Wednesday, June 1, 2016

గ్రామఫోన్ వచ్చిన కొత్తల్లో

ఆ రోజుల్లో ఏదన్నా కొత్త ఆవిష్కరణ జరిగితే ఇదేదో ప్రపంచ వినాశనానికే పుట్టిందని భయపడేవారుట. రైళ్ళు వచ్చిన కొత్తల్లో ఇనుపదయ్యం వచ్చిందన్నారుట, పోస్ట్ కార్డు వచ్చినప్పుడు ప్రజల రహస్యాలను తెలుసుకోటానికి ప్రభుత్వం పన్నిన పన్నాగమన్నారుట, ఇంగ్లాడులో గొడుగులు కనిబెట్టినప్పుడు వాటినిచూసి కుక్కలు మొరిగాయిట, అలాగే గ్రామఫోన్ రికార్డు వచ్చినప్పుడు కూడా ఆ పెట్టెలో ఎవరో దాక్కొని పాడుతున్నారని అనుకోనేవారుట. కాలక్రమంలో అసలు గ్రామఫోన్ రికార్డు కలిగిఉండటమే చాలాగొప్పగా భావించేవారు. మా చిన్నప్పుడు ఊళ్లో ఎవరింట్లోఅన్నా పెళ్లిఅయితే గ్రామఫోన్ రికార్డులు వేసి చెవుల్లోతుప్పు వదలగొట్టేవారు. అనగూడదుగాని ఈ గ్రామఫోనుకి చిలిపితనం జాస్తి. ఒక్కోసారి ఒకేముక్క పట్టుకొని పాడిందేపాడుతూ చెడ్డఇబ్బంది పెట్టేస్తుంది. కావాలంటే మీరే వినిచూడండి. ఆ రోజుల్లో ఆకాశవాణి వారి అనౌన్సర్స్ ని, శ్రోతలను ఇలాగే ఏడ్పించుకు తినేది. ఒక ఆసామి గ్రామఫోన్ లో ఓ పెద్దాయన ఏకబిగిన చేసిన రాగాలాపనకు కడుంగడు సంతసించి, ఇలా రాగం తీయటం ఈలపాటివారికి కూడా రాదనిన్నీ గ్రహించి, ఆ పెద్దాయనకు సన్మానంచేయ నిశ్చయించి కార్యోన్ముఖుడై యుండగా అంత పెద్దరాగం ఆయన తీయలేదని ఆ ఆరునొక్కరాగం గ్రామఫోన్ చేసిన నిర్వాకం అని గ్రహించి ఇక  గ్రామఫోన్ వినగూడదని తీర్మానించుకున్నాడుట.












...

సరే విషయానికి వస్తే, శ్రీ మొదలి వేంకటసుబ్రహ్మణ్య శర్మ గారు గ్రామఫోనుకు చమత్కారం మేళవించి రాసిన ఒక వ్యాసం ఆంధ్రభూమి జనవరి 1934 సంచికలో వచ్చింది చూద్దాము. వీరు  ఆచార్య శ్రీ మొదలి నాగభూషణ శర్మ గారి తండ్రి గారనుకుంటాను. 











Tags: Modali Venkatasubrhmanya Sarma, Gramophone record,

1 comment: