“అతిధిశాల” రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతము, ప్రధాన పాత్ర, నిర్వహణ బాలాంత్రపు రాజనీకాంతరావు గారు. రజనీ గారు “ఆత్మకధా విభావరి”లో, 1942లోనే ఇది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైనదని పేర్కొన్నారు. తిరిగి 1964లో రికార్డింగుచేసి ప్రసారంచేసిన “అతిధిశాల” నుండి రజని గారు పాడిన గేయాలు విందాము. వీటికి సాహిత్యం కూడా సేకరించి సమకూర్చటం జరిగింది. సాహిత్యం ముద్దుకృష్ణ గారి “నవీన కావ్యమంజరి” నుండి గ్రహించటం జరిగింది. “వైతాళికులు” పుస్తకం అనగానే ముద్దుకృష్ణ గారి పేరు గుర్తుకు వస్తుంది. వారి అరుదైన ఫోటో ఒకటి కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. “తళుకు జలతార్ బుటాలల్లిన” గేయం రజని గారి గళంలోను అలాగే అనసూయాదేవి గారి గళంలోనూ విందాము. ఈ రూపకంలో పాల్గొన్న వారి పేర్లు కూడా ఈగేయం చివర్లో వినబడతాయి.
మధుపాత్ర
తళుకు జలతార్ బుటాలల్లిన
ముద్దుకృష్ణ గారు |
Tags: Atidhisaala, Devulapalli Krishna Sastry, Balanthrapu Rajanikantharao, Rajani, Muddukrishna, Radio, Vinjamoori Anasooyadevi,
Thanks for posting the audio. Listening really gets into old times.
ReplyDeleteధన్యవాదాలు
ReplyDelete