Friday, September 29, 2017

సంగీతమే నా ప్రపంచం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

“సంగీతమే నా ప్రపంచం” అంటూ మంగళంపల్లి వారి ఈ వ్యాసం “సురభి” మొదటి సంచికనుండి. చివరగా మంగళంపల్లి వారి గళంలో ఒక గేయం, వింజమూరి సీతాదేవి గారి సేకరణ “భక్తి-ముక్తి” నుండి. 



















..








Tags: Mangalampalli Balamurali Krishna

Sunday, September 17, 2017

మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గురించి “సురభి” సంచికలో వచ్చిన వ్యాసం ఇది. చివరిగా వారి గళంలో “రార మాయింటిదాకా” త్యాగరాజస్వామి వారి కీర్తన విందాము. 



















..





Tags: Nookala China Sathyanaraayana
 

Tuesday, September 12, 2017

ఈలపాట విద్వాంసులు – శ్రీ కె. శివప్రసాద్ గారు

ఈలపాట అనగానే మనకు రఘురామయ్య గారు గుర్తుకు వస్తారు, కాని అలాగే మదిలో మెలిగే మరొక ప్రముఖ విద్వాంసులు శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారు. వీరు అతి చిన్న వయసు నుండి ఈలపాటలో ప్రావీణ్యం సంపాదించారు. దేశ విదేశాలలో కచేరీలు చేశారు. ఎన్నో బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు, సన్మానాలు, ప్రముఖుల ప్రశంసలు పొందారు. కర్ణాటక సంగీతంలోని కీర్తనలు ఈలవేస్తూ పలికించటం అంత తేలికైన విషయం కాదు. ముప్ఫైఏళ్ళకిందటే వీరి ఈలపాటలు గ్రామఫోన్ రికార్డుగా వచ్చాయి. ఆ రికార్డులో మంగళంపల్లి వారు శివప్రసాద్ గారిని పరిచయంచేయటం, ఆ రికార్డుకు వి.ఎ.కె. రంగారావు గారు వివరాలు సమకూర్చటం విశేషం. ఆ వివరాలేమిటో చూసి వారి ఈలపాట ఒకటి ఆస్వాదిద్దాము. 












..






వీరిది  వెబ్సైట్యు ట్యూబు ఛానెల్ వున్నాయి. అక్కడ మీరు మరిన్ని పాటలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 



Tags: whistle wizard sivaprasad, Eelapata, K. Sivaprasad

Wednesday, September 6, 2017

ప్రముఖ వీణా విద్వాంసులు – శ్రీ మంచాళ జగన్నాధరావు గారు

మంచాళ జగన్నాధరావు (1921 – 1985) గారు సరస్వతీ వీణ విద్వాంసులు. వీరు విజయనగరం దగ్గర చీపురుపల్లిలో జన్మించారు. చాలాకాలం ఆకాశవాణిలో పనిచేశారు. అనేక లలిత, భక్తి గేయాలకు సంగీతం సమకూర్చారు. మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన నండూరివారి ఎంకిపాటలకు వీరు సంగీతం సమకూర్చారు. బహుగ్రంధకర్త. బాలసరస్వతీ దేవి గారు పాడిన “బంగారు పాపాయి” గేయం వీరు రచించినదే. వీరిని గురించిన మరిన్ని వివరాలు, వారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న వెబ్సైట్ లో లభిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కీర్తనలు, గేయాలు విందాము. 

Source: http://saaranimusic.org





ఆర్. అనంతపద్మనాభరావు గారి “ప్రసార ప్రముఖులు” నుండి



ముందుగా బాలసరస్వతి దేవి గారు పాడిన “బంగారు పాపాయి” – సంగీతం సాలూరి హనుమంతరావు గారు. 









..




మంగళంపల్లి వారు పాడిన ఎంకిపాట

 
నండూరి సుబ్బారావు గారు








..









గోపాలరత్నం గారు పాడిన ఎంకిపాట






..








అందాలు చిందేటి ఓ చందమామ – లలితగేయం (ఆకాశవాణి)


..






ఎండగాని నీడగాని – అన్నమాచార్యుల కీర్తన (ఆకాశవాణి)


..




వెట్టివలపు చల్లకు  -  అన్నమాచార్యుల కీర్తన (ఆకాశవాణి)




రామరామ యని శ్రీరాముల – భక్తిరంజని (ఆకాశవాణి)



..


మంచాళ వారి వెబ్సైట్ 


Tags: Manchala Jagannadharao, Enki patalu, Mangalampalli, Gopalarathnam, Balasaraswathi devi, Bangaru papayi