Tuesday, June 3, 2014

తెలుగువారి జానపద కళారూపాలు – గంగిరెద్దులు

పండగలప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వస్తే భిక్షమెత్తుకోటానికి వచ్చారనుకుంటాము కానీ, అది ఒక జానపద కళారూపమని దాని వెనకాల చాలా చరిత్ర ఉందని మనం భావించం. పల్లెలతో అనుబంధం ఉన్న వారికి గంగిరెద్దుల ఆటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పట్టణాల్లో ఒక్కోసారి గంగిరెద్దు కనబడకపోయినా వారి సన్నాయి మటుకు వీనుల విందు చేస్తూనే వుంటుంది. తెలుగువారి జానపద కళారూపాలు అనగానే గుర్తుకువచ్చే విశిష్టవ్యక్తి శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు. వివిధ కళారూపాలనన్నిటిని పుస్తక రూపంలో తెచ్చిన ఘనత వారికే చెందుతుంది.

ఆకాశవాణి వారు ఈ గంగిరెద్దుల మీద తాతా రమేష్ బాబు గారి రమ్యమైన ప్రసంగాన్ని ప్రసారం చేశారు. ముందుగా ఆ ప్రసంగాన్ని విని ఆ తరువాత ఈ కళారూపం మీద మిక్కిలినేని వారి సేకరణను సాహిత్యరూపంలో చూద్దాము. సందర్భం వచ్చింది గాబట్టి అడవి బాపిరాజు గారి రచన “డూ డూ డూ డూ బసవన్న” అన్న గేయం టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో మరొక్కసారి ఆస్వాదిద్దాము. ఆడియో సహకారం surasa.net.






హిందూ సౌజన్యంతో













ముద్దుకృష్ణ గారి వైతాళికులు నుండి


గంగిరెద్దుల వాళ్ళ దీవెనలను సాహిత్యరూపంలో చూసి , భవిష్యత్తులో వాళ్ళు మన ఇంటికి రావటం తటస్థిస్తే వాళ్ళ దీవెనలు అందుకొని వారిని సంతోషరచటానికి ప్రయత్నిద్దాము.



చివరగా సూత్రధారులు సినిమానుండి ఒకపాటతో ముగిద్దాము.




Tags: Gangireddulu, Janapada Kalaroopaalu, Mikkilineni, T Suryakumari, Adavi Bapiraju, Akashavani, Tanguturi, Doo doo   basavanna

2 comments:

  1. sri p.v.ramanagaru, namaste. my name is murali syam from pedamuthevi. I am regularly following your buautiful blogs and enjoying the content. I request you to please post sri m balamuralikrishnas tiruppavai rendered in good olden days from akaashvani vijayawada along with s gopalratnam sapdapadi. thank you

    ReplyDelete
    Replies
    1. శ్యామ్ గారు మీరడిగిన బాలమురళి గారి తిరుప్పావై ప్రస్తుతానికి నా సేకరణలో లేదు. సేకరిస్తేగనక తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ మధ్యనే ఆకాశవాణి వారు తిరుప్పావై సి.డి.ని విడుదల చేశారు. కానీ అది బాలమురళి గారిది కాదు.

      Delete