సదానందం: హల్లో బావగారు
చిదానందం: ఆ రండి బావగారు ఎదో పని మీద వచ్చినట్లున్నారు
సదానందం: బావగారు ఇంటర్నెట్ నుంచి పాటలు డౌన్లోడ్ చేయటం ఎలాగన్నది తెలుసుకుందామని వచ్చాను
చిదానందం: కొన్ని సైట్స్ లో అయితే డౌన్లోడ్ కు అవకాశం వుంటుంది, కానీ ఇప్పుడు చాలా చోట్ల స్ట్రీమింగ్ ఆడియోస్ అని వినటానికే అవకాశం వుంటోంది, పైగా ఒక్కొక్క వెబ్ సైట్ ఒక్కొక్క బ్రౌసర్ లో ఒక్కోరకంగా పనిచేస్తాయి.
సదానందం: అయితే స్ట్రీమింగ్ ఆడియోస్ డౌన్లోడ్ కుదరవంటారు
చిదానందం: అలా అని ఎవరన్నారుకాని, ముందుగా ఓ విషయం మనవి చేస్తాను, ఏదైనా వ్యక్తిగత ఉపయోగానికి వాడుకోవచ్చని ఇంటర్నెట్ శాస్త్రం చెబుతోంది, అలాగే ఏదైనా మితంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వారికి కూడా అప్లోడ్ కి ఖర్చు అవుతుంది కదా.
సదానందం: అవుననుకోండి, మరి ఈ స్ట్రీమింగ్ ఆడియోస్ విన్నప్పుడు మన కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతాయిటకదా
చిదానందం: కొన్ని మాత్రమే అవుతాయి, వాటిని పట్టుకోటానికి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ఓల్డ్ వర్షన్స్ లో అవకాశం వుంది, టెంపరరీ ఇంటర్నెట్ ఫోల్డర్ లో వుంటాయి, కానీ అప్డేట్ వర్షన్స్ లో టెంపరరీ ఫోల్డర్ హైడ్ అవటంతో అవి కనబడవు.
సదానందం: ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ఓల్డ్ వర్షన్స్ లో అన్నీ ఓపెన్ అవవుకదా మరి
చిదానందం: సరే విషయానికి వద్దాము, ఈ కింద చెప్పిన రెండు వెబ్ సైట్స్ లో వాళ్ళే డౌన్లోడ్ కి అవకాశం ఇస్తున్నారు, డౌన్లోడ్ లింకు మీద కానీ, mp3 మీద కానీ రైట్ క్లిక్ చేసి save link as మీద క్లిక్ చేస్తే ఆ పాట మన కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే
సదానందం: బావగారు ఈమాట వారి వెబ్ సైట్లో స్ట్రీమింగ్ ఆడియోస్ చాలా మంచి మంచివి వున్నాయి, అవి ఏమన్నా కుదురుతాయా
చిదానందం: ఓ మార్గం వుంది, ముందుగా డెస్క్ టాప్ మీద ఓ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసే పెట్టుకోండి, ఇప్పుడు ఫైర్ ఫాక్స్ లో వారి వెబ్ సైట్ ఓపెన్ చేసి అక్కడున్న ప్లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Save Page As మీద క్లిక్ చేసి ఇందాకటి న్యూ ఫోల్డర్ లోకి సేవ్ చేయండి
సదానందం: అదేమిటి బావగారు మనం ఒకపాట మీద క్లిక్ చేస్తే ఆరు పాటలు ఒకేసారి డౌన్లోడ్ అయినాయి
చిదానందం: అదేగదామరి, ఇప్పుడు మీకు కావలసిన పాటల వరకు వేరే ఫోల్డర్ లోకి కాపీ చేసి, ఈ న్యూ ఫోల్డర్ డిలెట్ చేయండి, ఎందుకంటే దీంట్లో అక్కరలేనివి బోలెడన్ని డౌన్లోడ్ అయినాయి.
సదానందం: చాలా బావుంది బావగారు
చిదానందం: మరొక మార్గం వుంది, అదే వెబ్ పేజ్ లో రైట్ క్లిక్ చేసి view page source మీద క్లిక్ చేయండి, New Tab లో ఆ వెబ్ పేజ్ వివరాలు కనిపిస్తాయి, జాగ్రత్తగా గమనిస్తే ఆ పాట లింకు కనబడుతుంది. ఆ లింకు వరకే జాగ్రత్తగా కాపీ చేసి మరొక New Tab లో అడ్రస్ బార్ లో పేస్టు చేస్తే ఆ ఆడియో ప్లే అవుతుంది. అప్పుడు ఆ ప్లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Save Audio As మీద క్లిక్ చేసి ఆ పాటను సేవ్ చేసుకోవచ్చు లేదా ఆ ప్లేయర్ పైన, కింద ఎక్కడన్నారైట్ క్లిక్ చేసి Save Page As మీద క్లిక్ చేసి ఆ పాటను సేవ్ చేసుకోవచ్చు.
