ఈ మధ్య టివిలో చార్లీ చాప్లిన్ గారి “సిటి
లైట్స్”
సినిమా వేస్తే అందులో ఒక స్పానిష్ సంగీతం వినిపించింది. ఇది ఎక్కడో విన్నట్లుగా
వుందని చూస్తే అది balasaraswathi devi బాలసరస్వతి దేవి గారు పాడిన "mallepoolu mallepoolu" మల్లెపూలు మల్లెపూలు పాట. దీని పూర్వాపరాలు లోకి వెళితే ఇది 1928 లో వచ్చిన ఒక
స్పానిష్ పాట. దీని ట్యూన్ 1931 లో వచ్చిన చార్లీ చాప్లిన్ గారి “సిటి
లైట్స్” లో
వాడటం జరిగింది. తరువాత 23 ఏళ్లకి 1954 లో raaji naa praanam “రాజీ నా ప్రాణం” సినిమాలో ఇదే
ట్యూన్ లో mallepoolu మల్లెపూలు మల్లెపూలు అని బాలసరస్వతి దేవి గారు చాలా
గొప్పగా పాడటం జరిగింది. తెలుగు పాట రచన దేవులపల్లి వారు,
సంగీతం ఎస్. హనుమంత రావు గారు. ఇదే పాటను బాలసరస్వతి దేవి గారు తమిళంలో గూడ
పాడటం జరిగింది. ఈ క్రింద పోస్ట్ చేసిన దాంట్లో పైన
చెప్పిన పాటల పల్లవుల వరకు తీసుకొని ఒక పాటగా రూపొందించటం జరిగింది. ఒరిజనల్
స్పానిష్ పాటను “యు
ట్యూబు” లో ఈ
లింక్ ద్వారా వినగలరు. http://www.youtube.com/watch?v=9fi313JhNzo