చిన్నక్క: హలో బాలయ్యా
బాలయ్య: హలో హలో చిన్నక్కా
చిన్నక్క: ఏం బాలయ్యా ఎడబోయినావూ, ఫోన్ చేస్తే ఎత్తవూ, చాలా పరేషాన్ అయినాను బాలయ్యా నీగురించి
బాలయ్య: ఆర్నెల్లు అమెరికా పోయొచ్చినాలే చిన్నక్కా
చిన్నక్క: అవును ఏకాంబరం ఏడి తనూ వస్తానన్నాడు?
బాలయ్య: ఊరు పోతనన్నాడు చిన్నక్కా, అదిసరేగాని పాత పుస్తకాల గురించి నువ్వేదో శానా కొత్తవిషయాలు చెప్పావన్నాడే
చిన్నక్క: పాతవిషయాలే కొత్తగా చెప్పానంతే
బాలయ్య: పాతపుస్తకాల మాదిరిగా ఆంధ్రపత్రికలు, గోల్కొండపత్రికలు, భారతి ఇవ్వికూడా నెట్ లో ఏడన్నా దొరుకుతాయా చిన్నక్కా
చిన్నక్క: చదవాలని మనసుంటే మార్గం ఉండకబోతుందా బాలయ్యా
బాలయ్య: దొరికినప్పుడు వాటివిలువ తెలియదు, దాచిపెట్టలేక పోయాము, ఇప్పుడు ఉంటే ఓ మారు తొంగి చూద్దామనుంది. ఏడ దొరుకుతాయి ఆ వివరాలు కొద్దిగా చెప్పగూడదా చిన్నక్కా
చిన్నక్క: మన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ వాళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించి చినిగిన పేపరుముక్కతోసహా స్కాన్ చేసి, భద్రపరచి మనకు అందుబాటులోకి తెచ్చారు.
బాలయ్య: మరి వాటిని ఎలా చూడాలి చెప్పావుకాదు
చిన్నక్క: ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ ఓపెన్ చేసి ఇదిగో ఈ అడ్రసు కొట్టు, లేదా ఈ లింకు మీద క్లిక్ చెయ్యి.
బాలయ్య: ఆ ఇదేదో ఓపెన్ అయ్యింది
చిన్నక్క: ఎడంచేతివైపు కింద “Archives” మీద ఓపరి క్లిక్ చెయ్యి
బాలయ్య: ఆ ఏవో వచ్చేసినాయి
చిన్నక్క: ఇప్పుడు ఆ పైదానిమీద క్లిక్ చెయ్యి
బాలయ్య: చేశాను, ఇప్పుడు మళ్ళీ మొదటిదాంట్లో చెయ్యనా
చిన్నక్క: ఆ చేశాక దాంట్లో Monthly మీద క్లిక్ చెయ్యి చెబుతా
బాలయ్య: ఆ చేశాను
చిన్నక్క: ఇప్పుడు Magazine Name అన్న దాంట్లో అలాగే కిందకు వెళ్ళి Bharathi అన్న పుస్తకం సెలెక్ట్ చెయ్యి
బాలయ్య: ఆ చేసేశాను
చిన్నక్క: ఇప్పుడు Year మీద క్లిక్ చేస్తే 1924 నుంచి 1990 దాకా కనబడుతున్నాయి కదా, మొదట 1924 మీద క్లిక్ చెయ్యి
బాలయ్య: ఆ ఇప్పుడు నెలావారీగా ఏవో కనబడుతున్నాయి
చిన్నక్క: ఇక ఆ బ్లూకలర్లో కనబడే మొదటి లైన్లో దానిమీద క్లిక్ చేస్తే ఆ నెలతాలూకు భారతి కనబడుతుంది
బాలయ్య: ఆ భారతి 1924 సంచిక కనబడింది, చాలా థాంక్స్ చిన్నక్కా
చిన్నక్క: అప్పుడే ఏమైంది బాలయ్యా, చూశావా అది 144 పేజీలు ఉందిట
బాలయ్య: మొత్తంగా డౌన్లోడ్ చేసుకోవటానికి లేదా
చిన్నక్క: ఇక్కడ కుదరదు, ప్రతి పేజీ చూసుకుంటూ పోవలసిందే, కుడి చేతివైపు కనబడే మొదటి యారోమార్కు నొక్కితే నెక్స్ట్ పేజీ కనబడుతుంది, చివరి యారోమార్కు నొక్కితే డైరెక్ట్ గా చివరి పేజీలోకి వెళతావు, అలాకాక ఆ చివర కనబడే బ్లూకలర్ నెంబరు మీద నొక్కితే ఇంకొన్ని పేజీలు వస్తాయి. వెనక్కి రావాలంటే ఎడమచేతి వైపు యారోమార్కులు నొక్కాలన్నమ్మట. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఈ విధంగానే అన్ని రకాల దిన, వార, పక్ష, మాస, వార్షిక, మిగతా పత్రికలు చూడవచ్చు. కొన్ని వందల సంచికలు ఉన్నాయి. 100 సంవత్సరాల కిందటి ఆంధ్రపత్రిక పేపర్లు ఉన్నాయి. ప్రతిసారి మొదటి నుంచి నరుక్కురావాలి.
