మన తెలుగు సాహిత్యంలో దండకాలకు ప్రత్యేక స్థానం ఉంది. సంస్కృత పద భూయిష్టమై తిట్టారో, పొగిడారో కూడా తెలియకుండా సాగుతాయి. మంచి భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఏకధాటిగా, రాగయుక్తంగా చదువుతూవుంటే వినసొంపుగా ఉంటాయి. గతంలో “ఓటు దండకం” ఒకటి పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ సారి “మధుపాన దండకం” చూద్దురు గాని. రచన యర్రంశెట్టి సత్యనారాయణమూర్తి గారు. ఈ దండకం “నెఱజాణ” అనే 1936 నాటి సంచిక లోనిది (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం). ఇలాంటివి వెలుగులోకి తెస్తే ఎప్పుడన్నా, ఎవరికన్నా ఉపయోగపడతాయన్నది ఆలోచన.
రాజయ్య గారి చిత్రపటం
|
సంధర్భం వచ్చింది గాబట్టి చివరగా నాగయ్య గారు 1938లో గృహాలక్ష్మి సినిమాలో పాడిన “కల్లు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి” అనే ప్రభోదాత్మక గేయం విందాము. ఆ రోజుల్లో ఈ పాట విని కొంతమంది తాగటం మానారని చదివే ఉంటారు.
Tags: kallu maanamdoy babu,
nagaiah
No comments:
Post a Comment