Saturday, March 29, 2014

అక్షరమాలా స్తోత్రం – భక్తిరంజని

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన “శ్రీ పరమేశ్వర మాతృకా వర్ణమాలా స్తోత్రం” (అక్షరమాలా స్తోత్రం) ఆస్వాదిద్దాము Tags: akshara mala stothram, adbhuta vigraha, siva akshara mala stotram, bhakthiranjani, samba sada siva,  

Friday, March 28, 2014

దేశభక్తి గేయాలు – ఆకాశవాణి

ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమైన రెండు దేశభక్తి గేయాలు విందాము. ముందుగా “ఎగరేతామా సొగసైన మనజండా” అనే గేయం. తరువాత “నీదేరా భారతదేశం” అనే గేయం విందాము. చివరగా “వందేహం జగత్ వల్లభం” అనే అన్నమాచార్య కీర్తన. హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. 


ఎగరేతామా సొగసైన మనజండా


 నీదేరా భారతదేశం
 వందేహం జగత్ వల్లభంTags: egaretama sogasaina manajanda, needera bhaarata desam, vamdeham jagat vallabham, desa bhakthi geyalu, annamayya

Tuesday, March 25, 2014

గౌరీదశకం – అన్నమయ్య కీర్తన – భక్తిరంజని

భక్తిరంజనిలో ప్రసారమైన శ్రీ ఆదిశంకరాచార్య విరచిత “గౌరీదశకం” విందాము. చివరగా “నగవులు నిజమని” అనే అన్నమాచార్య కీర్తన.
                                                                                సాహిత్య సహకారం  stotras.krishnasrikanth.com

Tags: Gouri Dasakam, Nagavulu nijamani

Monday, March 24, 2014

పుట్టపర్తి కనకమ్మ గారి కృతులు – భక్తిరంజని

“భక్తి దాన మిచ్చి మమ్ము పాలింపు మహాలింగ”, “కలలోన నాస్వామి కనుగొంటి”, “ఇలలో సకలం ద్వంద్వమయం”, “ఎక్కడయ్య నీ పదములు” - పుట్టపర్తి కనకమ్మ గారి కృతులు విందాము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి భక్తిరంజని ప్రసారాల నుండి 

 భక్తి దాన మిచ్చి మమ్ము పాలింపు మహాలింగ


 కలలోన నాస్వామి కనుగొంటి

 ఇలలో సకలం ద్వంద్వమయం

 ఎక్కడయ్య నీ పదములుTags: puttaparthi kanakamma

Sunday, March 23, 2014

దేవులపల్లి వారి కృతులు – భక్తిరంజని

“ప్రతిక్షణము నీ గుణకీర్తనము పారవశ్యమున చేయుదుము”, “జయము జ్ఞానప్రభాకర జయము శాంతిసుధాకర”, “ఎటుల నేనీ లీల కీర్తింతు ఓ దేవదేవ”, “కనికరముంచర కరుణాకర తండ్రీ” “హరినారాయణ యనరే జనులారా” - దేవులపల్లి వారి కృతులు విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. ప్రతిక్షణము నీ గుణకీర్తనము

 జయము జ్ఞానప్రభాకర

 ఎటుల నేనీ లీల కీర్తింతు

 కనికరముంచర కరుణాకర తండ్రీ

 హరినారాయణ యనరే జనులారాTags: harinarayana anare, jayamu jnana prabhakara, devulapalli Krishna sastry, kanikara munchara karunamayi thandri, etula nenee leela, pratikshanamu nee gunakerthanamu,

Saturday, March 22, 2014

లక్ష్మీ స్తుతి – భక్తిరంజని

“నమః కమల వాసిన్యై నారాయణ్యై నమో నమః” అంటూ మొదలయ్యే మహేంద్ర విరచిత శ్రీ లక్ష్మీ స్తోత్రం తరువాత “జయపద్మ విశాలాక్షి” అంటూ మొదలయ్యే విజయలక్ష్మీ స్తోత్రం చివరగా “లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం” శ్లోకం విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. 


 శ్రీ లక్ష్మీ స్తోత్రం విజయలక్ష్మీ స్తోత్రం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం

Tags: lakshmi sthotram, namah kamala vaasinyai, jayapadma visalakshi, vijaya lakshmi stotram, lakshmi ksheera samudra, lakshmi sthuti, bhakthi ranjani, radio songs,

Friday, March 21, 2014

చింత దీక్షితులు గారి “ఆంధ్ర దోమల సభ”

ఏదో కధల్లో చదవటమే గాని, మన పూర్వ పుణ్యాన నిజంగా మనకు జంతువులు, పక్షులు ఇతర క్రిమికీటకాదులు మాట్లాడుకొనే మాటలు అర్ధం చేసుకొనే శక్తి ఉంటే మన జీవితాలు ధుర్భరమయిపోయేవి. అయితే చింతా దీక్షితులు గారి మిత్రుడికి యోగవిద్యవల్ల ఈ శక్తి అబ్బిందట. ఒకసారి దోమలన్నీ రాణ్మహేంద్రవరంలో సభజేసాయట. అక్కడ దోమలు మాట్లాడుకున్నవి విని మిత్రుడు చెప్పగా చింతా దీక్షితులుగారు గ్రంధస్థం జేశారు. మంచి హాస్యాన్ని జనింప జేసే ఈ రచన 1935 నాటి “ఉదయిని” సంచిక నుండి (ప్రెస్ అకాడమి వారి సౌజన్యంతో). వెనుకటికి మూషికాలన్నీ జరిపిన సభ వృత్తాంతం ఒకటి పానుగంటివారి “సాక్షి”లో కనబడుతుంది. 


