Tuesday, November 28, 2017

మనచిత్రకారులు – శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు

ఈ ‘మనచిత్రకారులు’ శీర్షికన ఇప్పటి వరకు ముప్ఫై మందికి పైగా చిత్రకారుల చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవాళ ప్రముఖ చిత్రకారులు   శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు వరంగల్ జిల్లా మహబుబబాద్ తాలూకా పెనుగొండ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో 07.01.1924 నాడు జన్మించారు. ప్రధమ తెలుగు మహాసభల సందర్భంగా వీరు ‘తెలుగు తల్లి’ చిత్రాన్ని చిత్రించారు. వీరు చిత్రలేఖనము మీద అనేక వ్యాసములు కూడా రచించారు. వీరు ఆకాశవాణి వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇక్కడ వినవచ్చు. 


































..



Tags: Kondapalli Seshagirirao

Wednesday, November 22, 2017

తెలుగు ప్రముఖుల సంతకాలు

ఒక ప్రసిద్ధ రచయితగాని, విశిష్ఠ వ్యక్తిగాని స్వయానా సంతకంచేసిన పుస్తకము మనదగ్గర ఉంటే కలిగే ఆనందం వేరు. ఒక్కోసారి రచయితలు, పండితాభిప్రాయం కోసమో, జ్ఞాపకార్ధమో, అభిమానంతోనో ఇచ్చిన పుస్తకాలు అటుతిరిగి ఇటుతిరిగి పాత పుస్తకాలవారి దగ్గర దర్శనమిస్తూవుంటాయి . అలా సేకరించిన పుస్తకాలలోని సంతకాలు కొన్ని చూద్దాము. 

విజయచిత్ర మాసపత్రికవారు బాలుగారి సంతకంతోకూడిన “తెలుగు సినిమా పాట” పుస్తకం అప్పట్లో కోరినవారికి పంపించారు. విశ్వనాధవారు సంతకంచేసి మాతాతగారు శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారికి ఇచ్చిన “కిన్నెరసాని పాటలు” పుస్తకం ఇప్పటికీ గుర్తుగా పదిలంగావున్నాయి. 

అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు సంచికలో ప్రచురించిన ప్రముఖుల సంతకాలు కూడా ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. 


































Tags: Signatures of noted Telugu personalities

Saturday, November 18, 2017

పాత సినిమా పాటల పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా

సదానందం: హల్లో బావగారు 

చిదానందం: ఆ రండి రండి బావగారు, బహుకాల దర్శనం 

సదానందం: బావగారు సినిమా పాటల పుస్తకాలు ఎక్కడన్నా లభిస్తాయా, ఇదివరకు ‘సఖియా.కాం’ అన్న వెబ్సైట్లో సినిమా పాటల పుస్తకాలు స్కాన్ చేసిన కాపీలు లబించేవి, ఇప్పుడు ఆ వెబ్సైట్ లేదు, ఆ పుస్తకాలు లేవు. అలా స్కాన్ చేసిన పుస్తకాలు ఎక్కడన్నా దొరుకుతాయాయని 






చిదానందం: ఈ పాత సినిమా పాటల పుస్తకాలు దొరికే ఒక వెబ్సైట్ ఉన్నది. ఈ వెబ్సైట్లో కొన్ని వందల పాటల పుస్తకాలు అందునా అనేకభాషల్లో, పైగా సినిమాలకు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ కోకొల్లలుగా ఉన్నాయి. ఇది ఆ వెబ్సైట్ లింకు 



సదానందం: ఎన్ని పాటల పుస్తకాలు బావగారు, మరి ఎలా చూడాలి 

చిదానందం: ఏముంది ముందుగా ఆ కనబడే ఓ పాటల పుస్తకం మీద క్లిక్ చేయండి చెబుతాను 

సదానందం: ఆ పాటల పుస్తకం ఓపెన్ అయ్యింది 


చిదానందం: గమనిస్తే పుస్తకం పైన కుడిచేయి మూలమీద ఒక ‘డౌన్ యారో’ వుంది చూశారు, దాని మీద క్లిక్ చేస్తే ఓ విండో ఓపెన్ అవుతుంది, ఏముంది తరువాత ఆ ‘ఓకే’ మీద క్లిక్ చేసి, మన కంప్యూటర్లో ఎక్కడ సేవ్ చేసుకోదలచుకున్నారో అక్కడకు పాత్ ఇస్తే అక్కడకు పి.డి.ఎఫ్. ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయిన పుస్తకం పైన మిగతా పుస్తకాలు కనబడుతున్నాయి కదా, వాటి మీద క్లిక్ చేస్తే ఆ పుస్తకం ఓపెన్ అవుతుంది, 




సదానందం: ఒకవేళ భలానా పుస్తకం కావాలంటే 

చిదానందం: పైన మూల మీద “ఫైండ్ ఆల్” ఎదురుగా కావలసిన సినిమా పేరు కొట్టండి, ఉంటే ఓపెన్ అవుతుంది. 

