ఏకాంబరం: చిన్నక్కా, చిన్నక్కా
చిన్నక్క: ఏం ఏకాంబరం, అంత కోపంగా వచ్చావు
ఏకాంబరం: కాక, ఇంతకు ముందు నువ్వు “పాత తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా” అని చెప్పావు గుర్తుందా
చిన్నక్క: అవును చెప్పాను
ఏకాంబరం: ఏం లాభం, ఒక్క పుస్తకం కూడా డౌన్లోడ్ అవటంలేదు డి. ఎల్. ఐ. నుండి ఆ సాఫ్ట్ వేర్ ద్వారా
చిన్నక్క: ఓ అదా, నీకు చెప్పటం మరిచాను ఏకాంబరం, ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవటానికి అవకాశం కల్పించారు, ఇప్పడు చాలా తేలిక
ఏకాంబరం: మరి ఎలా చేసుకోవాలి
చిన్నక్క: ఇదిగో దాని లింకు, కుడి చేతివైపు “స్కానింగ్ సెంటర్” మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇలా సెంటర్ వారీగా కనబడతాయి. కావాల్సిన సెంటర్ మీద క్లిక్ చేస్తే పుస్తకాల లిస్టు కనబడుతుంది. లేదా అలా కుడిచేతివైపు కనబడే ఇతర మార్గాల ద్వారా చూడవచ్చు. లేదా సెర్చ్ ద్వారా కూడా చూడవచ్చు. ఉదాహరణకు సెర్చ్ లో బాపు అని ఈ విధంగా టైపు చేస్తే బాపు గారి కార్టూన్ల పుస్తకం కనబడుతోంది, ఇలా టైపు చేస్తే “బాపురమణీయం” పుస్తకం కనబడుతోంది. ఆ పుస్తకం మీద రైట్ క్లిక్ చేసి Save Link As మీద క్లిక్ చేస్తే ఆ పుస్తకం మొత్తం PDF లో డౌన్లోడ్ అవుతుంది. చూశావా ఎంత తేలికో. రచయిత
పేరుమీద, పుస్తకం పేరుమీద, ప్రచురణ సంస్థ పేరుమీద సెర్చ్ చేయవచ్చు.
ఏకాంబరం: మరి ఇంత సులభమార్గం పెట్టుకొని, ఇంతకు ముందు పెద్ద లెక్చర్ ఇచ్చావు
చిన్నక్క: ఏంచేసేది ఏకాంబరం, అప్పటికి అది మార్గం, ఇప్పటికి ఇది, ఇప్పుడన్నా కోపం తగ్గిందా
ఏకాంబరం: మా చిన్నక్కతో వచ్చిన తంటానే ఇది
Tags:
How to download books from DLI
అద్భుత సమాచారం. ధన్యవాదాలు.
ReplyDeleteవిలువైన వివరం ఇచ్చారు
ReplyDeleteచాలా ధన్యవాదములు
wow thank you.
ReplyDelete