Monday, November 17, 2014

పాత తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా

చిన్నక్క: ఏం ఏకాంబరం ఈమధ్య మరీ నల్లపూస అయిపోయావు
ఏకాంబరం: ఓ పాత తెలుగు పుస్తకం కావల్సొచ్చి ఎంత వెతికినా దొరకక తెల్సిన వాళ్ళు చెబితే వేటపాలెం వెళ్లొచ్చా చిన్నక్కా
చిన్నక్క: వేటపాలెంలో “సారస్వతనికేతనం” అన్న గొప్ప గ్రంధాలయం ఉంది కదా, మరి పుస్తకం దొరికిందా 
ఏకాంబరం: వారు నన్ను పైనుంచి కిందదాకా చూసి ఆన్ లైన్ లో ఉందికదా ఇంతదూరం ఎందుకొచ్చారు, ఇప్పుడు ఇక్కడ దాన్ని వెతికి పట్టుకోవటం చాలా కష్టమని సెలవిచ్చారు 
చిన్నక్క: మరి నాతో ఒక్కమాట చెప్పొచ్చుకదా ఏకాంబరం, నేను చెప్పేదాన్ని కదా 
ఏకాంబరం: నీకు తెలుసా చిన్నక్కా, ఎక్కడ దొరుకుతుంది 
చిన్నక్క: “DLI” “డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా” అని ఆన్ లైన్ లైబ్రరి ఉంది. ఇది మన భారతదేశపు సాహిత్య భాండాగారము.
ఏకాంబరం: మరి దాన్ని ఎలా చూడాలి 
చిన్నక్క: ఇదిగో ఇది ఆ వెబ్ సైట్ అడ్రసు http://www.new.dli.ernet.in 

ఏకాంబరం: ఇదిగో ఇదేనా 

చిన్నక్క: అదేగాని, పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటానికి ముందు చిన్న software కావాలి. అది ఈ అడ్రసులో దొరుకుతుంది http://sanskritdocuments.org/scannedbooks/dlidownloader/


ఏకాంబరం: ఆ ఓపెన్ అయింది 

చిన్నక్క: మనకు కావల్సిన Software డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి
ఏకాంబరం: ఆ చేశాను ఇలా వచ్చింది 

చిన్నక్క: దాన్నిఅలా ఉంచి మళ్ళీ DLI కి వచ్చి అక్కడ ఎడమ చేతి వైపు Language అన్నచోట తెలుగు సెలక్ట్ చేసుకోవాలి.
ఏకాంబరం: ఆ చేశాను 
చిన్నక్క: ఇప్పుడు Author అన్న చోటగాని Title అన్న చోటగాని మనకు కావల్సినది ఓ నాలుగు అక్షరాలు కొట్టాలి
ఏకాంబరం: ఆ “bhamidi” అని కొడితే ఇలా పుస్తకాల పేర్లు వచ్చాయి. మన భమిడిపాటి కామేశ్వరరావు గారి పుస్తకాల్లా ఉన్నాయే.

చిన్నక్క: ఇప్పుడు మనకు కావలసిన పుస్తకం పక్కనున్న నెంబర్లను జాగ్రత్తగా ఇందాకటి downloader లో మొదటి బాక్స్ Barcode దాంట్లో కొట్టాలి
ఏకాంబరం: ఆ కొట్టాను
చిన్నక్క: ఇప్పుడు కింద Pages అన్న బాక్స్ లో అక్కడ చెప్పినట్లుగా కావల్సిన పుటల నెంబర్లు కొట్టాలి.
ఏకాంబరం: ఆ 1-10 అని కొట్టి డౌన్లోడ్ నొక్కాను. అవును ఇది ఎక్కడకు ఎలా డౌన్లోడ్ అవుతుంది


చిన్నక్క: ఇది “C” Drive లో My documents లో “DLID Books” అన్న Folder లోకి వెళ్ళి PDF ఫార్మాట్ రూపంలో ఆ పుస్తకం పేరుమీద కూచుంటుంది
ఏకాంబరం: ఆ డౌన్లోడ్ అయిపోయిందిట. పుస్తకం మొత్తం ఒకసారిగా చెయ్యగూడదా?

