మొక్కపాటి అనగానే మనకు పార్వతీశం గుర్తుకు వస్తాడు. మొక్కపాటి వారి ఇతర రచనల గురించి మనకు అంతగా సమాచారం లభించదు. అవి ప్రస్తుతం ప్రచురణలో లేవు. 1970లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో పార్వతీశం మొదటిభాగం ప్రచురితమవుతున్నపుడు మొక్కపాటి వారి ఇతర రచనలు కొన్ని పేర్కొనటం జరిగింది.
మొక్కపాటి వారి
రచనలలోని “గాజుపాలెం గాంధి” కధానిక స్కానింగ్ కింద చూడండి. ఈ కధ
1951లో ప్రచురితమైన మొక్కపాటి వారి “కన్నవి : విన్నవి” కధల పుస్తకం మొదటిభాగం లోనిది.
మంచి కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు తెలిసే ఉంటుంది మనసు ఫౌండేషన్ వారు అరుదైన పుస్తకాలను ఔట్ ఆఫ్ ప్రింట్ పుస్తకాలను సేకరించి స్కాన్ చేసే బృహత్ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆ విధంగా స్కాన్ చేసి, తెలుగు సాహిత్యం లో ప్రస్తుతం దుర్లభంగా ఉన్న పుస్తకాలు సాహిత్య ప్రియులకు అందుబాటులోకి తేవాలని వారి ఆశయం.
ReplyDeleteమీ ఆసక్తిననుసరించి, మీ దగ్గర ఉన్న పాత పుస్తకాలను వారికి (హైదరాబాదు) పంపిస్తే వారు స్కాన్ చేయించి, మీ పుస్తకాలను మళ్ళీ మీకు తిరిగి పంపిస్తారు. ఇతర వివరాలకు శ్యాం నారాయణ గారిని (మైలు చిరునామా syamnarayana.t@gmail.com)సంప్రదించి కోఆర్డినేట్ చేసుకోవచ్చు.
ఈ వ్యాఖ్య చూసిన వారిలో వారి వారి వధ్ధ ఉన్న అపురూపమైన పుస్తకాల ఉన్నవారు కూడ ఈ విషయం గమనించగలరు.
ఆంగ్ల మరియు ఇతర పాశ్చాత్య భాషల పుస్తకాలను గూటెంబర్క్ ప్రాజెక్ట్ ద్వారా పాశ్చాత్యులు ఈ విధంగానే భద్రపరుచుకుంటున్నారు.