ఇప్పటి స్వాతి అభిమానులకు ధర్మసందేహాలు అంటే మల్లాది వారు గుర్తుకు రావచ్చు. కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో అనుబంధం ఉన్నవారికి ఉషశ్రీ గారి ధర్మసందేహాలు కార్యక్రమం చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఖంగుమని మ్రోగే వారి స్వరం, సూటిగా తక్కువ మాటలతో జవాబు చెప్పటం, తలతిక్క ప్రశ్నలు వేసేవారికి సుతిమెత్తగా చివాట్లు పెట్టటం వారికే చెల్లుతుంది. స్వాతిలో “ఏదిసత్యం? ఏది అసత్యం?” పేరిట వచ్చిన వారి ధర్మసందేహాలను ఉషశ్రీ గారు తరువాత 200 పుటల పుస్తక రూపంలో తెచ్చారు. శ్రవ్యరూపంలో దొరకని వారి సమాధానాలు కనీసం అక్షరరూపంలో అన్నా చదువుతూ, కొన్ని ప్రశ్నలకన్నా సందేహాలు నివృత్తి చేసుకొంటూ వారిని మరొక్కసారి మననం చేసుకుందాము.
Tags:
Ushasri, Ushasree, Dharmasamdehalu









No comments:
Post a Comment