Sunday, March 26, 2017

కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యకదంబం - “డాక్టర్”

ప్రముఖ కవి, రచయిత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యరచన “డాక్టర్”. ఇది వారి రచన “మువ్వగోపాల” నుండి గ్రహించటం జరిగింది. ఇది 1961 లో వచ్చిన ప్రచురణ. కాటూరి వారు ఆకాశవాణి వారి కోసం రాసిన శ్రవ్యనాటికలు “మువ్వగోపాల” పుస్తకంగా ప్రచురించారు. ఆద్యంతం చతురోక్తులతో సాగుతుంది ఈ నాటిక. 

చిలకమర్తి వారి రేడియో నాటకం “గణపతి”లో సింగమ్మగా – పి. సీతారత్నం, గణపతిగా – నండూరి సుబ్బారావు గార్ల వాచకం గుర్తుండే వుంటుంది. ఈ డాక్టర్ నాటకం చదివేటప్పుడు “రోగి” పాత్రలో నండూరివారిని, “తల్లి” పాత్రలో సీతారత్నంగారిని ఊహించుకొని చదివిచూడండి. మరి ఈ నాటకం ఆకాశవాణి వారి వద్ద లభిస్తోందా అన్నది తెలియదు.

కాటూరి వారి రచనతో పాటు వారి చేవ్రాలు, ఫోటో, వివరాలు, స్వరం కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. చూడటానికి పెద్దగా అనిపించినా, మొదలుపెడితే ఇట్టే చదివేయగలరు.  









ముద్దుకృష్ణ గారి వైతాళికులు నుండి




కాటూరి, పింగళి లక్ష్మీకాంతం గార్లు







..







































Tags: Katuri Venkateswararao, Kaaturi, Kaatoori, Katoori, Muvvagopala, Pingali Lakshmikantam, Chellapilla Venkata Sastry,


2 comments:

  1. అప్పటికి ఇప్పటికి రోగి వైద్య సంబంధం నమ్మి నమ్మక అలాగే ఉన్నట్టుండి. విశాలాక్ష్మి గారి ధైర్యం ఎక్కడో ముళ్ళపూడి వారి తల్లి గారి గురించి వ్రాసిన విషయాన్ని గుర్తుకుతెచ్చింది. అసలీ తల్లుల దైర్యం చూస్తే ఎంత ముచ్చటేస్తుందో!

    ReplyDelete
  2. శ్రీ కాటూరి వారు మా మేనమామ శ్రీ రాపర్ల జనార్ధన రావు గారి మిత్రులు. నేను మోటూరులో మా మేనమామ గారింట్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, వీరి ఆతిధ్యం లో తరించాను. నా వయస్సు అప్పుడు 10. శాంతారామ్ సినిమా నవరంగ్ శరత్ టాకీసులో ఆరోజు చూశాము. మా అమ్మ తరువాత మా మేనమామను " అరేయ్ జనార్ధన " అని పిలిచే స్నేహశీలి. వారి స్మృతి కి నా నమోవాకములు.

    ReplyDelete