మన తెలుగు కార్టూన్ల విషయానికి వస్తే ప్రధమతాంబూలం శ్రీ తలిశెట్టి రామారావు గారికి చెందుతుంది. కొన్ని కార్టూన్లు కేవలం రేఖామాత్రంగానే నవ్వు పుట్టిస్తాయి. దానికి వ్యాఖ్య తోడయితే చెప్పేదేముంది. ప్రతి కార్టూనిస్టుకి ఒక ఒరవడి అంటూ వుంటుంది. దాన్నిబట్టి ఆ కార్టూనిస్టు ఎవరో గ్రహింపవచ్చు. మనకు తెలుగులో బోలెడంతమంది కార్టూనిస్టులు ఉన్నారు. అలాగే కార్టూన్లలోకూడా పండుగలకు సంబంధించిన కార్టూన్లు, రాజకీయ వ్యంగ్య కార్టూన్లు, ఇలా సన్నివేశాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి లెక్కలేనన్ని ఉన్నాయి.
ఇప్పుడు కార్టూన్లకు సంబంధించిన కొన్ని పుస్తకాల ముఖచిత్రాలు తదుపరి ఓ తొంభైమంది కార్టూనిస్టుల కార్టూన్లు చూద్దాము. ఇవన్నీ పాత సంచికలనుండి సేకరించినవి. ఇంతమందివి ఒకచోటగా తెస్తే బావుంటుందని చెయ్యటం జరిగింది.
ఇక్కడ తలిశెట్టి వారిది 1930 నాటి భారతిలో వచ్చిన ఒక కార్టూన్ కనబడుతుంది. ఆయన దాంట్లో 2030లో ఎలాంటి పరిస్ధితి ఉంటుందో ఊహించుకోని వేయటం జరిగింది. మనం రాబోయె సంవత్సరాలలో ఆ పరిస్థితికి చేరుకోబోతున్నామనిపిస్తోంది. ఇలాంటివి చాలా అరుదైనవి. వారి ఊహాశక్తికి ఆశ్చర్యం కలగకమానదు. ఈమధ్యకాలంలో వారి కార్టూన్లు రెండు పుస్తకాలుగా వచ్చాయి, కాని దాంట్లో ఈ కార్టూను లేదు. వీరు కార్టూన్లు వెయ్యటం నేర్చుకొనే వారికోసం 1918 లోనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు.
ఐ. ఎ. ఎస్. ఆఫీసర్ శ్రీ బి. పి. ఆచార్య గారి కార్టూన్లు కూడా ఇక్కడ దర్శన మిస్తాయి.
ముందుగా ఈమధ్యనే దివంగతులైన శ్రీ ఆర్. కె. లక్ష్మణ్ గారివి ఓ రెండు కార్టూన్లు చూద్దాము.
ఈ కార్టూన్ శ్రీ గీత సుబ్బారావు గారి పుస్తకం నుంచి వారు సహృదయతో అనుమతిస్తారనే ఉద్దేశంతో వారి అనుమతి తీసుకోకుండా గ్రహించటం జరిగింది.
|
ఇది కార్టూనిస్ట్ బాబు
గారి బ్లాగు
రాబోయే సంవత్సరాలలో ప్రపంచ పరిణామాలు ఎలా ఉండబోతాయో తెలుసుకోవాలంటే ఈ కింది లింకు చూడండి.
Tags: Telugu Cartoons, Telugu
Cartoon Books, Talisetti Ramarao, Telugu Cartoonists, Bapu, Babu, Jayadev,
Mallik, Chandra, Ragathi Pandari, Katoori, Mallik, Satya Murthy, Bali, Sarasi, Samku, Sekhar, Geetha Subbarao
రమణ గారూ చాలా ఓపికగా చాలా కార్టూన్లు సేకరించి అప్లోడ్ చేసారు. బాగున్నది.అబినందనలు.
ReplyDeleteకొంతకాలం క్రితం నేను తెలుగు వికీపీడియాలో ప్రముఖ కార్టూనిస్టుల గురించి వ్యాస పరంపర వ్రాశాను. ఇటీవల, నాకు కొమర్రాజు లక్ష్మణరావు గారి పేరు మీద ప్రశంశా పత్రం కాబోలు ఇచ్చారు.
మరొక విషయం. వి జి ఊమెన్ గారు, తెలుగు పత్రికల్లో రాజకీయ కార్టూన్లకు ఒక పరంపరగా, పత్రికలో శీర్షిక ఏర్పరిచి ప్రచురించే ప్రక్రియకు, ఆద్యుడు. ఆయనకు ముందు తెలుగులో రాజకీయ కార్టూన్లు వరుసగా ప్రచురించబడటం లేనే లేదు. అసలు రాజకీయ కార్టూన్లు ఆయనకు ముందు తెలుగులో లేవు అనటం అతిశయోక్తి కాకపోగా, నిజమే అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఊమెన్ కేరళీయుడు. తెలుగు రాదు. మరి ఆయన తెలుగులో కార్టూన్లు ఎలా వెయ్యగలిగారు! అదే వార పత్రికా జర్నలిజంలో ఒక కొత్త పంథాను ఏర్పరిచి, ఆంధ్ర సచిత్ర వార పత్రిక వారు ఈయన కార్టూన్లను ప్రచురింపచేశేవారు. ఆయన ఆంగ్లలో కాప్షన్ పెట్టి కార్టూన్లు వేస్తె, ఇక్కడ అప్పటి పత్రికా సంపాదకులు (అప్పట్లో సంపాదకులు అని ఉండెవారు), ఆ ఆంగ్ల కాప్షన్ ను ఎప్పటికప్పుడు తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించేవారు. అది తెలుగులో రాజకీయ కార్టూన్ల చరిత్ర.
ఊమెన్ గారి జన్మదినం 20 ఫిబ్రవరి, 1916. ఆయన 68 సంవత్సరాలు జీవించి జులై 18 1984 న మదరాసులోని స్వగృహంలో మరణించారు. ఆయన మరణించిన రోజున కూడా ఆయన కార్టూన్ ఆంధ్ర పత్రిక దిన పత్రికలో ప్రచురితం అయ్యింది. అంతే కాదు, ఆయన పంపిన కార్టూన్లు, జులై 1984 చివరివరకూ ఆ దినపత్రిక వారు వేస్తూనే ఉన్నారు . కాని ఆయన ఫొటో కాని ఇతర వివరాలు కాని ప్రచురించే మనసు లేకపోయింది ఆనాటి సంపాదకులకు.
ఆయన కార్టూన్లను ప్రాచుర్యంలోకి తీసుకు రావటానికి ప్రత్యేకంగా ఊమెన్ కార్టూన్లు అని ఒక బ్లాగు కొంతకాలం క్రితం ప్రారంభించాను. ఇప్పుడు గూగుల్ ఇమేజెస్ లో ఊమెన్ కార్టూన్లు అంటే ఆయన కార్టూన్లు చాలా కనపడతాయి. మునుపు ఆ పరిస్థితి లేదు. ఈ కింది లింకు నొక్కి ఊమెన్ కార్టూన్లు బ్లాగు చూడవచ్చు
http://oomencartoons.blogspot.in/
ఈ బి పి ఆచార్య ఎవరండీ ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తున్నది.
ధన్యవాదాలు
Deleteమీ సేకరణ చాలా బాగుందండి.
ReplyDeleteధన్యవాదాలు
DeleteVERY GOOD COLLECTION THANKS FOR YOUR BLOG
ReplyDelete