Friday, January 5, 2018

చింతామణి నాటకం పద్యాలు

ఈమాట.కామ్ వెబ్సైట్లో పరుచూరి శ్రీనివాస్ గారు చింతామణి నాటకంలోని పద్యాల ఆడియోలు పోస్ట్ చేశారు. ఆ ఆడియోల తాలూకు పద్యాల సాహిత్యం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కింది లింకు ద్వారా అటు పద్యాలు ఇటు సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి పులిపాటి వెంకటేశ్వర్లు (భవానీ శంకరం పాత్ర), వేమూరి గగ్గయ్య (భవానీ శంకరం పాత్ర), గండికోట జోగినాధం (సుబ్బిశెట్టి పాత్ర), రామతిలకం (చింతామణి పాత్ర) గార్లు పాడినవి. చింతామణి నాటకం పద్యాలు మొత్తం 5 ఆడియోలు పెట్టారు. పులిపాటి వారి పద్యాలు గమనిస్తే ఇవి ఒకే ఎల్. పి. రికార్డుకు సంబంధించినట్లుగా లేవు. జోగినాధం గారి స్వరం వారి శిష్యుడు రేలంగి గారి స్వరంలాగా అనిపిస్తుంది. బొంబాయిలో ఒకసారి చింతామణి నాటకం ప్రదర్శిస్తే దాంట్లో రేలంగి గారు సుబ్బిశెట్టి వేషం వేశారు. దానికి సంబంధించిన ఒక ఫోటో చూశాను, పోస్ట్ చేద్దామంటే సమయానికి కనబడకుండా పోయింది.



రామతిలకం


పులిపాటి వెంకటేశ్వర్లు

గండికోట జోగినాధం




చింతామణి నాటకం ఊళ్ళల్లో తిరణాలకు ప్రదర్శించేవారు. హాస్యం కోసమని ఎక్కువగా ద్వంద్వార్ధాల సంభాషణలు వాడేవారు. ఈ చింతామణి ఎల్. పి. రికార్డు కూడా బాగా ప్రచారం పొందినది. చిన్నప్పుడు ఊళ్ళల్లో ఈ రికార్డు బాగా వినబడుతూ వుండేది. 
 
మంగపతి గారి "స్వర సేవ" నుండి


కింది లింకు ద్వారా  ఆస్వాదించవచ్చు



ఒకటవ ఆడియో లోని పద్యాలు 

రెండవ ఆడియో లోని పద్యాలు


ఏడవ ఆడియో లోని పద్యాలు


ఎనిమిదవ ఆడియో లోని పద్యాలు 

తొమ్మిదవ ఆడియో లోని పద్యాలు



అలాగే “కళావర్ రింగ్” గారి పాటలు కూడా శ్రీనివాస్ గారు పోస్ట్ చేశారు. మిక్కిలినేని వారి “నటరత్నాలు” లో ఈవిడ 1935లో “రాణి ప్రమీల” చిత్రంలో నటించినట్లుగా పేర్కొన్నారు. ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం లభించటం లేదు. అయితే ఈ చిత్రం తాలూకు ఈ ఫోటో మటుకు గతంలో సేకరించాను. మరి వారు వీరేనా అన్నది తెలియదు.  
 
కళావర్ రింగ్ - "తొలినాటి గ్రామఫోన్ గాయకులు" నుండి

ఆంధ్రపత్రిక దినపత్రిక సెప్టెంబర్ 1935


Tags: Chinthamani, Pulipati Venkateswarlu, Ramathilakam, Vemuri Gaggayya, Gandikota Joginatham, Kallakuri Narayanarao, Kalavar Ring,  

No comments:

Post a Comment