మహర్షుల స్మృతులు మనలను సన్మార్గంలో నడపటానికి దోహదపడతాయి. అదే ఒకవేళ రాక్షసుల స్మృతులు ఉంటే, అవి మరి సహజంగానే అవ్యక్తమార్గాన పయనింపజేస్తాయి. అలాంటిదే ఈ మారీచ స్మృతి. దీన్ని మనకు ప్రహసన రూపంలో అందించినవారు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు. సమాజంలో జరుగుతున్న దురాచారాలను, దురభ్యాసాలను వ్యంగ్యంగా ఎత్తిచూపుతూ, తిట్టకుండా తిట్టినంత పనిచేస్తూ ఆద్యంతం రక్తి కట్టించారు. కందుకూరి, పానుగంటి, చిలకమర్తి, గురజాడ వీరందరు నాటకములు, ప్రహసనముల లాంటి రచనల ద్వారా సమాజంలో మార్పునకు కృషిచేశారు. అందుకే వారందరు సంఘసంస్కర్తలయ్యారు.
Tags: Chilakamarthi Lakshminarasimham, Prahasanamulu
No comments:
Post a Comment