బాలయ్య: ఏదో గుడ్డిలోమెల్ల, అదే పదివేలు కనీసం కళ్ల చూడగలుగుతున్నాము.
చిన్నక్క: విషయసూచిక వుంటే చూసి మనకు కావలసిన పేజీలు చూడవచ్చు. తెలుగు అంకెలు తెలిసివుండాలి. పండగలప్పుడు వచ్చే ప్రత్యేక సంచికలు బావుంటాయి.
బాలయ్య: అవును “నిప్పు నక్క” బ్రౌసర్ లో కనబడదా
చిన్నక్క: ఓ “Fire Fox” Browser లోనా, ఎందుకు కనబడదూ, ఫైర్ ఫాక్స్ లో ఇలా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, అదిగూడా ఒక్కొక్క పేజీ మాత్రమే
బాలయ్య: మరో మార్గం లేదంటావు
చిన్నక్క: వీళ్ళదే మరో వెబ్సైట్ వుంది. అక్కడ ఓ ఎనిమిది “ఆంధ్రపత్రిక” వార్షిక సంచికలు ఉన్నాయి. దాంట్లో ఓ ఆరు పుస్తకాల మీద Right Click చేసి Save link as సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పి. డి. ఎఫ్. ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతాయి.
బాలయ్య: అన్నీ ఇలాచేసి ఉంటే బావుండేది.
చిన్నక్క: మనం గ్రంధాలయానికి వెళితే ఏంచేస్తాము, ఓ పుస్తకం తీసుకొని ఒక్కో పేజీ చదువుతూ వెళతాము, ఇదీ అంతే. ఆ మాత్రం అవకాశం ఇచ్చారు సంతోషించాలి.
బాలయ్య: నిజమే చిన్నక్కా, అసలు ఈ పుస్తకాలను ఇంత జాగ్రత్తగా భద్రపరచినవాళ్లను, స్కాన్ చేసినవాళ్లను, ఇలా భద్రపరచాలని నిర్ణయించుకున్న అధికారులను ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. నాలాంటి తెలియనివారికి ఎంతో చక్కటి విషయం చెప్పావు చిన్నక్కా. ఇవన్నీ చదవటానికి ఈ జన్మ సరిపోదు.
చిన్నక్క: సంతోషం.
Thank you so much.
ReplyDeleteVery useful.
గురువు గారు ఈ రోజు నుంచి నేను మీకు fan,ఒప్పేసుకోండి
ReplyDeleteఎన్నో కృతజ్ఞతలు శోభనాచల బ్లాగు గారూ!
ReplyDeleteప్పటి నుండో , ఇట్లాగ పాతపత్రికలను నెట్ లో చదవాలని. నాబోటి అరకొర విజ్ఞానం కలవాళ్ళకి ఉపయుక్తం మీ పరిశోధనా వ్యాసాలు. బహుళ ధన్యవాదాలు - కుసుమాంబ (1955);
మీకు ఉపయోగపడ్డందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు
Deletethank you for sharing a very valuable information
ReplyDeleteVenkata Ramana garu, meeku chaala dhanyavaadaalu; paatha Yuva, Yuva deepavali sanchikalu online lo ekkadaina untey cheppagalaraa??
ReplyDeleteచాల బాగుంది.
ReplyDeleteఇప్పుడు లేదుగ ఆ వెబ్ సైట్ . మీ దగ్గర పాతవి ఉంటె నాకు ameeruddin.sd@gmail.com ku mail cheyyandi plz
ReplyDelete