సదానందం: పై మార్గమే కొంచెం సుగమంగా కనబడుతోంది, బావగారూ ఈ మధ్య బ్రిటిష్ లైబ్రరీ వారిది ఒక వెబ్ సైట్ చూశాను దాంట్లో పాత గ్రామఫోన్ రికార్డులు ఉన్నాయి అవి కూడా స్ట్రీమింగ్ ఆడియోస్, అలాగే మన మాగంటి వారి వెబ్ సైట్ లో ఆకాశవాణి మొత్తం కొలువుతీరి వుంది, ఇవి కూడా స్ట్రీమింగ్ ఆడియోస్ మరి పై మార్గం పనిచేస్తుందా?
చిదానందం: మాగంటి వారి సైట్ లో రైట్ క్లిక్ పనిచేయదు, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 7 లో అయితే ఈ రెండువెబ్ సైట్స్ లోని పాటలు టెంపరరీ ఇంటర్నెట్ ఫోల్డర్ లో వుంటాయి, అక్కడనుండి కాపీ చేసుకోవచ్చు. అది కూడా ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ క్లోజ్ చెయ్యకముందే కాపీ చేసుకోవాలి, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ క్లోజ్ చేస్తే ఆ పాటలు డిలెట్ అయిపోతాయి.
సదానందం: మరి లేటెస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 11 లో మాగంటివారి సైట్ లోని ఆడియోలు ప్లే అవుతున్నట్లు లేదు, పైగా టెంపరరీ ఇంటర్నెట్ ఫోల్డర్ హైడ్ అయివుంటుంది.
చిదానందం: సి సి క్లీనర్ అన్న సాఫ్ట్వేర్ వినే వుంటారు. దీన్ని మనం అక్కరలేని ఫైల్స్ డిలెట్ చేయటానికి వాడుతూ వుంటాము, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చెయ్యండి.
ముందుగా బ్రిటిష్ లైబ్రరీ వారి సైట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ఎలా పని చేస్తుందో చూద్దాము. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ఇందాక అనుకున్న వెబ్ సైట్ ఓపెన్ చెయ్యండి. మీకు కావలసిన పాట మీద క్లిక్ చెయ్యండి. అవి వెనకాల డౌన్లోడ్ అయిపోయి వుంటాయి. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ క్లోజ్ చెయ్యకండి. ఇప్పుడు సి సి క్లీనర్ మీద క్లిక్ చేసి మరల Analyze మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ మీద డబల్ క్లిక్ చేయండి,
ఇప్పుడు Size మీద క్లిక్ చేస్తే పెద్ద మ్యూజిక్ ఫైల్స్ అన్ని పైకి వస్తాయి,
ఇప్పడు వాటిమీద రైట్ క్లిక్ చేసి Open Containing Folder మీద క్లిక్ చేస్తే ఆ హైడ్ అయిన ఫోల్డర్, దాంట్లో పాటలు కనబడతాయి,
ఆ పాటలు కాపీ చేసుకొండి. ఒకేసారి చాలా పాటలు ప్లే చేస్తే అవి వేరు వేరు ఫోల్డర్స్ లో కాపీ అవుతాయి. అన్ని కాపీ చేసుకున్నాక Run cleaner నొక్కండి, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ డిలెట్ అయిపోతాయి. ఆ పాటలు విని Rename చేసుకొండి.
సదానందం: బావుంది బావగారు మీరు చెప్పిన విధానము పెద్దగా అనిపించినా క్షణాల్లో కాపీ అయిపోయినాయి. ఇప్పుడు మాగంటి వారి సైట్ గురించి చెప్పండి
చిదానందం: ముందుగా ఫైర్ ఫాక్స్ లో Tools – Options – Privacy – History లో Remember History లో ఉండేటట్లు చూసుకోండి.
సి.సి.క్లీనర్ ద్వారా పాత హిస్టరీ క్లియర్ చేయండి. ఇప్పుడు ఆ సైట్ ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చెయ్యండి, ముందుగా ఒక పాట ప్లే చెయ్యండి, అది డౌన్లోడ్ అవంగానే ఫైర్ ఫాక్స్ క్లోస్ చెయ్యండి. ఇప్పడు సి.సి. క్లీనర్ ద్వారా పైన చెప్పినట్లుగా ఫైర్ ఫాక్స్ లో పెద్ద సైజ్ ఫైల్ కాపీ చేసుకొని ఒక న్యూ ఫోల్డర్ లో పేస్టు చేసుకోండి.
