చిన్నక్క : ఏకాంబరం ..... ఏకాంబరం
ఏకాంబరం: ఏం చిన్నక్కా ఏదో పనిమీద వచ్చినట్లున్నావు
చిన్నక్క : చేశాక
చిన్నక్క : ఆ చేశాను
ఏకాంబరం: ఏం చిన్నక్కా ఏదో పనిమీద వచ్చినట్లున్నావు
చిన్నక్క : నాకు ప్రతిరోజూ ఒకళ్లు సూక్తి అంటూ, మరొకళ్ళు మంచిమాట అంటూ, ఇంకొకళ్లు గుడ్ మార్నింగ్ అంటూ వాట్స్ యాప్ లో మెసేజెస్ పంపించి నా కాలాన్ని అంతా హరించి వేస్తున్నారు ఏకాంబరం
ఏకాంబరం: కాలాన్ని హరింపచేసుకోటానికేగాదా వాట్స్ యాప్ వాడేది, అయినా రోజుకో సూక్తి చదివితే మంచిదేకదా, ప్రవర్తనలో పరివర్తన రాకపోతుందా
చిన్నక్క : అవుననుకో గాని ఏకాంబరం వాళ్ళంతా నెట్లో ఎక్కడో దొరికినవి పట్టుకొని షేర్ చేస్తూవుంటారు. అలాంటివి స్వయంగా తయారుచేసి వాళ్ళకు పంపించాలని నా ఆలోచన. అవి కంప్యూటర్ లో ఎలా చేయాలో నీకేమన్నా తెలుసా అని వచ్చాను.
ఏకాంబరం: ఏది ఒక ఫోటో మీద నాలుగు మంచి మాటలు రాసి వుంటాయి, ఇలాంటివా
చిన్నక్క : ఆ అవును ఏకాంబరం, ఇవి చేయటానికి ఏ సాఫ్ట్ వేర్ కావాలి, ఎలా అని
ఏకాంబరం: వీటికోసం మంచి ఫోటోలు వుంటే చాలు, అవును నీ కంప్యూటర్ లో తెలుగులో టైప్ చేయటం వస్తుందా
చిన్నక్క : ఆ
ఏకాంబరం: మరి ఇంకే, ముందు కంప్యూటర్ లో ఇలా వర్డ్ ఫైల్ ఓపెన్ చెయ్యి
ఏకాంబరం: మరి ఇంకే, ముందు కంప్యూటర్ లో ఇలా వర్డ్ ఫైల్ ఓపెన్ చెయ్యి
చిన్నక్క : చేశాక
ఏకాంబరం: ఆ పైన Insert మీద క్లిక్ చేసి తిరిగి Shapes అన్న దానిమీద క్లిక్ చేసి ఆ డ్రాప్ డౌన్ మెనూ లోంచి నీకు కావలసిన ఒక షేప్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ బ్లాంక్ వర్డ్ ఫైల్ మీద ఎక్కడన్నా క్లిక్ చేసి మౌస్ ను పట్టుకొని డ్రాగ్ చేస్తే నీవనుకున్న షేప్ వస్తుంది. MS word 2007, 2010 బట్టి ఫీచర్స్ కొంచెం మారతాయి
చిన్నక్క : అవును ఇప్పుడు Drawing Tools అని కనబడుతోంది
ఏకాంబరం: ఇప్పుడు ఆ పైన Shape Fill మీద క్లిక్ చేస్తే వచ్చే డ్రాప్ డౌన్ మెనూ లో కనిపించే Picture మీద క్లిక్ చేసి నీ కంప్యూటర్ లో ఉన్న ఎదన్నా నీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకో
చిన్నక్క : ఆ చేశాను
MS WORD 2007 |
ఏకాంబరం: ఇప్పుడు ఆ ఫోటో మీద డబుల్ క్లిక్ చేసి నీవనుకున్నది టైప్ చెయ్యి. MS Word 2007 అయితే పైన ఎడమ చేతివైపు Add Text మీద క్లిక్ చేసి టైపు చెయ్యాలి
MS WORD 2007 |
చిన్నక్క : మరీ ఇంత చిన్న అక్షరాలయితే ఎలా ఏకాంబరం
ఏకాంబరం: ఏముంది ఆ అక్షరాలను సెలెక్ట్ చేసి అలా Home లోకి వచ్చి నీకు కావలసిన ఫాంట్ సైజు ఫోటోకి సరిపడా సెలెక్ట్ చేసి కావాలంటే బొల్డ్ చెయ్యవచ్చు అలాగే ఇటాలిక్స్ లో కూడా పెట్టుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు బోలెడన్ని ఆప్షన్స్ వున్నాయి
చిన్నక్క : చాలా బావుంది ఏకాంబరం, ఇంత తేలికా
ఏకాంబరం: ఇంకా కావాలంటే మళ్ళీ Drawing Tools లోకి వచ్చి Text Effects లో చాలా ఫీచర్స్ వున్నాయి, వాటి ద్వారా రకరకాలుగా మార్చుకోవచ్చు
చిన్నక్క : అధ్బుతం ఏకాంబరం, ఇప్పుడు ఫైల్ సేవ్ చేస్తే చాలు కదా
ఏకాంబరం: ఇక్కడే వుంది గొడవంతా, నీకు కావలసింది ఫోటో కానీ వర్డ్ ఫైల్ కాదు కదా
చిన్నక్క : నిజమే ఏకాంబరం నాకు ఫోటో ఒకటే కావాలి
ఏకాంబరం: విండోస్ 7 లో అయితే ఎడం చేతి వైపు విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేసి Start - All Programs – Accessories – Snipping Tool మీద క్లిక్ చేస్తే ఒక చిన్న టూల్ ఓపెన్ అవుతుంది, అక్కడ న్యూ అన్నదానిమీద క్లిక్ చేసి తిరిగి ఫోటో మీద కావాల్సినంత మేర సెలెక్ట్ చేసి JPEG Format కింద సేవ్ చేసుకోవటమే. ఇది లేకపోతే “Pickpick Editor” అన్న చిన్న టూల్ నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకొని Screen Capture – Region ద్వారా కూడా ఇలాగే చేసుకోవచ్చు.
చిన్నక్క : బాగానే వుంది కాని ఏకాంబరం ఇది నా మొబైల్లోకి ఎలావస్తుంది.
ఏకాంబరం: ఏముంది నీ మొబైల్ను కంప్యూటర్ కు అనుసంధానం చేయటం ఒక మార్గం లేదా మెయిల్ ద్వారా పంపించి ఆ మెయిల్ మొబైల్ లో ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు గదా
చిన్నక్క : అవును కాదా, ఉంటాను ఏకాంబరం, చాలా థాంక్స్, ఇక చూడు రోజుకో ఫోటో రోజుకో సూక్తి,
ఏకాంబరం: నాకు మటుకు పంపకు పుణ్యం ఉంటుంది, వినిపించుకోకుండానే వెళ్ళిపోయింది, మా చిన్నక్కకు ఏదొచ్చినా పట్టలేము ......... ఒకటే తొందర
Tags: How to write on pictures, how to make picture posters
ఇలా ఫొటో మీద క్యాప్షన్లు రాయటం గురించి తెలుసుకోవాలని చాలాకాలంగా ఉంది. దాన్ని అద్భుతంగా- సచిత్రంగా వివరించి నా అభిలాషను నెరవేర్చారు. థాంక్యూ వెరీ మచ్.
ReplyDeleteఇంత మంచి పోస్టులో ముగింపు కూడా అంతే బాగా, సరదాగా ఉంది!
ధన్యవాదాలు
Delete