Saturday, March 30, 2013

వల్లారి బాబోయ్ కావురోయన్న - మానాప్రగడ నరసింహమూర్తి గారు

జానపద బ్రహ్మ మనాప్రగడ నరసింహమూర్తి గారు అద్భుతంగా గానం చేసిన హుషారైన జానపద గీతం “వల్లారి బాబోయ్ కావురోయన్న”. చాలా సంవత్సరాల కిందట రేడియోలో ప్రసారమైతే క్యాసెట్ మీద రికార్డు చేసుకున్న పాట. విని ఆనందించండి. ఈయన పాడినదే “అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు” పాట పూర్తిగా రికార్డు చెయ్యకపోవటంతో వినిపించ లేకపోతున్నాను. 

                      అనసూయ గారి జానపద గేయాలు నుండి



Friday, March 29, 2013

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా - వేములపల్లి శ్రీకృష్ణ - ఘంటసాల

ఘంటసాల మరియు బృందం పల్లెటూరు సినిమా కోసం గానం చేసిన “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా” – రచన వేములపల్లి శ్రీకృష్ణ 

Source: Mangalagiri.net







Thursday, March 28, 2013

1939 లో విడుదలైన కొన్ని చిత్రాల పోస్టర్స్

ఈ సంవత్సరంలో పన్నెండు చిత్రాల దాకా విడుదల అయ్యాయి. ఆ చిత్రాల తాలూకు లభ్యమైన కొన్ని పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది. 
 








































Wednesday, March 27, 2013

డూ డూ డూ డూ యెంకన్నా - అడవి బాపిరాజు – సూర్య కుమారి

“ప్రెభువు గారికి దణ్ణం పెట్టూ” అంటూ సంక్రాంతి పండుగలప్పుడు గంగిరెద్దుల వాళ్ళు పాడే పాట – రచన అడవి బాపిరాజు గారు – గానం టంగుటూరి సూర్య కుమారి గారు - ఆడియో సహకారం surasA.net 






                          గోసేవ (1950) సంచిక నుండి  (ప్రెస్ అకాడమీ)





ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.

Tuesday, March 26, 2013

హొలి హొలిరె రంగ హొలి – అనసూయ దేవి గారు

రంగుల పండుగ హొలి సంధర్భంగా అనసూయ, బృందం పాడిన “హొలి హొలిరె రంగ హొలి” పాట ఒకసారి మననం చేసుకుందాము. 



         అనసూయ గారి జానపద గేయాలు నుండి


br />

ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.

Monday, March 25, 2013

ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే బయలుదేరు - రజని

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి “ఏక్ లా చలో” గీతానికి బాలాంత్రపు రాజనీకాంత రావు గారు చేసిన అనువాదం “ఒక్కడవే బయలుదేరు”. తెలుగు స్వతంత్ర ఆగష్టు 1948 సంచికలో ప్రచురితమైన ఈ గేయం తాలూకు సాహిత్యం కింద పోస్ట్ చేస్తున్నాను. ఈ గేయానికి సంబంధించిన ఆడియో ఫైల్ గోపాలం గారి బ్లాగులో వుంది. ఈ కింది లింకు ద్వారా ఆ గేయాన్ని వినండి. అయితే చివరి చరణం పాటలో లేదు. అలాగే పాటలో కూడా స్వల్ప మార్పులు కనబడతాయి.



ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.


Saturday, March 23, 2013

పసిడిమెరుంగుల తళతళలు – రజని – భానుమతి

బాలాంత్రపు రాజనీకాంత రావు గారు రచించి, స్వయంగా భానుమతీ రామకృష్ణ గారితో కలిసి పాడిన “పసిడిమెరుంగుల తళతళలు” అనే తెలుగు తల్లి గేయం.

  


  


                    గృలక్ష్మి సంచిక నుండి 







Friday, March 22, 2013

వైష్ణవ జనతో - మహాత్ముని ప్రియ గీతము – తెలుగు సాహిత్యములో

ఇతర భాషలలోని పాటలు పాడాలంటే వాటిని తమ మాతృభాషలో రాసుకుంటేనేగానే పాడలేరు. గాంధీ గారికి ఇష్టమైన గుజరాతీ భజన “వైష్ణవ జనతో” సాహిత్యము తెలుగులో లభించినది (ప్రెస్ అకాడమీ లైబ్రరీ సంచికల నుండి) కింద పోస్ట్ చేస్తున్నాను. ఈ భజన పాడాలనుకొనే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ భజన యొక్క భావాన్ని (ఇంగ్లిష్ లో) కూడా కింద చూడండి. ఇక ఈ భజన యొక్క సాహిత్యాన్ని చూస్తూ విందాము. ఈ భజనను అనేక మంది పాడారు. ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గారు, లతమంగేష్కర్ గారు పాడిన ఈ భజన చాలా పాపులర్. లత గారి గళంలో మరొకసారి విని చూద్దాము. 





                                                       వికిపీడియా నుండి




కొంత మందికి తెలిసే ఉంటుంది, ఘంటసాల గారు కూడా ఈ భజనను మనదేశం (ఎన్‌టి‌ఆర్ మొదటి  సినిమా) కోసం పాడారు. అది కూడా విని చూద్దాము. 




ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.