చిన్నక్క: తక్కువ పుటలు ఉన్నవి అయితే చెయ్యవచ్చు, ఎక్కువ పుటలు ఉంటే మన అదృష్టం బావుండకపోతే ఇలా అంటుంది


ఏకాంబరం: మిగతా పుటలు కావాలంటే మళ్ళీ 11-50 అని ఇలా చేసుకుంటూ పూర్తి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవాలా
చిన్నక్క: చేసుకొనే ముందు ఇందాక డౌన్లోడ్ అయిన పుస్తకాన్ని ఇలా రీనేమ్ చేసుకోవాలి

ఏకాంబరం: లేదనుకో
చిన్నక్క: ఇందాక నువ్వు కొట్టిన ఆ పుస్తకం నెంబర్ మీద సేవ్ అవుతుంది, దాన్ని బట్టి అది ఏ పుస్తకమో తెలుసుకోవటం చాలా కష్టం
ఏకాంబరం: మరి ఈ ముక్కలను కలిపి పూర్తి పుస్తకంగా చేసుకోవటం ఎలా
చిన్నక్క: ఇదిగో ఈ “PDFMate” - http://www.pdfmate.com/free-pdf-merger.html అన్న Software డౌన్లోడ్ చేసుకొని Install చేసుకొని కలుపుకొని మనం అనుకున్న విధంగా వచ్చాక, ఇంతకు ముందు ఉన్న పుస్తకాల ముక్కలనన్నిటినీ అక్కరలేదనుకుంటే delete చేసుకోవచ్చు


ఏకాంబరం: ఇంత బాధ పడేబదులు ఆ పుస్తకం కొనుక్కోవచ్చు గదా చిన్నక్కా
చిన్నక్క: దొరికితే గదా ఏకాంబరం, నువ్వే దొరకట్లేదు అన్నావుగాదా
ఏకాంబరం: నా జీవితంలో సగభాగం ఈ డౌన్లోడ్ కె సరిపోయేటట్లు ఉంది.
చిన్నక్క: అలా అనుకుంటే ఎలా. కష్టపడితే గదా ఫలం దక్కేది. ఎప్పటికప్పుడు దొరికిన పుస్తకాల వివరాలన్నీ కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ ఫైల్లోకి పేస్ట్ చేసుకోవాలి. 


పైన పుస్తకం, రచయిత పేరు గమనిస్తే, ఆ పుస్తకాల వివరాలు డేటా బేస్ లోకి ఎక్కించినప్పుడు నానారకాలుగా టైప్ చేశారు. చాలా తప్పులు దొర్లాయి. అందువల్ల పుస్తకం, రచయిత పేరు నానారకాలుగా అంటే మొదటి, మధ్యలో, చివరి అక్షరాలు కొట్టి సెర్చ్ చేస్తే ఊహించనటువంటి పుస్తకాలు లభ్యం అవుతాయి. ఒకే పేరుమీద ఇద్దరు రచయితలు ఉంటారు. ముందుగా ఒక పది పుటలు డౌన్లోడ్ చేసుకొని ఇది మనకు కావాలి అనుకుంటే మిగతా పుటలు డౌన్లోడ్ చేసుకోవాలి. అనుకున్నది ఒకటి అయింది మరొకటి, తీగ లాగితే డొంక కదిలింది, వెదకబోయిన తీగ కాలికి తగిలింది అన్న చందాన అధ్బుతమైన పుస్తకాలు బయల్పడతాయి. పుస్తకంలో ముందుమాట, చివరిమాట లాంటివి చదివితే ఆ రచయిత ఇతర రచనలు తెలుస్తాయి. ఒక్కోసారి ఇతర రచనల వివరాలు ఆ పుస్తకంలోనే ప్రకటించవచ్చు. అలాగే సిద్ధాంత గ్రంధాలు చూసినప్పుడు వారు ఆధారపడ్డ పుస్తకాలు పేర్కొంటారు. ఇలా మంచి పుస్తకాల వివరాలన్నీ సేకరించాలి. అలాంటి వాటికోసం సెర్చ్ చెయ్యాలి.
ఏకాంబరం: అంటే చదవాలన్న ఉత్సాహము, సేకరించాలన్న తపన, కొద్దిగా నేర్పు దానికితోడు మరింత ఓర్పు ఉండాలంటావు.
చిన్నక్క: అంతేగద ఏకాంబరం, ఒక పాత పుస్తకాన్ని ఎవరాన్న రీప్రింట్ చేస్తే కొని చదివి చాలా ఆనందిస్తాము. కానీ దాన్నిసేకరించటానికి వారు పడ్డ శ్రమ గమనించం.
ఏకాంబరం: ఈ వెబ్ సైట్ సర్వకాలసర్వావస్థలలో లభ్యమవుతుందా