సదానందం: బావుంది బావగారు వుంటాను మరి 

చిదానందం: సంతోషం 

Tabs: Cinema Songs Books

Thursday, November 16, 2017

చందమామ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా

చిన్నక్క: ఏం ఏకాంబరం ఏంచేస్తున్నావేమిటి? 

ఏకాంబరం: ఆ ఏముంది చిన్నక్కా, ఏదో ఉబుసుపోక పాత చందమామ కధలు చదువుతున్నాను


చిన్నక్క: నీకేం ఏకాంబరం, చందమామ పుస్తకాలు చక్కగా సేకరించి దాచిపెట్టుకున్నావు, చదువుకుంటావు, మాకెక్కడ దొరుకుతాయి చెప్పు 

ఏకాంబరం: అదేంటి చిన్నక్కా ఇంటర్నెట్లో ఎక్కడ బడితే అక్కడ దొరుకుతాయిగా 

చిన్నక్క: ఏంటి దొరికేది, అవన్నీ లింకులు పనిచేయటంలేదు 

ఏకాంబరం: అదేంటి చిన్నక్కా, ఇప్పుడు చందమామ వాళ్ళే పాత చందమామలు నెట్లో చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు 

చిన్నక్క: నాకు తెలియదు ఏకాంబరం, ఎక్కడో చెప్పావు కాదు 

ఏకాంబరం: ఇదిగో ఇది లింకు


చిన్నక్క: అబ్బ ఎన్ని చందమామలో 

ఏకాంబరం: ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో లభ్యమవుతున్నాయి 

చిన్నక్క: ఇంతకీ ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చా ఏకాంబరం 

ఏకాంబరం: కావాలనుకుంటే చేసుకోవచ్చు 

చిన్నక్క: మరి ఎలాగో చెప్పావు కాదు 

ఏకాంబరం: ముందుగా కావల్సిన సంవత్సరాలమీద క్లిక్ చేస్తే ఇలాగున కన్పిస్తాయి 



చిన్నక్క: కావల్సిన నెల మీద క్లిక్ చేస్తే చాలనుకుంటాను 

ఏకాంబరం: అలాచేస్తే పుస్తకం అక్కడే ఓపెన్ అవుతుంది చదువుకోటానికి 

చిన్నక్క: మరి డౌన్లోడో 

ఏకాంబరం: దానికే వస్తున్నా, ఆ కనబడే నెలమీద రైట్ క్లిక్ చేసి “Save Link As” మీద క్లిక్ చేసి మన కంప్యూటర్లోకి ఎక్కడ సేవ్ చేసుకోవాలో అక్కడకి పాత్ ఇస్తే, ఠపీమని డౌన్లోడ్ అవుతుంది, అదిగూడా పి.డి.ఎఫ్. ఫార్మాట్లో. 






చిన్నక్క: చాలా బావుంది ఏకాంబరం 

ఏకాంబరం: ఇక్కడ పొరపాటున ఒకటే సంచికని, అయిదారు నెలలకు లింకు ఇచ్చారు, దానివల్ల అదే పుస్తకం డౌన్లోడ్ అవుతుంది. 

చిన్నక్క: ఇహ చూసుకో ఏకాబరం, మొత్తం డౌన్లోడ్ చేసేసుకొని నా టాబ్లెట్లో వేసుకొని చక్కగా ప్రయాణాల్లోకూడా చదువుకుంటాను, 

ఏకాంబరం: పెద్ద, మొత్తం చదివేదాన్లాగా చెబుతున్నావు, మా చిన్నక్కను ఏదివచ్చినా పట్టలేము, ఒకటే ఆరాటం 

చిన్నక్క: ఏది ఏమైనా మంచి విషయం చెప్పావు ఏకాంబరం, వుంటానూ ఇహ ఇదేపని 

ఏకాంబరం: సంతోషం 

Tabs: Chandamama