ఇక్కడ గమనిస్తే మనం అసలు ఆ పాటను గుర్తించలేము, అది ఏమి ఫైలో, దాని ఫార్మాట్ ఏమిటో కూడా తెలియదు. దాని మీద డబల్ క్లిక్ చేసి ఏదన్నా ఆడియో ప్లేయర్ సెలెక్ట్ చేస్తే ఆ పాట వినబడుతుంది. ఆ పాట విని ఆ ఫైల్ ను Rename చేసుకోండి.
దాన్ని mp3 లోకి మార్చటానికి ఫైర్ ఫాక్స్ కి Add On కావాలి. దాని లింకు ఇది.
దీనిని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేసి Install చేయండి. ఇప్పడు గమనిస్తే ఫైర్ ఫాక్స్ లో పైన కుడిచేతి వైపు ఆ Add On కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక convertor ఓపెన్ అవుతుంది.
ఇందాకటి ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ పాట తాలూకు ఫైల్ లాగి ఈ convertor లో పడెయ్యండి. ఆ ఫైల్ క్షణాల్లో కన్వర్ట్ అయి తరిగి అదే ఫోల్డర్ లో mp3 ఫైల్ గా కనిపిస్తుంది.
ఒక వేళ ఇది పని చెయ్యకపోతే నెట్ లో బోలెడన్ని ఆడియో Convertors దొరుకుతాయి, వాటి ద్వారా చేసుకోవచ్చు. ఈ విధానాలు ఎల్లవేళలా పనిచేయాలనిలేదు.
సదానందం: ఈ పద్ధతి బావుంది బావగారు. ఒకసారి అలవాటయితే క్షణాల్లో అయిపోతుంది. బావగారు ఈ మధ్య ఓల్డ్ తెలుగు సాంగ్స్ . కాం , సఖియా. కాం కనబడటం లేదు, సఖియా లో అయితే పాత పాటల పుస్తకాలు 1933 నుండి 1950 దాకా దాదాపు 150 పుస్తకాలు వుండేవి, అవి ఏమన్నా దొరుకుతాయా
చిదానందం: నవోదయలో ప్రయత్నించండి, సాఫ్ట్ కాపీ కాకపోతే హార్డ్ కాపీ వుంది కదా
సదానందం: మరి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా
చిదానందం: రియల్ డౌన్లోడర్ అన్న చక్కటి సాఫ్ట్ వేర్ వుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఏదన్న వీడియో చూస్తున్నపుడు కర్సర్ ఆ వీడియో మీద పెట్టినప్పుడు పైన Download This Video అని పాపప్ అవుతుంది. దీనిద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సదానందం: దీని ద్వారా ఆడియోలు డౌన్లోడ్ కావా.
చిదానందం: కావా అంటే వీరిదే ఇది వరకు ఒక డౌన్లోడర్ వుండేది. ఇప్పుడు లేదు. కొంతమంది ఇప్పటికి XP with internet explorer 7 వాడుతూవుండవచ్చు. ఇది internet explorer లోనే పని చేస్తుంది. దీని ద్వారా కొన్ని కొన్ని వెబ్ సైట్స్ లో ఆడియోలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వర్షన్ ఎక్కడన్నా లభిస్తే ప్రయత్నించండి. కొత్త వర్షన్ లో ఆడియోలు డౌన్లోడ్ కావు.
సదానందం: ఇందాకేదో రియల్ డౌన్లోడర్ గురించి చెబుతున్నారు.
చిదానందం: ఈ కొత్త వర్షన్ లింకు ఇది.
ఆ వెబ్ పేజ్ చివర్లో కనబడే ఈ సాఫ్ట్ వేర్ మనకు సరిపోతుంది.
ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఫైర్ ఫాక్స్ లో కూడా పనిచేస్తుంది. యు ట్యూబ్ లో ఏదన్నా వీడియో ఓపెన్ చేయండి. ఇది కనబడాలి. కాని ఇది ఏడు సెకన్లలో మాయమయిపోతుంది. అందుకని మొదట C drive\ Program files\realnetwroks\realdownloader లో అప్లికేషన్ ఫైల్ మీద డబల్ క్లిక్ చేసి పైన ఎడమచేతి మూల వైపు క్లిక్ చేసి Preferences మీద క్లిక్ చేసి only on mouse over లో టిక్ పెట్టి ఓకే అనాలి. అలాగే ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ అవటానికి కూడా ఒక టిక్ పెట్టాలి.
దీనివల్ల మనం వీడియోమీద కర్సర్ తిప్పినప్పుడల్లా ఈ డౌన్లోడర్ కనిపిస్తుంది. ఇది ఫైర్ ఫాక్స్ లో అయితే పైన కనబడుతుంది. ఇక దీనితో ఎటువంటి వీడియో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సదానందం: చాలా థాంక్స్ బావగారు.
చిదానందం: సంతోషం
Tags: How to download songs and videos
No comments:
Post a Comment