చిన్నక్క: అవుతూవుంటుంది కానీ, వెబ్ సైట్ బాగా పనిచేస్తూ పుస్తకం స్పీడ్ గా డౌన్లోడ్ అవుతుంటే ఎక్కువ పేజీల చొప్పున డౌన్లోడ్ చేసుకోవాలి.
ఏకాంబరం: ఏ పుస్తకమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చా
చిన్నక్క: కాపీరైట్ ఉన్నవి కుదరవు ఏకాంబరం

ఏకాంబరం: ఈ సెర్చ్ కొద్దిగా ఇబ్బందిగానే వుంది.
చిన్నక్క: అందుకే Title లో సెర్చ్ చేసేటప్పుడు general సెర్చ్ అంటే గేయాలు, గీతాలు, కీర్తనలు, స్తోత్రాలు, పాటలు లాంటి పదాల మీద సెర్చ్ చేస్తే మంచి పుస్తకాలు దొరుకుతాయి
ఏకాంబరం: చాలా సహాయం చేశావు చిన్నక్కా ఇహ నాక్కావలసిన పుస్తకం వేటలో పడతాను.
చిన్నక్క: సంతోషం 

మనవి: ఈ పైన చెప్పిన విధానము పనిచెయ్యకపోతే ఈ కింద లింకులో మరొక తేలిక మార్గం చూపబడింది.

http://sobhanaachala.blogspot.in/2016/06/blog-post_24.html 


Tags: How to download old telugu books, How to download oldest books

14 comments:

 1. అద్భుతమైన విషయాలు తెలియచేశారు, ధన్యవాదాలు. ఇన్నాళ్ళూ కూడా ఒక్కొక్క పేజీ డౌన్లోడ్ చేసుకుని తంటాలు పడ్డాను. ఇప్పుడు మీరు పంపిన వివరాలు ఎంతో ఉపయోగం.

  ReplyDelete
 2. చాలా ఉపయోగం కల విషయం చెప్పారు. సంతోషం. ధన్యవాదాలు.
  అన్నట్లు, చిన్నక్క, ఏకాంబరంతో‌ పాటు బాలయ్య అనుకుంటా మరొకాయనా ఉండాలే. ఆయనే పనిలో బిజీగా ఉన్నారబ్బా!

  ReplyDelete
 3. ఇది కూడ try చేయండి
  http://dli-downloader.blogspot.in/2013_04_01_archive.html

  ReplyDelete
 4. download varaku bagane undi kani install elago teliyadam ledu miru chupina box ela vastundi?

  ReplyDelete
  Replies
  1. ముందుగా ఈ సైట్ http://sanskritdocuments.org/scannedbooks/dlidownloader/ కివెళ్లి DLID Windows Installer మీద క్లిక్ చేశాక కనబడే programme ని సేవ్ చేస్తే అది మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది. అలా డౌన్లోడ్ అయిన programme మీద డబుల్ క్లిక్ చేసి కనబడిన కమాండ్స్ మీద క్లిక్ చేస్తూ పోతే install అవుతుంది. install చేశాక ఒక ఐకాన్ కనబడుతుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆశించిన బాక్స్ వస్తుంది.

   Delete
 5. నమస్కారం,

  సాయినాధుని కృపవల్ల భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద పుస్తకాలను ఇంటర్నెట్ లో సేకరించి,వాటిని వివిధ వర్గాలుగా విభజించి ఉచితం గా ebooks(PDF) రూపంలో అందించటం జరిగింది. ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతో ఋణపడిఉంటాము.

  http://www.sairealattitudemanagement.org/

  ReplyDelete
 6. mee krushi amogham sainathuni krupa mee yandu varshinchugaka...

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి కృతజ్ఞతలు

   Delete
  2. Excellent narration and Useful write up . :)
   http://vihanga.com

   Delete
 7. చాలా ఉపయోగం కల విషయం చెప్పారు thank you.

  ReplyDelete
 8. అబ్బ! ఎంత చక్కగా చెప్పారండి, అరటిపండు వలిచి ఇచ్చినట్లుగా!
  ఇక తింటమే తరువాయి!
  ధన్యవాదాలు!

  ReplyDelete