Tuesday, April 29, 2014

ఆదిపూడి సోమనాధరావు గారి కృతులు – భక్తిరంజని

1922 ప్రాంతం నాటి రచనలు ఇవి. ఆదిపూడి సోమనాధరావు గారి కీర్తనలు విని ఆనందించండి. చక్కటి సాహిత్యము మంచి సంగీతంతో కూడిన కృతులు. ఇదివరలో పోస్ట్ చేసిన రెండు కీర్తనలు మళ్ళీ పోస్ట్ చెయ్యటం జరిగింది. అప్పట్లో ఇవి వారి రచనలు అన్న విషయం తెలియదు, అప్పటికి ఈ కీర్తనల సాహిత్య సేకరణ జరుగలేదు. సాహిత్యాన్ని కూడా సేకరించి పోస్ట్ చెయ్యటం జరిగింది. మరికొన్ని కీర్తనలు మరొకసారి విందాము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం  వారి భక్తిరంజని ప్రసారాల నుండి.

Tags: adipudi somanatha rao, aadipoodi somnadha kavi,
 Monday, April 28, 2014

గీతరామాయణము – భక్తిరంజని

నిన్న నామరామాయణము విన్నాము. ఇవాళ గీతరామాయణము విందాము. మూల రచయిత శ్రీ గజానన దిగంబర మాడ్గూళ్కరు గారు. తెనుగు సేత శ్రీ వానమామలై వరదాచార్యులు గారు. ఈ గీతరామాయణము చాలా పెద్ద రచన. ఆకాశవాణి వారు భక్తిరంజనిలో కొద్దిగానే ప్రసారం చేశారు. ప్రస్తుతానికి ఆ కొంచెమే ఆస్వాదిద్దాము 

Tags: Geet Ramayan in telugu

Sunday, April 27, 2014

నామరామాయణము – భక్తిరంజని

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో వచ్చిన నామరామాయణము ఆలకించండి. Tags: Nama ramayanam

Saturday, April 26, 2014

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుని సుప్రభాతం - కీర్తనలు

గతంలో ధర్మపురి లక్ష్మీనృసింహ స్వామి వారి సుప్రభాతం విన్నాము. ఇవాళ యాదగిరిగుట్టలో వేంచేసియున్న లక్ష్మీనృసింహ స్వామి వారి సుప్రభాతం మరియు కీర్తనలు విందాము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి భక్తిరంజని ప్రసారాల నుండి. ఈ సుప్రభాత రచన శ్రీమాన్ వంగీపురం నరసింహాచార్యులు గారు.

సాహిత్య సహకారం www.vangeepuram.com 


సుప్రభాతం


యాదాద్రి నృసింహ నామమే గానమునారాయణుడు అఖిల వ్యాపకుడని


మంగళాశాసనం


Tags: yadagirigutta lakshmi narasimha swamy suprabhatam, songs,

Tuesday, April 22, 2014

ఆర్యాంధ్రులు - ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాలు

ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి మీద బోలెడన్ని పుస్తకాలు లభిస్తాయి, కానీ మన ఆరంభదశ ఎక్కడనుండి అన్నదానిమీద పూర్తివివరాలు లభించవు. విశ్వామిత్రుడు తన కుమారులను నీచజాతిగా జీవించండని శపించాడని, ఆంధ్రులు ఆజాతికి చెందినవారని ఒక అపప్రభ పుట్టించారని, అది తప్పు అని తెలుపుతూ, ఆంధ్రుల గొప్పతనాన్ని చాటే, కోట వెంకటాచలం గారి వ్యాసం “ఆంధ్రరాష్ట్రావతరణ సంచిక” లో ప్రచురితమైనది. ప్రెస్అకాడమీ వారి సౌజన్యంతో ఆ వివరాల్లోకి తొంగిచూద్దాము. 

Source: InternetTags: kota venkatachalam

Sunday, April 20, 2014

దశావతార కాలనిర్ణయము – శ్రీ కోట వెంకటాచలం గారు

శ్రీకృష్ణుడు ఎప్పటి వాడు అంటే ద్వాపరయుగం నాటి వాడనో, మహాఅయితే ఓ ఐదువేల ఏళ్ళ కిందటి వాడనో లెక్కలుగట్టి చెప్పగలిగేవాళ్లున్నారు. కానీ మత్స్యావతార విషయానికి వస్తే కృతయుగమని చెప్పగలుగుతారుగానీ ఇతమిద్ధంగా ఇన్ని సంవత్సరాల కిందట అని చెప్పగలగటం మానవమాత్రుల తరంకాదు. అలా చెప్పగలిగిన, చెప్పిన విశిష్ట వ్యక్తి శ్రీ కోట వెంకటాచలం గారు. మన గత చరిత్ర గురించి తెలుసుకుందామనుకొనేవారికి వారి రచనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 

Source: Internet


వారి రచన కలియుగరాజ వంశములు లో ఈ కింది విషయాలు కనబడతాయి. 
వారి రచనగురించిన ఇతర వివరాలు ఈ బ్లాగులో లభిస్తాయివీరి రచనలు కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. Tags: kota venkatachalam

Saturday, April 19, 2014

ధర్మసందేహాలు – ఉషశ్రీ – సాహిత్యం

ఇప్పటి స్వాతి అభిమానులకు ధర్మసందేహాలు అంటే మల్లాది వారు గుర్తుకు రావచ్చు. కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో అనుబంధం ఉన్నవారికి ఉషశ్రీ గారి ధర్మసందేహాలు కార్యక్రమం చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఖంగుమని మ్రోగే వారి స్వరం, సూటిగా తక్కువ మాటలతో జవాబు చెప్పటం, తలతిక్క ప్రశ్నలు వేసేవారికి సుతిమెత్తగా చివాట్లు పెట్టటం వారికే చెల్లుతుంది. స్వాతిలో “ఏదిసత్యం? ఏది అసత్యం?” పేరిట వచ్చిన వారి ధర్మసందేహాలను ఉషశ్రీ గారు తరువాత 200 పుటల పుస్తక రూపంలో తెచ్చారు. శ్రవ్యరూపంలో దొరకని వారి సమాధానాలు కనీసం అక్షరరూపంలో అన్నా చదువుతూ, కొన్ని ప్రశ్నలకన్నా సందేహాలు నివృత్తి చేసుకొంటూ వారిని మరొక్కసారి మననం చేసుకుందాము. Tags: Ushasri, Ushasree, Dharmasamdehalu