికార్డింగ్ విందాము. దీంట్లో రావూరి భరద్వాజ గారు పుట్టపర్తి వారిని ఇంటర్వ్యూ చేశారు. ఆకాశవాణి వారి సజీవస్వరాలు నుండి.