ప్రేరణతో గతంలో నేను దోమమీద రాసిన వ్యాసమొకటి ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు. 
Tags: chinta Deekshitulu

Thursday, March 20, 2014

చలం గారి “అట్ల పిండి”

ఇప్పుడంటే దోసెలు అంటున్నాం గాని పూర్వాశ్రమంలో “అట్లు” అన్న విషయం జగమెరిగినదే. ఆ మాటకొస్తే అట్లు వెయ్యటం కూడా ఒక కళ. ఎవరి హస్తవాసి వారిది. ఈ అట్లపిండి మొదట్లో ఎంత నోరూరించేదిగా ఉంటుందో, నిలవవుంటే దాని వాసన భరించలేనంతగా ఉంటుంది. ఈ ఇతి వృత్తంగా సీరియస్ రచయితగా అనిపించే చలం గారు పండించిన ఒక చక్కటి హాస్యరచనని చూద్దాము. 1925 నాటి “సాహితి” సంచిక నుండి. (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో)

సతీ సమేతంగా చలం గారు 


Tags: Chalam, Gudipati venkata chalam

Wednesday, March 19, 2014

మునిమాణిక్యం వారి “చీరెకు రంగు”

అదేమిటోగాని ఎప్పుడు చూసినా మునిమాణిక్యం గారు ఎదో ఒక పనిచేసి కాంతం గారి చేతిలో నవ్వులపాలవటం, లేదా ఆవిడ నవ్విపోవటం చూస్తూవుంటాము, అదే చదువుతూ వుంటాము. కాంతం గారి మీది ప్రేమాతిశయంతో ఆవిడను ఎక్కువచేసి, తన్ను తక్కువచేసుకొని చిత్రీకరించారో తెలియదు గాని, వారి రచనలలో ఆవిడదే పైచేయిగా కనబడుతుంది. ఇవాళ మునిమాణిక్యం గారు కాంతం గారి చీరెకు ఎంత చమత్కారంగా రంగు వేశారో చూద్దాము. తెలిసినంతవరకు ఇప్పుడు లభిస్తున్న వారి పుస్తకాలలో ఈ కధ లేదనుకుంటాను. 1927నాటి “ఆంధ్ర భారతి” సంచిక నుండి (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో)Tags: Munimanikyam narasimharao

Monday, March 17, 2014

మొక్కపాటి వారి “పిలక”

వారు సృష్టించిన “పార్వతీశం” పాత్ర ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు. వీరిది పార్వతీశం తప్ప మిగతా రచనలు పుస్తక రూపంలో దొరకటం లేదు. పాత సంచికలు తిరగేస్తే వీరి రచనలు దర్శనమిస్తాయి. అలా కళ్లబడిందే ఈ “పిలక” కధానిక. “సాహితి” 1924 నాటి సంచికలో ప్రచురించిన (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం) ఈ కాధానికను తిరిగి వెలుగు లోకి తెద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కధలోకి దిగేముందు  పిలక పుట్టుపూర్వోత్తరాల గురించి ఈ కింది లింకు ద్వారా  శాస్త్రి గారి (పదకొండవ అపురూప గళం) మాటల్లోనే నాలుగు మాటలు విందాము. Tags: Mokkapati, Mokkapati narasimha sastry, Pilaka


 

Saturday, March 15, 2014

దేశభక్తి గేయాలు – అన్నమయ్య కీర్తన

ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమైన రెండు దేశభక్తి గేయాలు విందాము. ముందుగా “పరమోత్తమ భరత భూమి” అనే గేయం. మల్లిక్ గారు పాడినట్లుగా అనిపిస్తోంది. తరువాత “నీది నాది ఏనాటికి మనందరిది ఈదేశం” అనే గేయం విందాము. చివరగా “పెట్టిన వారల భాగ్యమిది” అనే అన్నమాచార్య కీర్తన. హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం.

 పరమోత్తమ భరత భూమి


 నీది నాది ఏనాటికి మనందరిది ఈదేశంపెట్టిన వారల భాగ్యమిదిTags: paramottama bharata bhoomi, needi naadi enaatiki manamdaridi edesam, pettina vaarala bhaagyamidi, mallik, desabhakthi geyam, annamacharya, bhakthi ranjani, kadapa kendram