Saturday, January 10, 2015

గ్రామఫోను రికార్డులు లభ్యమయ్యే వెబ్సైట్లు

సదానందం: ఏం బావగారు ఏవో క్యాసెట్లు చూస్తున్నట్లున్నారు 

చిదానందం: రండి బావగారు, ద్వారం వారి క్యాసెట్ కోసం వెతుకుతున్నాను 

సదానందం: కిందటి సారి నేను పట్టుకుపోయాను, మరచి పోయినట్లున్నారు 

చిదానందం: అవునండోయ్ బాగా గుర్తుచేశారు 


సదానందం: బావగారు పాత గ్రామఫోను రికార్డులు నెట్లో ఏమన్నా దొరుకుతాయా మీకు తెలిసివుంటుందని వచ్చాను. 

చిదానందం: ఎందుకు దొరకవు, అయితే ఈ సంధర్భంగా మీకో విషయం చెప్పాలి. HMV సంస్థలో 30 సంవత్సరాలు పనిచేసిన శ్రీ పుట్టా మంగపతి గారు “స్వర సేవ” అన్న పుస్తకం ద్వారా ఆనాటి తమ అనుభవాలు పంచుకున్నారు. వీరు ఎంతో గొప్పగొప్ప వారితో దగ్గరవుండి అనేక రికార్డులు చేయించారు. అందులో ఘంటసాల గారితో భగవద్గీత రికార్డింగ్ ఒకటి. ఆ నాటి వివరాలు, అరుదైన ఆ ఫోటోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సేకరించుకోవలసిన పుస్తకం అది. 




ఈ కింది పుస్తకాలు PDF లో లేవులేండి. 




 ఇప్పుడు రికార్డులు లభ్యమయ్యే వెబ్సైట్లు కొన్ని చూద్దాము. 

సదానందం: మరి ఆ రికార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చా? 

చిదానందం: కొన్ని చోట్ల చేసుకోవచ్చు, ఒక్కోసారి రాత్రికి రాత్రి కొన్ని వెబ్సైట్లు, బ్లాగులు వాటి లింకులు కొన్ని కారణాలవల్ల మాయమయిపోతూవుంటాయి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందాన అవి దొరకంగానే రికార్డో, డౌన్లోడో చేసిపెట్టుకోవాలి. 

సదానందం: అక్కడే వినటం కుదురుతుందా 

చిదానందం: కొన్ని చోట్ల కుదురుతుంది, కొన్ని చోట్ల కుదరదు, ముందుగా “Archive of Indian Music” అన్న వెబ్సైట్ చూద్దాము. దాని లింకు ఇది. 

 http://archiveofindianmusic.org/

 సదానందం: మరి ఎలా ముందుకెళ్లాలి చెప్పారు కాదు 





చిదానందం: పైన కనబడే ఆర్టిస్ట్స్ మీద క్లిక్ చేస్తే ఆంగ్ల వర్ణమాల కనబడుతుంది. ఉదాహరణకు “S” మీద క్లిక్ చేస్తే వాళ్ళ పేర్లు కనబడతాయి. ఆ పేరుమీద క్లిక్ చేస్తే వారు పాడిన పాటలు వినబడతాయి 

సదానందం: ఓ అయితే ఇక్కడ వినే అవకాశం ఉందన్నమాట 

చిదానందం: ఇక్కడ డౌన్లోడ్ అవకాశం లేదు. మద్రాసులో “నాదముని” అన్న నాదస్వరము వాయించే ఒక బ్యాండ్ ఉందిట. “Robert Garfias” అనే ఆయన మనదేశానికి వచ్చినపుడు అది విని చాలా సంతోషించి ఒక రికార్డు తయారు చేశారు. అయితే అది కొనుక్కొని వినాల్సిందే. దాంట్లో “ననుపాలింప” అనే నాదస్వర కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. 



వీరు మనదేశం వచ్చినప్పుడు సేకరించిన అనేక రికార్డులు నెట్లో పెట్టారు. దాని లింకు ఇది. 
 http://www.socsci.uci.edu/~rgarfias/sound-recordings/old-india/india-mp3.html


ఇక్కడ ఎస్. నటరాజన్ గారు నాదస్వరం మీద వాయించిన ఘంటసాల గారి “నమో వెంకటేశ” వింటే పరవశులవుతారు. ఆ ఆడియోల మీద క్లిక్ చేసి వినవచ్చు లేదా రైట్ క్లిక్ చేసి “save link as” మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోనూవచ్చు. 



సదానందం: ఎంత అధ్బుతంగా ఉందండి ఇదే మొదటిసారి వినటం 

చిదానందం: అప్పుడే ఏమయింది ఈ లింకు చూడండి ఇక్కడ నానా దేశాలవి కనబడతాయి. ఆ కుడి వైపు లేబుల్స్ లో మనదేశానికి చెందినవి చూడవచ్చు. 
 http://oriental-traditional-music.blogspot.in




ఇలా మధ్యలో కనబడే డౌన్లోడ్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 




సదానందం: అధ్బుతం బావగారు 

చిదానందం: ఇప్పుడు ఈ లింకు చూడండి. ఇక్కడ కూడా నానా దేశాలవి వినబడతాయి. అలాగే ఆ కుడి వైపు లేబుల్స్ లో మనదేశానికి చెందినవి కనబడతాయి. 
 http://bolingo69.blogspot.in



ఇక్కడ డౌన్లోడ్ లింకు ఇలా వుంటుంది. ఓపట్టాన ఎక్కడుందో అర్థం కాదు. 



సదానందం: వండర్ఫుల్ బావగారు 

చిదానందం: సరే ఈ లింకు ద్వారా ఇతర దేశాల సంగీతాన్ని రుచి చూద్దాము. 

 http://toroyloco.blogspot.in



ఇక్కడ డౌన్లోడ్ లింకు ఇలా వుంటుంది. 



సదానందం: సంగీతానికి ఎల్లలు లేవన్నారు పెద్దలు. 

చిదానందం: ఇప్పుడు ఈ లింకు ద్వారా యూట్యూబ్ లో పెట్టిన కొన్ని రికార్డులు చూద్దాము 

https://www.youtube.com/user/sunny78rpmmusic/videos 


సదానందం: ఇవి చాలా పాత రికార్డుల లాగా వున్నాయే 

చిదానందం: ఇది మరో యూట్యూబ్ లింకు. 
 https://www.youtube.com/user/vintageaudio54/videos




సదానందం: చాలా మంచి మంచి వెబ్సైట్లు చూపెట్టారు బావగారూ. 

చిదానందం: సంతోషం 



 Tags: Old LP Records, Gramophone Records

No comments:

Post a Comment